నాకే సిగ్గనిపించింది.. అందుకే రంగస్థలం తీశా.. గొల్లభామను వివాదం చెయొద్దు.. సుకుమార్

By Rajababu

Recommended Video

వివాదంలో రంగస్థలం రంగమ్మ మంగమ్మ సాంగ్

మెగాపవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ , సమంత హీరో హీరోయిన్లుగా సుకుమార్‌ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్‌పై నవీన్‌, యలమంచిలి రవిశంకర్‌; సి.వి.ఎం(మోహన్‌) నిర్మాతలుగా రూపొందుతోన్న చిత్రం 'రంగస్థలం'. ఈ సినిమా మార్చి 30న విడుదలవుతుంది. మార్చి 18న ప్రీ రిలీజ్‌ వేడుకను నిర్వహించబోతున్నారు. సినిమాకు సంబంధించిన ఆడియో మార్కెట్లోకి విడుదలైంది. ఈ సందర్భంగా సుకుమార్ మాట్లాడుతూ.. రంగస్థలం సినిమా తీయాల్సిన పరిస్థితులను, గొల్లభామ వివాదం గురించి పూర్తిగా వివరించారు. సుకుమార్ చెప్పిన విషయాలు ఆయన మాటల్లోనే..

ఆకట్టుకొంటున్న పాటలు

ఆకట్టుకొంటున్న పాటలు

'రంగస్థలం' ఆడియో నేరుగా మార్చి 15న మార్కెట్‌లోకి విడుదలైంది. సినిమాలో ఇప్పటికే 'ఎంత సక్కగున్నావే... ', 'రంగ రంగ రంగస్థలానా..', 'రంగమ్మ మంగమ్మ' అనే మూడు సాంగ్స్‌ విడుదలైయాయి. మరో రెండు సాంగ్స్‌ను జ్యూక్‌ బాక్స్‌లో వినండి. అందులో 'జిగేల్‌ రాణి ఐటెమ్‌ సాంగ్‌ ', 'ఆగట్టుకుంటావా? ఈ గట్టుకుంటావా? అనే సాంగ్స్‌ను ఎంజాయ్‌ చేయవచ్చు అని తెలిపారు.

చంద్రబోస్ గ్రేట్

చంద్రబోస్ గ్రేట్

రంగస్థలం సినిమాలో సర్‌ప్రైజ్‌ సాంగ్‌ను సినిమాలో చూడొచ్చు. ఆ సాంగ్‌ను చంద్రబోస్‌గారు పాడారు. దేవిశ్రీప్రసాద్‌, చంద్రబోస్‌గారు మంచి క్రియేటివ్‌ పర్సన్స్‌. చంద్ర‌బోస్‌గారు ప్రతి సాంగ్‌ను 10-15 నిమిషాల్లో రాసిచ్చేశారు. పాట రాసిన తర్వాతే ట్యూన్స్‌ కంపోజ్‌ చేశారు. సినిమాలో ఆరు పాటలకు ఇదే పద్ధతిని ఫాలో అయ్యాం అని ఆయన తెలిపారు.

 1980 బ్యాక్‌డ్రాప్‌తో

1980 బ్యాక్‌డ్రాప్‌తో

సినిమాను మార్చి 30న విడుదల చేస్తున్నాం. 1980 బ్యాక్‌డ్రాప్‌లో సినిమా సాగుతుంది. తప్పకుండా అందరికీ నచ్చుతుంది. ఆ కాలం నుండి వచ్చిన వ్యక్తులను సినిమా అలరిస్తుంది. మిస్‌ అయిన జనరేషన్‌ను ఈ జనరేరషన్‌లో చూడొచ్చు అని సుకుమార్ అన్నారు.

 సెట్‌ చూసి ఆశ్చర్యపోయా

సెట్‌ చూసి ఆశ్చర్యపోయా

మంచి టెక్నీషియన్స్‌ దొరకడం వల్ల నా వర్క్‌ సులభమైంది. ముఖ్యంగా ఆర్ట్‌ డైరెక్టర్‌ రామకృష్ణ, మోనికగారు 1980 బ్యాక్‌డ్రాప్‌లో సెట్‌ను చక్కగా చేశారు. నేను పెద్దగా కష్టపడలేదు. తను చాలా అందంగా సెట్‌ వేశాడు. నేను ఆ సెట్‌ చూసి ఆశ్చర్యపోయాను అని సుకుమార్ చెప్పారు.

యూఎస్‌లో నా సినిమాలు

యూఎస్‌లో నా సినిమాలు

నేను డైరెక్ట్ చేసిన `నేనొక్కడినే, నాన్నకు ప్రేమతో` సినిమాలు యూఎస్‌లో చక్కగా వసూళ్లను రాబట్టాయి. నేను అక్కడకు వెళ్లినప్పుడు ఓకాయన 'మీరు ఆర్బన్‌ బ్యాక్‌డ్రాప్‌ సినిమాలు చక్కగా చేశారు. మన సంస్కృతిలో సినిమాలు ఎప్పుడు చేస్తారు' అని అడిగారు. నాకే సిగ్గు అనిపించింది. ఇలాంటి సినిమా చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. ఇప్పటికీ కుదిరింది.

గొల్లభామ ఓ కీటకం

గొల్లభామ ఓ కీటకం

నేను 25-28 సంవత్సరాలు పల్లెటూర్లోనే పెరగడంతో మంచి అనుబంధం ఏర్పడింది. ఈ సినిమా చేయడం వల్ల నా అనుబంధాన్ని మళ్లీ వెతుక్కున్నట్లు అయ్యింది. సినిమాలో రంగమ్మ మంగమ్మ పాటలో ఉపయోగించిన గొల్లభామ అనే పదం ఓ కీటకానికి సంబంధించింది. ఎవరినీ ఎదో అనాలని చేయలేదు.

ఐటమ్ సాంగ్స్ కంపల్సరీగా..

ఐటమ్ సాంగ్స్ కంపల్సరీగా..

నేను తొలి సినిమాలో ఐటెమ్‌ సాంగ్‌ పెట్టినప్పుడు అది పెద్ద సక్సెస్‌ అయ్యింది. అక్కడ నుండి ఐటెమ్‌సాంగ్స్‌ కంపల్సరీగా పెట్టాల్సి వస్తుంది. నవీన్‌గారికి కూడా ఐటెమ్‌ సాంగ్స్‌ అంటే ఇష్టం. ఆయనకు ఈ సినిమాలో ఐటెమ్‌ సాంగ్‌ వినిపించాను. నిర్మాతలకు నచ్చడంతో.. ఐటెమ్‌ సాంగ్‌ను పెట్టాను'' అన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X