Don't Miss!
- News
వనస్థలిపురంలో భారీ అగ్ని ప్రమాదం: దట్టమైన పొగతో జనాలు ఉక్కిరిబిక్కిరి
- Sports
అదే మా కొంపముంచింది: మిచెల్ సాంట్నర్
- Lifestyle
ప్రతి దాంట్లోనూ ఎల్లప్పుడూ విజయం సాధించే రాశుల వారు వీరు... ఇందులో మీ రాశి ఉందా?
- Finance
adani bonds: అదానీ కంపెనీలకు ఎదురుదెబ్బ.. ఝలక్ ఇచ్చిన క్రెడిట్ సుస్సీ
- Technology
ధర రూ.16,000 లోపే మీరు కొనుగోలు చేయగల, 43 ఇంచుల స్మార్ట్ టీవీలు!
- Travel
బెజవాడకు చేరువలోని ఈ జైన దేవాలయం గురించి మీకు తెలుసా!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
ఆ రెండు సినిమాలు కలిపితే 'సర్కారు వారి పాట'.. మాస్ పండుగ ఖాయమేనట!
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న సర్కారు వారి పాట మే 12వ తేదీన విడుదలకు రంగం సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా ప్రమోషన్స్ ప్రారంభించింది సినిమా యూనిట్. అందులో భాగంగా గతంలో ఈ సినిమా కోసం ఆ డైరెక్టర్గా పనిచేసిన ఏఎస్ ప్రకాష్ మీడియాకు ఇంటర్వ్యూలు ఇవ్వగా తాజాగా ఈ సినిమా ఎడిటర్ మార్తాండ్ కె వెంకటేష్ సినిమా గురించి మీడియాతో ముచ్చటించారు.. ఈ సందర్భంగా ఆయన సినిమాకు సంబంధించిన అనేక విషయాలు మీడియాతో పంచుకున్నారు వివరాల్లోకి వెళితే

మే 12వ తేదీన
సరిలేరు నీకెవ్వరు లాంటి హిట్ తర్వాత మహేష్ బాబు చేస్తున్న సినిమా సర్కారు వారి పాట. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా బ్యాంకింగ్ మోసం నేపథ్యంలో తెరకెక్కుతోందని ప్రచారం ముందు నుంచి జరుగుతోంది.
మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్ ఎంటర్ టైన్ మెంట్స్ తో పాటు ఘట్టమనేని మహేష్ బాబు ఎంటర్టైన్మెంట్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా మే 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు వస్తోంది.. ఈ సందర్భంగా మీడియాతో ముచ్చటించారు సీనియర్ ఎడిటర్ మార్తాండ్.కె.వెంకటేష్. ఈ సందర్భంగా సినిమాకు సంబంధించిన అనేక విషయాలను పంచుకున్నారు

ఆ రెండు సినిమాలు కలిపితే
ఈ సినిమా ఎలా ఉంది అని ఆయనను ప్రశ్నించగా దర్శకుడు పరశురామ్ చేసిన గత సినిమాలు చూసుకుంటే ఎక్కువగా అవి లవ్ స్టోరీ లు, ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ మాత్రమే ఉన్నాయని ఆయన అన్నారు. కానీ సర్కారు వారి పాట విషయానికి వస్తే అది పూర్తి స్థాయి మాస్ అండ్ యాక్షన్ మూవీ అని చెప్పుకొచ్చారు.
అంతేకాక పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన సూపర్ హిట్ అందుకున్న గీతగోవిందం ఆయన గురువు పూరి జగన్నాథ్ దర్శకత్వంలో సూపర్ హిట్ అందుకున్న పోకిరి సినిమా కలిపితే ఎలా ఉంటుందో ఈ సినిమా అలా ఉంటుందని చెప్పుకొచ్చారు. ఈ సినిమా ద్వారా ఒక స్ట్రాంగ్ మెసేజ్ జనాల్లోకి వెళుతుందని అది దాదాపు అందరికీ కనెక్ట్ అవుతుందని చెప్పుకొచ్చారు. సినిమా ఫస్ట్ హాఫ్ అంతా చాలా ఎంటర్టైనింగ్ గా ఉంటుందని అలాగే సెకండాఫ్ పూర్తిగా ఫ్యామిలీ ఎమోషన్స్ తో ఉంటుందని చెప్పుకొచ్చారు.

పోకిరి కంటే ఎక్కువగా
ఈ సినిమాను మూడు ప్రొడక్షన్ హౌస్ లు నిర్మిస్తున్నాయి కదా మూడింటితో పనిచేయడం ఎలా అనిపించింది అని ప్రశ్నించగా మైత్రి మూవీ మేకర్స్ తో ఇదే తనకు మొదటి సినిమా అని అన్నారు.. అయితే ఈ సినిమా దర్శకుడు పరశురామ్ తో మాత్రం గతంలో కొన్ని సినిమాల చేశానని తనకు డైరెక్టర్ తోనే పని ఎక్కువగా ఉంటుంది కాని నిర్మాతలతో ఉండదని అని చెప్పుకొచ్చారు.
సినిమా రషెస్ చూసిన సమయంలో మీకు ఎలా అనిపించింది అని ఆయనని అడిగితే నేను మొదటిసారి చూసినప్పుడు ఈ సినిమా హీరో క్యారెక్టరైజేషన్ మాస్ ఎలిమెంట్స్, ఎంటర్టైన్మెంట్ విషయంలో పోకిరి కంటే ఎక్కువగా ఉన్నట్లు అనిపించింది అని చెప్పుకొచ్చారు.
మహేష్ బాబు గారితో ఎన్ని సినిమాలు చేశారు అని ప్రశ్నించగా ఇంటర్ చంటి గారికి ఫ్రాక్చర్ కావడంతో నేను మహేష్ బాబు మొదటి సినిమా రాజకుమారుడు కోసం కొన్ని సీన్స్ ఎడిట్ చేశాను ఆ తర్వాత టక్కరిదొంగ, పోకిరి, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు వంటి సినిమాలకు ఆయనతో పని చేశానని ఇక తన కెరీర్ విషయానికి వస్తే దాదాపు 500 వరకు సినిమాలు ఎడిట్ చేశాను అని చెప్పుకొచ్చారు.

ఎడిటింగ్ రూమ్ లోనే
ఇక రిల్ యుగానికి డిజిటల్ యుగానికి ఎడిటింగ్ విషయంలో తేడా ఏం గమనించారు అని అడిగితే ఆ సమయంలో పనిచేయడం చాలా కష్టంగా ఉండేదని, ఒక సినిమాను ఎడిట్ చేయాలంటే చాలా సమయం పట్టేది అని అన్నారు. అందుకే అప్పట్లో ఎడిటర్ అంటే చాలా గౌరవం ఉండేది కానీ ఇప్పుడు ఎడిటింగ్ అనేది చాలా ఈజీ అయిపోయిందని ఆయన అభిప్రాయపడ్డారు. ఆన్లైన్ ఎడిటింగ్ మీద మీ అభిప్రాయం ఏమిటి అని ఆయనను అడిగితే ఆన్ లైన్ ఎడిటింగ్ అనేది ఒక మంచి ఐడియా అని కానీ ఫైనల్ స్క్రీన్ ప్లే మాత్రం ఎడిటింగ్ రూమ్ లోనే ఫైనల్ ఎడిటింగ్ జరుగుతుందని చెప్పుకొచ్చారు.

అందరూ హ్యాపీగా
దర్శకుడు పరశురామ్ తో పనిచేయడం ఎలా ఉంది అని ప్రశ్నిస్తే పరశురామ్ ఒక మంచి రచయిత అని ఆయన కొన్ని పవర్ ఫుల్ డైలాగ్స్ రాస్తారని చెప్పుకొచ్చారు. హీరో క్యారెక్టరైజేషన్ గురించి ఆయన రాసిన డైలాగులు అద్భుతంగా కుదిరాయని అదే సమయంలో హీరోయిన్ క్యారెక్టరైజేషన్ మీద కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు అని అన్నారు.
మొట్టమొదటి సారిగా మీరు కథ ఎప్పుడు విన్నారు అని అడిగితే ముందుగా గీత గోవిందం సినిమా చేస్తున్న సమయంలోనే నాకు పరశురామ్ ఈ కథ చెప్పాడు కథ చెప్పిన తర్వాత ఫీడ్బ్యాక్ ఇవ్వమని అడిగితే నాకు బాగా నచ్చడంతో బాగుందని చెప్పాను అని ఆయన అన్నారు.
అయితే ఎడిటింగ్ సమయంలో దర్శకులకు కొన్ని సూచనలు చేస్తుంటానని కానీ సర్కారు వారి పాట విషయంలో మాత్రం అలా జరగలేదని ఆయన అన్నారు. ఇప్పుడు సినిమా బాగా రావడంతో దాదాపు అందరూ హ్యాపీగా ఉన్నామని ఆయన చెప్పుకొచ్చారు.