తివిక్రమ్ శ్రీనివాస్ గైడెన్స్ డీజే టిల్లుకు స్పెషల్ ఎట్రాక్షన్.. రొమాన్స్ హద్దులు దాటేలా.. దర్శకుడు విమల్ కృష్

సితార ఎంటర్‌టైన్‌మెంట్, ఫ్యార్చూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా సూర్యదేవర నాగ వంశీ చిత్ర నిర్మాతగా విమల్ కృష్ణ దర్శకత్వంలో రూపొందిన చిత్రం డీజే టిల్లు. ఈ చిత్రంలో సిద్ధూ జొన్నలగడ్డ, నేహా శెట్టి జంటగా నటించారు. అయితే ఈ సినిమా ఫిబ్రవరి 12వ తేదీన రిలీజ్ అవుతున్న నేపథ్యంలో దర్శకుడు విమల్ కృష్ణ మీడియాతో మాట్లాడారు. డీజే టిల్లు ఏ ఇబ్బంది లేకుండా కుటుంబంతో కలిసి డీజే టిల్లు చిత్రాన్ని చూడొచ్చని విమల్ కృష్ణ చెబుతూ..

డీజే టిల్లు కథ చెప్పగానే సిద్దూ రియాక్షన్ ఎలా అంటే

డీజే టిల్లు కథ చెప్పగానే సిద్దూ రియాక్షన్ ఎలా అంటే

2019లో డీజే టిల్లు ఐడియా వచ్చింది. సిద్దూ జొన్నలగడ్డతో షేర్ చేసుకొని కథపై వర్క్ ప్రారంభించాం. ఆ సమయంలో లాక్‌డౌన్ విధించారు. దాంతో ఈ సినిమాపై మరింతగా వర్క్ చేయడానికి అవకాశం ఏర్పడింది. సిద్దూతో నాకు 2012 నుంచి పరిచయం. తన బాడీ లాంగ్వేజ్, ఎలా మాట్లాడుతాడు ఇవన్నీ చూశా. నేను కథ రాసుకున్నప్పుడు ఈ టిల్లు క్యారెక్టర్‌కు సిద్ధు చాలా దగ్గరగా ఉన్నట్లు అనిపించింది. సిద్ధూకు చెబితే చాలా బాగుందని చేసేందుకు ముందుకొచ్చాడు. నేను కథ రాస్తే, సిద్ధూ డైలాగ్స్ రాశాడు. మేమిద్దరం కలిసి రచన చేశాం. మేము మాట్లాడుకుంటున్నప్పడే చాలా సంభాషణలు వచ్చేవి. వాటిని సినిమాలో ఉపయోగించాం. నా దగ్గర ఇది కాక మరో మూడు నాలుగు కథలు ఉన్నాయి. అయితే నా తొలి సినిమా యూత్‌ను ఆకట్టుకోవాలి. ప్రేక్షకులపై ప్రభావం చూపించాలి. అందుకే యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ కథతో తొలి సినిమా రూపొందించాను అని విమల్ కృష్ణ తెలిపారు.

నటుడిగా కంటే డైరెక్టర్ కావాలంటే..

నటుడిగా కంటే డైరెక్టర్ కావాలంటే..

బొమ్మల రామారం, జెర్సీ సినిమాలో నటించాను. కానీ నాకు ఎప్పుడు ప్రేక్షకులకు మంచి కథ చెప్పాలనే ఆలోచనతోనే ఉన్నాను. నటుడిగా కనిపించినప్పటికీ నాకు డైరెక్టర్ కావాలన్నదే ఇష్టం. అందుకే డైరెక్టర్ అయ్యాను. సిద్ధూ నేనూ సినిమాను చూసే విధానం ఒకేలా ఉంటుంది. కమర్షియల్ ఎలిమెంట్స్ ఎలా ఉండాలనే విషయంలో ఇద్దరం దాదాపు ఒకేలా ఆలోచిస్తాం. మా మధ్య ఎప్పుడూ క్రియేటివ్ విబేధాలు రాలేదు. నాకు ఒక పాయింట్ నచ్చకపోతే నేను చెప్పేవాడిని. ఆయనకు పాయింట్ నచ్చకపోతే నాకు చెప్పేవాడు. అలా మా మధ్య మంచి కెమిస్ట్రీ ఉండేది అని విమల్ కృష్ణ చెప్పారు.

నాగవంశీ నుంచి కాల్ రాగానే..

నాగవంశీ నుంచి కాల్ రాగానే..

డీజే టిల్లు సినిమా కథపై వర్క్ చేస్తున్నప్పుడు సిద్ధూ నటించిన కృష్ణ అండ్ హిజ్ లీల సినిమా విడుదలైంది. అప్పుడే నిర్మాత నాగవంశీ నుంచి సిద్ధూకు కాల్ వచ్చింది. అప్పటికే మా దగ్గర డీజే టిల్లు కథ సిద్దంగా ఉంది. వెంటనే వెళ్లి చెప్పాం. ఆయనకు నచ్చడంతో సితారలో సినిమా మొదలైంది. సినిమా తొలి భాగాన్ని ఎంత ఆస్వాదిస్తారో, ద్వితీయార్థాన్నీ చూస్తూ అంతే ఆనందిస్తారు అని విమల్ కృష్ణ తెలిపారు.

మహిళను చూసే తీరు బాధాకరం...

మహిళను చూసే తీరు బాధాకరం...

డిజే టిల్లు సినిమా ట్రైలర్‌లో హీరోయిన్ చుట్టూ నలుగురు మగాళ్లు ఉన్నట్లు చూపించాం. ఆ నలుగురు సోదరులు అవొచ్చు, స్నేహితులు అవొచ్చు. కానీ సమాజంలో మహిళను ఒక్కో సందర్భంలో చూసే కోణం వేరు. ఈ దృక్పథం తప్పు. అయితే ఈ విషయాన్ని సందేశంగా చెబితే ఎవరికీ నచ్చదు. లోతుగా వెళ్లి చర్చిస్తే విసుగొస్తుంది. కానీ నవ్విస్తూ, వినోదాత్మకంగా చూపిస్తే చూస్తారు. మేము ఎంటర్‌టైన్‌మెంట్‌గా డిజె టిల్లు సినిమా గురించి చెప్పాలనుకొన్నాం అని విమల్ కృష్ణ చెప్పారు. .

 రొమాన్స్ హద్దులు దాటేలా

రొమాన్స్ హద్దులు దాటేలా

డీజే టిల్లు ట్రైలర్‌లో హీరో, హీరోయిన్ల మధ్య రొమాన్స్ చూసి.. ఇది పూర్తి రొమాంటిక్ సినిమా అనుకుంటున్నారు కానీ సినిమాలోని కత వేరు. అయితే సందర్బాన్ని బట్టి రొమాంటిక్ సన్నివేశాలు ఉంటాయి. కథను డ్రైవ్ చేసే విధంగా ఉంటాయే తప్ప.. కావాలని రొమాన్స్ ఎక్కడా చేయించలేదు. రొమాన్స్ హద్దులు దాటేలా ఉండదు. సిద్దూ హైదరాబాద్‌లో మల్కాజిగిరిలో పెరిగారు. అతడిలో డిజె టిల్లు క్వాలిటీస్ ఉన్నాయి. ఆ బాడీ లాంగ్వేజ్, మేకోవర్ అంతా దగ్గరగా ఉంటుంది. కాబట్టి క్యారెక్టర్ లోకి త్వరగా వెళ్లిపోగలిగాడు. నరుడు బ్రతుకు నటన అని ముందు టైటిల్ అనుకున్నాం కానీ సినిమా గురించి ఎవరికి చెప్పినా ఇది డిజె టిల్లు కదా అనేవారు. దాంతో అదే పేరును టైటిల్ గా పెట్టుకున్నాం దర్శకుడు విమల్ కృష్ణ అన్నారు.

Recommended Video

Krishna Sai : సినిమాలు లాబ్స్ లో మూలుగుతున్నాయి..కాస్త పట్టించుకోండి | Sundarangudu | Filmibeat
త్రివిక్రమ్ సలహాలు, సూచనలు ఎలా అంటే..

త్రివిక్రమ్ సలహాలు, సూచనలు ఎలా అంటే..


డీజే టిల్లు సినిమా కథ పూర్తయిన తర్వాత దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌కు పూర్తిగా నేరేట్ చేశాం. మా నేరేషన్ విన్న తర్వాత తప్పకుండా చేయాల్సిన సినిమా ఇది అని ఆయన చెప్పిన మాటతో మాకు మరింత కాన్ఫిడెన్స్ పెరిగింది. ఆ తర్వాత పలు సందర్భాల్లో కొన్ని సూచనలు ఇచ్చారు. అయితే తప్పనిసరిగా తీసుకోవాలని చెప్పలేదు. మాకు ఏ మేరకు కథకు హెల్ప్ అవుతుందనే విషయాలను పరిగణనలోకి తీసుకొని సూచనలు పాటించాం. తివిక్రమ్ మాకు ఇచ్చిన గైడెన్స్ సినిమాకు చాలా ఉపయోగపడ్డాయి. త్రివిక్రమ్ గారిని తరుచూ కలవడం, మీటింగ్స్ ఈ సినిమాతో మాకు దొరికిన గొప్ప జ్ఞాపకాలుగా మిగిలిపోయాయి అని దర్శకుడు విమల్ కృష్ణ తెలిపారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X