twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Trivikram Srinivas స్పూర్తితోనే రైటర్ అయ్యా.. మాటల మాంత్రికుడిని అనుకరించడం కష్టం: గణేష్ రావూరి

    |

    వరుడు కావలెను సినిమా సబ్జెక్ట్‌పై రెండేళ్ల క్రితం నుంచే వర్క్ చేస్తున్నారు. నన్ను పిలిచి స్టోరి వినిపించి మీరు ఒక డైలాగ్ వెర్షన్ రాసిస్తే ఓ నిర్ణయం తీసుకొందామని అనుకొంటున్నామని నిర్మాత చినబాబు చెప్పారు. దాంతో నేను కథ విన్న తర్వాత కొత్తగా స్క్రీన్ ప్లే రాసుకొన్నారు. ఒక్కొక్క ఎపిసోడ్‌కు నేను రాసిన మాటలు చూసిన తర్వాత ఒకే చేశారు. అలా ఈ సినిమాకు నేను రైటర్‌గా పనిచేశాను అని గణేష్ రావూరి అన్నారు. నేను రాయడం మొదలుపెట్టిన తర్వాత మళ్లీ ఎవరూ రాయలేదు. గతంలో ఏదైనా రాశారో ఏమో తెలియదు అంటూ ఓ ప్రశ్నకు సమాధానం చెప్పారు. ఇంకా సినిమా గురించి, రైటర్‌గా తన అనుభవాలను మీడియాతో పంచుకొంటూ..

     కథ చిన్న పాయింట్ అయినప్పటికీ..

    కథ చిన్న పాయింట్ అయినప్పటికీ..

    వరుడు కావలెను సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు కొన్ని ముఖ్యమైన సీన్లు మళ్లీ బెటర్‌మెంట్ కోసం రాశాను. మురళీ శర్మతో కొని సీన్లు తప్ప.. పెద్దగా మార్పులు చేయలేదు. కథ చాలా చిన్నపాయింట్. అదే నాకు ఛాలెంజ్‌గా అనిపించింది. కథ వైవిధ్యం లేకుండా కనిపించినప్పటికీ.. రెండు గంటలపాటు ప్రేక్షకులను ఎంగేజ్‌చేయడంలో సఫలమయ్యామనే విషయం రిలీజ్ తర్వాత వచ్చిన స్పందనను బట్టి అర్ధమైంది అని చెప్పారు

    ఫన్ క్రియేషన్‌పైనే దృష్టి పెట్టాను

    ఫన్ క్రియేషన్‌పైనే దృష్టి పెట్టాను

    నేను రైటర్ కావాలని ఇండస్ట్రీకి వచ్చాను. అనుకోకుండా రివ్యూవర్‌గా వెళ్లాల్సి వచ్చింది. రివ్యూలు రాస్తున్నప్పటికీ నేను రైటింగ్‌కు దూరం కాలేదు. నేను నా స్నేహితుల సినిమాలకు సహకారం అందించాను. కథలోని పాత్రలు సరళ, సప్తగిరి, పమ్మి సాయి ద్వారా ఎలా ఫన్ క్రియేట్ చేయడం ఎలా అనే విషయంపై దృష్టిపెట్టాను. ఆ దిశగా చేసిన ప్రయత్నానికి మంచి గుర్తింపు లభించిందనే విషయం స్పష్టమైంది అని గణేష్ రావూరి తెలిపారు.

    సప్తగిరి పాత్ర మొదట్లో లేదు అంటూ

    సప్తగిరి పాత్ర మొదట్లో లేదు అంటూ

    సప్తగిరి పాత్ర మొదట్లో లేదు. కేవలం పమ్మి సాయి లేజీ క్యారెక్టర్ ఉంది. మరో పాత్రలో వెన్నెల కిషోర్ నటించాల్సి ఉంది. కానీ ఆయన విదేశాల్లో ఉండటం వల్ల సప్తగిరిని తీసుకొన్నాం. ఆయన బాడీ లాంగ్వేజ్‌కు తగినట్టుగా డైలాగ్స్ రాశాం. ఆయన క్యారెక్టర్‌కు కూడా మంచి రెస్సాన్స్ రావడం హ్యాపీగా ఉంది అని గణేష్ రావురి వెల్లడించారు.

    త్రివిక్రమ్ స్పూర్తితోనే రైటర్‌గా

    త్రివిక్రమ్ స్పూర్తితోనే రైటర్‌గా

    వరుడు కావలెను సినిమాలో త్రివిక్రమ్ శ్రీనివాస్ రెండు సీన్లకు మాటలు రాశారు. కథలో ల్యాగ్ ఉందనే ఉద్దేశంతో ఆయన రెండు కీలక సీన్లను రాశారు. నేను త్రివిక్రమ్ స్పూర్తితోనే డైలాగ్ రైటర్‌గా మారాలని ప్రయత్నించాను. ఆయన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో నన్ను ప్రశంసించడం చాలా ఆనందంగా ఉంది. రివ్యూ రైటర్‌గా పనిచేయడం వల్లనే ఈ అవకాశం వచ్చింది. నేను రాసిన రివ్యూలోని లైన్స్ చూసి చిన్నబాబు నాకు ఆఫర్ ఇచ్చారు అని గణేష్ రావూరి చెప్పారు.

    త్రివిక్రమ్‌ను అనుసరించడం కష్టం

    త్రివిక్రమ్‌ను అనుసరించడం కష్టం

    మీరు రివ్యూవర్ అయితే వరుడు కావలెను సినిమాలో ఎలాంటి లోపాలను గుర్తిస్తారనే ప్రశ్నకు.. ఈ సినిమా కథ చాలా చిన్న సబ్జెక్ట్ అనేది గ్రహించాను. ఆ లోపాన్ని బయటకు కనిపించకుండా జాగ్రత్తపడ్డాం అని గణేష్ రావూరి చెప్పారు. అయితే త్రివిక్రమ్ శైలికి దగ్గరగా నేను డైలాగ్స్ రాశారని చెప్పడం చాలా హ్యపీగా ఉంది. త్రివిక్రమ్‌ను అనుసరించడం అందరికీ సాధ్యపడదని అన్నారు.

    English summary
    Film Critic turned Writer Ganesh Ravuri shared his experience of Varudu Kavalenu. He said, Trivikram is my Inspiration.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X