For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

  ‘అల్లు అర్జున్‌కు జీవితాంతం రుణపడి ఉంటాం.. అందుకే ఆడియో వేడుకలో అలా చేశా..’

  |

  వింక్ గర్ల్, నేషన్ సెన్సేషన్ ప్రియా ప్రకాశ్ వారియర్, రోషన్ జంటగా నటించిన లవర్స్ డే చిత్రం ఫిబ్రవరి 14న రిలీజ్‌కు ముస్తాబవుతున్నది. గతనెల జరిగిన ఆడియో ఆవిష్కరణ కార్యక్రమంలో అల్లు అర్జున్ పాలుపంచుకోవడంతో లవర్స్ డే సినిమాపై భారీ అంచనాలు పెరిగాయి. అన్నివర్గాల నుంచి అనూహ్యమైన క్రేజ్ వచ్చింది. ఇలాంటి భారీ అంచనాల మధ్య లవర్స్ డే విడుదలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో నిర్మాతలు గురురాజ్ ఏ, వినోద్ రెడ్డి తెలుగు ఫిల్మీబీట్‌తో ప్రత్యేకంగా ముచ్చటించారు. గురురాజ్, వినోద్ రెడ్డి చెప్పిన విషయాలు వారి మాటల్లోనే..

  దేశవ్యాప్తంగా ప్రియా వారియర్ క్రేజ్

  దేశవ్యాప్తంగా ప్రియా వారియర్ క్రేజ్

  సినిమా పరిశ్రమపై ఉన్న మక్కువ, ఆరాధనతో కారణంగానే అంచెలంచెలుగా ఎదుగుతూ ఈ స్థాయికి చేరాం. అటు రియల్ ఎస్టేట్ రంగంలోనే కాకుండా, ఇటు సినిమా నిర్మాణంలోనూ భాగమవుతూ కళామతల్లికి సేవ చేస్తున్నాం. ఇప్పటి వరకు ఎన్నో సినిమాలను నిర్మించాం. కానీ లవర్స్ డే చిత్రం మాకు ప్రత్యేకమైనది. మా సినిమా హీరోయిన్ ప్రియా ప్రకాశ్ వారియర్ కన్నుగీటి దేశవ్యాప్తంగా ప్రజాదరణ పొందడంతో సినిమాకు మంచి హైప్ లభించింది అని గురురాజ్ పేర్కొన్నారు.

  స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రావడంతో

  స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రావడంతో

  లవర్స్ డే సినిమాకు భారీ క్రేజ్ ఏర్పడిన నేపథ్యంలో మా ఆడియో ఆవిష్కరణ కార్యక్రమానికి స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రావడంతో మా సినిమా మరోస్థాయికి వెళ్లింది. స్వతహాగా అల్లు అర్జున్ అంటే నాకు చాలా ఇష్టం. ఆయన పంచ్ డైలాగ్స్, డ్యాన్సులు చూస్తూ ఎంజాయ్ చేసేవాడిని. అలాంటి గొప్ప స్టార్ మా సినిమాను ప్రోత్సహించడంతో సంతోషంలో మునిగిపోయాం అని గురురాజ్ వెల్లడించారు.

  అల్లు అర్జున్‌కు రుణపడి ఉంటాం

  అల్లు అర్జున్‌కు రుణపడి ఉంటాం

  లవర్స్ డే సినిమా ఎంత సక్సెస్ సాధిస్తుందో మాకు తెలుసు. 25 ఏళ్ల కెరీర్‌లోనే మాకు గొప్ప సక్సెస్ రాబోతున్నది. అలాంటి క్షణంలో లవర్స్ డే ఆడియోకు అల్లు అర్జున్ రావడంతో నన్ను నేను మరిచిపోయాను. ఓ అభిమానిగా మారిపోయి గెంతులు వేశాను. ఓ చిన్న సినిమాకు అల్లు అర్జున్ అండగా నిలవడం, ప్రోత్సాహం అందించినందుకు ఆయనకు రుణపడి ఉంటాం అని గురురాజ్ తెలిపారు.

   స్టైలిష్ స్టార్ ప్రోత్సాహం మరువలేనిది

  స్టైలిష్ స్టార్ ప్రోత్సాహం మరువలేనిది

  మా ఆహ్వానాన్ని మన్నించి ఆడియో ఫంక్షన్‌కు వచ్చిన అల్లు అర్జున్‌కు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకొంటున్నాం. నేను ఇప్పటి వరకు ఎన్నో సినిమాలను పంపిణి చేశాను. కానీ ఈ సినిమాకు పంపిణీదారుడిగా, నిర్మాతగా గొప్ప అనుభూతికి లోనవుతున్నాను. అల్లు అర్జున్ వచ్చి మమ్మల్ని ప్రొత్సాహించడం ఆయన పెద్ద మనసుకు నిదర్శనం అని నిర్మాత వినోద్ రెడ్డి అన్నారు.

  నువ్వు చెప్పిన అబ్బాయిని పెళ్లి చేసుకోను: అల్లు అర్జున్ కూతురు వీడియో వైరల్!

  సంతృప్టికరంగా బిజినెస్, భారీగా

  సంతృప్టికరంగా బిజినెస్, భారీగా

  తెలుగు రాష్ట్రాల్లో లవర్స్ డే చిత్రాన్ని సుమారు 500 స్క్రీన్లలో రిలీజ్ చేస్తున్నాం. ఇప్పటికే బిజినెస్ పూర్తయింది. మాకు సంతృప్తికరమైన బిజినెస్ జరుగడంతో చాలా ఉత్సాహంగా ఉన్నాం. అమెరికాలో దాదాపు 60 స్క్రీన్లలో రిలీజ్ చేస్తున్నాం. తెలుగేతర రాష్ట్రాల్లో కూడా తెలుగు డబ్బింగ్‌ చిత్రంగా లవర్స్ డే రిలీజ్ అవుతున్నది.

  English summary
  Sensation girl Priya Prakash Warrior's Lovers day is set to release on February 14th. This movie's Audio release function on January 23rd. Stylish Star Allu Arjun is the Chief guest for the audio fuctions. A Guru Raj and Vinod Reddy are the producers. In this occassion, Producers speaks to Telugu filmibeat exclusively.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more