twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Sai Pallavi 10 నిమిషాల్లోనే విరాటపర్వం కథకు ఒకే చెప్పింది. రానా గొప్పతనం అదే.. వేణు ఊడుగుల (ఇంటర్వ్యూ)

    |

    బాహుబలి మూవీతో దేశవ్యాప్తంగా ప్రేక్షకుల ఆదరణను సొంతం చేసుకొన్న రానా దగ్గుబాటి, విభిన్నమైన సినిమాలతో ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించుకొన్న సాయిపల్లవి జంటగా నీది నాది ఒకే కథ ఫేమ్ వేణు ఊడుగుల దర్శకత్వంలో రూపొందిన ప్రతిష్టాత్మక చిత్రం 'విరాటపర్వం'. డి. సురేష్ బాబు సమర్పణ లో ఎస్.ఎల్.వి. సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి నిర్మించారు. ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ చిత్రంపై ఇటీవల విడుదలైన ట్రైలర్ మరింత అంచనాలని పెంచింది. జూన్ 17న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా థియేటర్లోకి రానున్న నేపధ్యంలో చిత్ర దర్శకుడు వేణు ఊడుగుల మీడియాతో మాట్లాడుతూ..

     చరిత్రలో దాచబడిన, దాగిన కథలను

    చరిత్రలో దాచబడిన, దాగిన కథలను


    నేను పుట్టిన పెరిగిన వాతావరణం. నేను చూసిన జీవితం. నేను చదివిన సాహిత్యంతో నాకు ఒక విజన్ ఏర్పడింది. దాని వల్లే నేను ఇలాంటి సినిమాలు చేయడానికి ప్రేరణగా నిలిచింది. ఎలాంటి సినిమాలు తీయాలనే దృక్పథాన్ని ఏర్పరిచింది. చరిత్రలో దాచబడిన కథలు, దాగిన కథలను ప్రేక్షకులకు చెప్పాలని అనుకొన్నాను. అందులో భాగంగానే విరాటపర్వం రూపొందింది. ఒక కాంప్లెక్స్ ఉన్న కథను, లేదా సింపుల్ స్టోరి చెప్పాలని అనుకోను. విరాటపర్వం కథ నా టెంపర్‌కు సాక్ష్యం అని వేణు ఊడుగుల అన్నారు.

    తెలంగాణ ఓ రాజకీయ ప్రయోగశాల

    తెలంగాణ ఓ రాజకీయ ప్రయోగశాల


    నా కథలు, విజన్, ఆలోచనలపై తెలంగాణలోని నక్సలైట్ ఉద్యమ ప్రభావం ఉంది. అస్థిత్వ ఉద్యమాలు, సంక్లిష్టమైన రాజకీయ వాతావరణంలో పెరిగాను. తెలంగాణ ఓ రాజకీయ ప్రయోగశాల. అక్కడ జరిగిన కొన్ని సంఘటనలు దేశ రాజకీయాలను ప్రభావితం చేశాయి. అలాంటి సంఘటన విరాటపర్వం సినిమాకు ప్రేరణగా నిలిచింది. విరాటపర్వం సినిమా కథ వెన్నెల అనే ఒక అమ్మాయి ప్రేమకథ. సరళ అనే ఒక అమ్మాయి జీవితంలో జరిగిన కొన్ని యదార్థ సంఘటనలను కథగా మలిచాం అని వేణు ఊడుగుల తెలిపారు.

    విరాటపర్వం భావోద్వేగమైన ప్రేమకథ

    విరాటపర్వం భావోద్వేగమైన ప్రేమకథ


    వామ సిద్దాంతాలు, ఉద్యమాలకు కాలం చెల్లిన విషయాలను పక్కన పెడితే.. అలాంటి నేపథ్యంతో ఒక ప్రేమ కథను చెప్పాలనే ప్రయత్నం చేశాం. విరాటపర్వం సినిమాలో ఒక భావోద్వేగమైన ప్రేమకథనే చెబుతున్నాం. 90 దశకంలో జరిగిన రాజకీయ సందర్భాన్ని తీసుకొని.. విరాటపర్వం సినిమాను తెరకెక్కించాం. ప్రతీ ఒక్కరిని కదిలించే ప్రేమకథగా ఈ సినిమా ఉంటుంది. ఓ వాదానికి అనుకూలంగానో.. ప్రతికూలంగానో ఈ సినిమాను తెరకెక్కించలేదు అని వేణు ఊడుగుల అభిప్రాయపడ్డారు.

    మానవ సంబంధాల నేపథ్యంగా

    మానవ సంబంధాల నేపథ్యంగా


    మానవ సంబంధాలకు ఎప్పుడూ సమాజంలో ప్రాధాన్యం ఉంటుంది. అలాంటి సంబంధాలను ఆధారంగా చేసుకొని విరాటపర్వంలో బలంగా చెప్పేందుకు ప్రయత్నించాం. ఓ భావోద్వేగమైన ప్రేమకథను ముందుకు తీసుకెళ్లడానికి మాత్రమే నక్సల్ బ్యాక్‌డ్రాప్‌ను వాడుకొన్నాం. ఇది నక్సల్స్ సిద్దాంతాలను చెప్పడానికి, అనుకూలంగా చెప్పడానికి చేసిన ప్రయత్నం మాత్రం కాదు అని వేణు ఊడుగుల అన్నారు.

    ఓటీటీ ఆఫర్లు భారీగానే..

    ఓటీటీ ఆఫర్లు భారీగానే..


    కరోనావైరస్, లాక్‌డౌన్ సమయంలో విరాటపర్వం సినిమాకు భారీగా ఓటీటీ ఆఫర్లు వచ్చాయి. అయితే అలాంటి ఆఫర్లు వచ్చినా నిర్మాతలు ఈ సినిమాను థియేటర్‌లోనే రిలీజ్ చేయాలని బలంగా నమ్మారు. ఈ సినిమాను ప్రేక్షకులకు చూపించాలని భావించారు. అందుకే ఇప్పటి వరకు ఈ సినిమాను రిలీజ్ కోసం ఆగాం అన్నారు.

     రానా ఒప్పుకోవడం ఆయన గొప్పతనం

    రానా ఒప్పుకోవడం ఆయన గొప్పతనం

    విరాటపర్వం సినిమా కథను రానా దగ్గుబాటికి చెప్పించి ఒప్పించడం అనేది నా గొప్పతనం కాదు. ఈ సినిమాలో రానా నటించారంటే.. అది ఆయన గొప్పతనం. కథ గొప్పతనం. కొత్త డైరెక్టర్, కొత్త ఆలోచనలతో, వైవిధ్యమైన కథతో వచ్చారని ఆయన బలంగా నమ్మారు. అందుకే ఈ సినిమా చేయడానికి ముందుకు వచ్చారు. రానా కోసం కథలో ఎలాంటి మార్పులు చేయలేదు. వాళ్లు కూడా మార్చమని అడగలేదు అని వేణు ఊడుగుల తెలిపారు.

     10 నిమిషాల్లోనే సాయిపల్లవి ఒకే చెప్పింది..

    10 నిమిషాల్లోనే సాయిపల్లవి ఒకే చెప్పింది..

    సాయిపల్లవికి ఓ కార్‌వాన్‌లో 10 నిమిషాల కథ చెప్పాను. కథ విన్న వెంటనే మరో ఆలోచన లేకుండా ఆమె ఒప్పుకొన్నారు. దాంతో ఈ సినిమా సాయి పల్లవిగా మారింది. ఇది వెన్నెల అనే అమ్మాయి కథ. రానా గారు ఈ చిత్రానికి నిర్మాత కూడా. ఆయన చాలా గొప్ప మనసుతో చాలా నిజాయితీ తో మనం తీసింది ప్రేక్షకుల వద్దకు అంతే నిజాయితీ గా తీసుకువెళితే ఆదరిస్తారని చెప్పారు. అలాగని మొత్తం వెన్నెల పాత్రే వుండదు. చంద్రుడు లేకుండా వెన్నెల వుండదు కదా.. రానా గారి పాత్ర కూడా చాలా ముఖ్యం అని వేణు ఊడుగుల తెలిపారు.

    English summary
    Needi Naadi Oke Katha fame Venu Udugula latest movie Virata Paravam. Rana, Sai Pallavi are lead pair. This movie is set to release on June 17th.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X