For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  అరవింద సమేత అందుకోసం చేయలేదు.. ఎన్టీఆర్‌ను చూడటానికే.. ఇషా రెబ్బ (ఇంటర్వ్యూ)

  |

  సుధాకర్ ఇంపెక్స్ ఐపీఎల్' పతాకంపై సుబ్రహ్మణ్యపురం చిత్రాన్ని నిర్మాత బీరం సుధాకర రెడ్డి నిర్మించారు. మళ్లీ రావా అనే చిత్రంతో సక్సెస్ బాట పట్టిన హీరో సుమంత్ , ఈషా రెబ్బ జంటగా నటించిన ఈ చిత్రంతో సంతోష్ జాగర్లపూడి దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. డిసెంబర్ 7న (శుక్రవారం) ఈ సినిమా గ్రాండ్ రిలీజ్ అవుతున్న సందర్భంగా ఈషా రెబ్బ ఈ చిత్ర విశేషాలను మీడియాతో పంచుకున్నారు. సినిమా గురించి ఇషా వెల్లడించిన విషయాలు ఆమె మాట్లల్లోనే..

  దర్శకుడు సంతోష్ కథ చెప్పగానే

  దర్శకుడు సంతోష్ కథ చెప్పగానే

  నాకు సంతోష్ రెండు గంటల పాటు కథ చెప్పాడు.. అతను కథ చెపుతున్నప్పుడు పాత్రలను, సీన్లను పూర్తిగా విజువలైజ్ చేసుకున్నాను. కథ, కథనాలు నాకు బాగా నచ్చాయి. అందుకే ఓకే చెప్పాను. సస్పెన్స్ థ్రిల్లర్స్ అంటే నాకు చాలా ఇష్టం. అన్ని రకాల సినిమాలు చూస్తాను. కానీ నెక్ట్స్ ఏమవుతుంది అని టెన్సన్ పడుతూ సినిమాలు చూడటం నాకు ఇష్టం. ఆ ఎలిమెంట్స్ సుబ్రహ్యణ్యపురం లో చాలా ఉన్నాయి.

  నా పాత్ర ఎలా ఉంటుందంటే

  నా పాత్ర ఎలా ఉంటుందంటే

  సొంత ఊరంటే చాలా ఇష్టపడే అమ్మాయిగా నటించాను. ఫ్యామిలీ అంటే చాలా ఇష్టం. అందులోనూ తండ్రిని ఎక్కువుగా ఇష్టపడుతుంది. ఇంకా భక్తి కూడా ఎక్కువే. కానీ ఈ సినిమాలో కనిపించేంతగా కాకుండా నిజజీవితంలో నాకు భక్తి తక్కువే. ఈ చిత్రంలో లవ్ స్టోరీ ఉంది. కానీ అది థ్రిల్లర్ ఎలిమెంట్‌ను డిస్ట్రబ్ చేయకుండా ఉంటుంది. నేను భక్తురాలుగా కనిపిస్తే, సుమంత్ కంప్లీట్ అపోజిట్ రోల్ ప్లే చేసాడు. వారి మధ్య అభిప్రాయబేధాలుఉంటాయి. దేవుడు ఉన్నాడని నమ్మే అమ్మాయికి, దేవుడిపై రిసెర్చ్ చేసే అబ్బాయికి మధ్య లవ్ ఫీల్ ఎలా కలిగింది అనేది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్.

  సుబ్రహ్మణ్యపురం టీమ్‌లో ఫుల్ ఎనర్జీ

  సుబ్రహ్మణ్యపురం టీమ్‌లో ఫుల్ ఎనర్జీ

  సుబ్రహ్మణ్యపురం టీంతో వర్క్ చేయడం చాలా ఎగ్జైటింగ్ గా అనిపించింది. ఆర్‌కే ప్రతాప్ సినిమాటోగ్రఫీ, శేఖర్ చంద్ర మ్యూజిక్ సుబ్రహ్మణ్యపురం చిత్రానికి పెద్ద అసెట్‌గా నిలిచాయి. దర్శకుడు సంతోష్ మొదటి సినిమా అయినా అన్ని విభాగాల నుంచి బెస్ట్ అవుట్‌పుట్‌ని తీసుకున్నాడు. అతను కథను డీల్ చేసిన విధానం చాలా బాగుంది.

  షూట్ చేసినప్పడు థ్రిల్లవ్వలేదు

  షూట్ చేసినప్పడు థ్రిల్లవ్వలేదు

  షూట్ చేస్తున్నప్పుడు అంత భయంగా అనిపించలేదు. కానీ బ్యాక్ గ్రౌండ్ స్కోర్, విజువల్ ఎఫెక్ట్స్‌తో చూసిన తర్వాత థ్రిల్ అయ్యాను. సినిమా మొత్తంగా ఓ ఫీలింగ్ టోటాలిటీ వస్తుంది. అది తెరపైన చాలా ఎఫెక్ట్ గా ఉంటుంది.

  సుమంత్ నేచురల్ నటుడు

  సుమంత్ నేచురల్ నటుడు

  సుమంత్ సినిమాలలో గోదావరి, గోల్కొండ హైస్కూల్, మళ్లీరావా సినిమాలు నాకు ఇష్టం. ఆయన నటన సహజంగా ఉంటుంది. అదే నాకు నచ్చుతుంది. షూటింగ్ అంతా చాలా బాగా జరిగింది. రిలీజ్ తర్వాత ఫలితం కోసం ఎక్సైటింగ్ వేచి చూస్తున్నాను.

  తెలుగు అమ్మాయిలకు అవకాశాలు

  తెలుగు అమ్మాయిలకు అవకాశాలు

  నాకు దర్శకులు చెప్పిన కథలలో నాకు నచ్చినవి ఎంచుకుంటున్నాను. ఒక పాత్రకు నేను ఉంటే బాగుంటుంది అనుకునే పాత్రలను చేస్తున్నాను. నాకు కొత్త దర్శకులతో, కొత్త కాంబినేషన్స్ లో వర్క్ చేయాలని ఉంటుంది. నేను అలాంటి పాత్రలు కోసం అప్రోచ్ అవుతాను, పని అడగటంలో తప్పు లేదు. ప్రస్తుతం తెలుగు అమ్మాయిలకు అవకాశాలు ఇప్పుడు పెరుగుతున్నాయి.

  సుధాకర్‌రెడ్డి అభిరుచి గల నిర్మాత

  సుధాకర్‌రెడ్డి అభిరుచి గల నిర్మాత

  నిర్మాత అంటే ఓన్లీ బడ్జెట్‌లోనే ఇన్వాల్వ్ అవుతారని అనుకుంటారు. కానీ సుధాకర్‌రెడ్డి సినిమా కథ చర్చలలో కూడా పాల్గోనేవారు. రోజూ షూట్‌కి వచ్చి ఏం జరుగుతుందో తెలుసుకునే వారు. సుబ్రహ్మణ్యపురం అవుట్ పుట్ ఇంత ఎఫెక్టివ్‌గా రావడానికి ఆయన ఇచ్చిన సపోర్ట్ కారణం.

   మొదటి సినిమా దర్శకుడులా పనిచేయలేదు

  మొదటి సినిమా దర్శకుడులా పనిచేయలేదు

  సంతోష్ చాలా క్లారిటీ ఉన్న దర్శకుడు. అతను ఫుల్ బౌండ్ స్క్రిప్టుతో వచ్చాడు. ప్రతి సీన్ అతను వివరించే విధానం చాలా క్లారిటీ గా ఉంటుంది. ఇందులో ప్రతి పాత్రకు ఒక ప్రత్యేకత ఉండేలా డిజైన్ చేసుకున్నాడు. మొదటి సినిమా దర్శకుడిలా అనిపించలేదు.

  ఎన్టీఆర్ కోసమే

  ఎన్టీఆర్ కోసమే

  ఇటీవల కాలంలో నేను నటించిన చిత్రాలు నాకు మంచి గుర్తింపు తెస్తున్నాయి. అరవింద సమేతలోని పాత్ర నాకు సంతృప్తికరంగా ఉంది. దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కోసం నటించాను. సాధారణంగా త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాలు, పెద్ద సినిమాల్లో హీరో కోసమే వస్తారు. అందరూ ఎన్టీఆర్ కోసమే వస్తారు. నా కెరీర్‌కు ఉపయోగపడుతుందని అరవింద సమేతలో నటించలేదు. నాకు నచ్చి మాత్రమే ఆ సినిమా చేశాను.

  English summary
  Actress Eesha Rebba has landed an interesting part in her forthcoming Telugu film Subramaniapuram. Directed by debutant director Santosh Jagarlamudi, the mystery thriller features Nagarjuna’s nephew Sumanth. Talking about the project, Eesha says, This is the first time that I will be part of a thriller, so when the opportunity came, I was more than thrilled to be a part of this.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X