For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

  డిస్టిబ్యూటర్లు సహకరించడం లేదు.. చిన్న సినిమాలు గతి అంతేనా.. నిర్మాత గురురాజ్ ఆవేదన

  By Rajababu
  |

  సినిమా అంటే ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించే నిర్మాతల్లో ఎత్తరి గురురాజ్ ఒకరు. సినిమా ఫలితం ఎలా ఉన్నా.. దానిని పట్టించుకోకుండా సినిమాలను నిర్మించానికే మొగ్గు చూపుతారు గురురాజ్. గతంలో రక్షకభటుడు చిత్రాన్ని రూపొందించిన ఆయన ప్రస్తుతం మలయాళంలో సూపర్ హిట్ అయిన చిత్రాన్ని ఆనందం పేరుతో విడుదల చేస్తున్నారు. తెలుగులో అనువాద‌మ‌వుతోన్న ఆనందం చిత్రానికి వీరా వెంకటేశ్వర రావు (పెదబాబు ), వీఆర్బీ రాజు ,రవి వర్మ చిలువూరి సహ నిర్మాతలు . సీనియర్ నిర్మాత ఆర్‌. సీతారామ‌రాజు స‌మ‌ర్పిస్తున్నారు. ఈ చిత్రం మార్చి 23న రిలీజ్ అవుతున్న నేపథ్యంలో ఆనందం గురించి చిత్ర నిర్మాత ఎత్తరి గురురాజ్ మాట్లాడారు.

   నవీన్ పాల్ పాత్ర కీలకం

  నవీన్ పాల్ పాత్ర కీలకం

  మలయాళంలో సూపర్ డూపర్ హిట్ అయిన చిత్రాన్ని ఆనందం అనే పేరుతో డబ్బింగ్ చేశాం. ఈ చిత్రంలో ప్రేమమ్ ఫేం నవీన్ పాల్ కీలక పాత్రను పోషించి ఈ సినిమా విజయానికి దోహదపడ్డారు. అంతేకాకుండా చిన్న సినిమాకు ఆయన సహకరించిన విధానం కూడా ప్రశంసనీయం. ఇలాంటి పద్ధతిని తెలుగు సినిమా ఇండస్ట్రీలో కూడా రావాలి. పెద్ద హీరోలు చిన్న సినిమాలకు సహకారం అందించాలి. చిన్న సినిమాలకు ప్రోత్సాహమివ్వాలని మైక్‌లో చెప్పడం తప్పితే వాటికి సహకరించిన దాఖలాలు లేవు. ఆ వైఖరి మారాలని నేను కోరుకొంటున్నాను అని నిర్మాత గురురాజ్ అన్నారు.

   పాటలు, సినిమాటోగ్రఫీ హైలెట్

  పాటలు, సినిమాటోగ్రఫీ హైలెట్

  ఆనందం సినిమాలో పాటలు ఓ హైలెట్. పాటలు ఉండాలంటే ఏదో ఉండాలి అనే విధంగా కాకుండా కథకు, సన్నివేశాలకు అనుగుణంగా ఉంటాయి. పాటలు తెర మీద అద్భుతంగా ఉంటాయి. వాటికి ఫొటోగ్రఫీ మరో అదనపు ఆకర్షణ. ప్రతీ ఫ్రేమ్ ఆకట్టుకునేలా ఉంటాయి.

   పిక్నిక్‌కు వెళ్లినట్టు ఆనందం

  పిక్నిక్‌కు వెళ్లినట్టు ఆనందం

  సినిమా కాలేజ్ బ్యాక్ డ్రాప్‌తో రూపొందింది. ఎక్కడా అతి కనిపించదు. అసభ్యకరమైన డైలాగ్స్ వినిపించవు. హింస, గొడవలు ఈ సినిమాల ఉండవు. ఆనందం సినిమాను దర్శకుడు చక్కటి ప్రతిభతో ఈ చిత్రాన్ని పిక్నిక్‌గా ఉంటుంది. తెలుగులో రచయిత రాజశేఖరరెడ్డి డైలాగ్స్ రాశారు. వనమాలి రాసిన పాటలు చక్కగా ఉన్నాయి.

   మలయాళంలో 20 కోట్లు

  మలయాళంలో 20 కోట్లు

  ఆనందం సినిమాను మలయాళంలో 4 కోట్లతో రూపొందిస్తే దాదాపు 20 కోట్ల వసూళ్లు రాబట్టింది. మేము డబ్బింగ్ రైట్స్ తీసుకొన్న తర్వాత చాలా మంది రీమేక్ చేస్తామని ముందుకు వచ్చారు. అయితే తెలుగు నేటివిటికి దగ్గరగా ఉన్న కథ కావడంతో దానిని డబ్బింగ్ చేయాలని అనుకొన్నాం. డబ్బింగ్ చేయడం వల్ల కథలో ఉండే ఫీల్, నటీనటులు యాక్టింగ్ దెబ్బ తినకుండా ఉంటుందని అనుకొన్నాం.

   త్వరలోనే సంచలన కథతో

  త్వరలోనే సంచలన కథతో

  త్వరలోనే సుఖీభవ బ్యానర్‌పై త్వరలోనే ఓ భారీ బడ్జెట్ సినిమాతో ముందుకు వస్తున్నాం. దేశంలో సంచలనం రేపుతున్న ఓ అంశాన్ని కథగా మలుచుకొని సినిమాను రూపొందించే ప్రయత్నంలో ఉన్నాం. త్వరలోనే ప్రతికా సమావేశాన్ని నిర్వహించి సినిమా గురించి ప్రకటన చేస్తాం.

   కథపై ఉన్న నమ్మకంతోనే

  కథపై ఉన్న నమ్మకంతోనే

  ప్రస్తుతం మార్చి 23న నాలుగు సినిమాలు రిలీజ్ అవుతున్న నేపథ్యంలో ఆనందం సినిమాను కేవలం కథపై ఉన్న నమ్మకంతోనే సినిమాను రిలీజ్ చేస్తున్నాం. కథలో గానీ, సినిమాలోని గానీ దమ్ము లేకపోతే పెద్ద హీరోల సినిమాలను ప్రేక్షకులు తిరస్కరించిన దాఖలాలు ఉన్నాయి. సినిమా బాగుంటే ప్రేక్షకులు వారంతా వారే థియేటర్‌కు వస్తున్నారు. ఆ ధైర్యంతోనే సినిమాను రిలీజ్ చేస్తున్నాం.

   డిస్టిబ్యూటర్లు సహకరించడం లేదు

  డిస్టిబ్యూటర్లు సహకరించడం లేదు

  చిన్న సినిమాలకు డిస్ట్రిబ్యూటర్లు సహకరించడం లేదు. కొంతమంది చేతిలోనే థియేటర్లు ఉన్నాయి. దాంతో రిలీజ్ సమస్య ఎదురవుతున్నాయి. కొత్తవారు సినీ రంగంలోకి వచ్చి ఫలితం సాధించాలంటే చాలా కష్టపడాల్సి వస్తుంది. పెద్ద డైరెక్టర్లు, పెద్ద హీరోల సినిమాలకే డిస్టిబ్యూటర్లు మొగ్గు చూపుతున్నారు. ఇక నుంచైనా డిస్ట్రిబ్యూటర్లు మారాలి. చిన్న సినిమాలను ఆదరించాలి అని గురురాజ్ పేర్కొన్నారు.

  English summary
  Aanandam is a 2016 romantic comedy film written and directed by Ganesh Raj in his directorial debut. A Guru Raj producing this movie in as Telugu dubbing for Malayalam. V Venkateshwara Rao, VRB Raju, Ravi Varma Ch are the co producers for the movie. Aanandam follows the life of 7 second year engineering students as they embark on their very first college tour. This movie set to release on March 23. In this occassion, Guru Raj speak to Telugu Filmibeat.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more