twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సినిమాల ఫ్లాప్ వల్లే అలాంటి పరిస్థితి.. మరోసారి నిరాశపరచను.. సీతారామం గురించి హను రాఘవపూడి (Interview)

    |

    అందాల రాక్షసితో దర్శకుడిగా నా ప్రయాణం మొదలై దశాబ్దం కాలమైందంటే ఆశ్చర్యంగా ఉంది. గత 10 ఏళ్ల కెరీర్‌లో నాలుగు సినిమాలే చేశాను. అందుకు కారణం నేను తీసిన సినిమాలు ఫెయిల్ కావడమే. అందాల రాక్షసి సినిమా చాలా తక్కువ బడ్జెట్‌తో తీశాం. ఆ సమయంలో ఇప్పుడున్నట్టు సినిమా ఇండస్ట్రీ లేదు. అయినా నిర్మాత సాయి నాకు పూర్తి స్థాయిలో స్వేచ్ఛ ఇచ్చారు. అందాల రాక్షసి సినిమా అనుకొన్నంత విజయం సాధించలేదు.

    కానీ ఆ సినిమా రాను రాను అద్భుతమైన స్పందనను కూడగట్టుకొన్నది. ఇప్పుడు అది ఒకరకమైన కల్ట్ సినిమాగా మారింది. ఆ సినిమా విషయంలో నాకు ఎలాంటి అసంతృప్తి లేదు అని హను రాఘవపూడి అన్నారు. హను రాఘవపూడి దర్శకత్వలో రూపొందిన సీతారామం సినిమా ఆగస్టు 5వ తేదీన రిలీజ్ అవుతున్నది. ఈ చిత్రంలో దుల్కర్ సల్మాన్, రష్మిక మందన్న, బాలీవుడ్ హీరోయిన్ మృణాల్ థాకూర్ తదితరులుగా నటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూలో అనేక విషయాలను వెల్లడిస్తూ..

    అందాల రాక్షసి ఫెయిల్ వల్ల

    అందాల రాక్షసి ఫెయిల్ వల్ల


    అందాల రాక్షసి సినిమా అప్పుడు కాకుండా ఆ తర్వాత వస్తే దాని ఫలితం మరోలా ఉండేదని అనుకొంటాను. కానీ ఆ సినిమా రాత అలా రాసిపెట్టి ఉంటే మన చేతిలో ఏమిలేదు. ఆ సినిమా ఫెయిల్ వల్ల చాలా ఒకరకమైన సంఘర్షణ అనుభవించాను. అది మానసికంగా కాదు. నేను ఫెయిల్యూర్స్‌కు భయపడను. సినిమా నిర్మాణం ఒక లర్నింగ్ ప్రాసెస్. నేను ఎప్పటికి అప్పుడు అప్‌డేట్ అవుతున్నాను అని హను రాఘవపూడి చెప్పారు.

     పదేళ్లలో నాలుగు సినిమాలే.. అందుకు కారణం..

    పదేళ్లలో నాలుగు సినిమాలే.. అందుకు కారణం..


    పదేళ్లలో నాలుగు సినిమాలే చేయడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. అందాల రాక్షసి తర్వాత రానా దగ్గుబాటితో సినిమా చేయాల్సింది. అయితే చివరి నిమిషంలో ఆ ప్రాజెక్టు ఆగిపోయింది. అక్కడి నుంచి మళ్లీ కృష్ణగాడి వీర ప్రేమగాధ సినిమా రిలీజ్‌కు నాలుగేళ్లు పట్టింది. నా కెరీర్‌లో అది పెద్ద గ్యాప్ అదే. ఆ తర్వాత లై, పడిపడి లేచే మనసు వెంటవెంటనే వచ్చాయి. ఆ తర్వాత లాక్‌డౌన్ కారణంగా మూడు సంవత్సరాలు పట్టింది. గ్యాప్ నేను తీసుకోలేదు అలా వచ్చింది అని హను రాఘవపూడి అన్నారు.

    కథ చెప్పడంలో కన్‌ఫ్యూజన్ వల్లే

    కథ చెప్పడంలో కన్‌ఫ్యూజన్ వల్లే


    నా సినిమాలు ఫెయిల్ అయినా నాపై అంచనాలు ఉండటం అది ప్రేక్షకులు ఇచ్చే గౌరవం. క్రాఫ్ట్ తెలిసిన నాలాంటి దర్శకుడికి సినిమా ఫ్లాప్ అయితే ఆ గౌరవం పోదు. ఒక సినిమా ఫెయిల్ అయితే నెక్ట్స్ సినిమాకు అది అడ్డంకి కాదనే నా అభిప్రాయం. పడిపడి లేచే మనసు డిజాస్టర్ అని చాలామంది, కాదు మంచి సినిమా అని మరికొందరు అంటారు. నేను ఆ రెండింటిని తీసుకొలేదు. నేను పెట్టుకొన్న లక్ష్యాన్ని చేరుకోలేకపోయాననేది నాకు అర్ధమైంది. పడిపడి లేచే మనసు ఫ్లాప్ అనేది నేను నమ్ముతాను. సెకండాఫ్‌లో నేను ఇంకా కరెక్ట్‌గా చెప్పాల్సింది. కథ చెప్పడంలో కన్‌ఫ్యూజన్ క్రియేట్ అయింది. కాబట్టి సక్సెస్‌కు, ఫ్లాప్‌కు నేనే కారణం అని హను రాఘవపూడి తెలిపారు.

    సీతారామంలో అలాంటి ఎక్సైట్‌మెంట్

    సీతారామంలో అలాంటి ఎక్సైట్‌మెంట్


    ఫ్లాప్‌, సక్సెస్ అనే విషయానికి సంబంధం లేకుండా సీతారామం సినిమా ప్రేక్షకుల అంచనాలను మించి ఉంటుంది. నాకు సీతారామం స్పెషల్ సినిమా. ఈ సినిమా కథ ఒక ఎక్సైట్‌మెంట్ క్రియేట్ చేస్తుంది. రెండు రకాల టైమ్ పీరియడ్స్‌లో జరుగుతుంది. రెండు కాలమానాల్లో సాగే కథ ప్రేక్షకుడిని థియేటర్‌‌కు రావాలి.. థియేటర్‌లోనే చూడాలనే కుతూహలాన్ని క్రియేట్ చేస్తుంది. థియేటర్‌లో చూసిన తర్వాత అద్భుతమైన సినిమాను చూశామనే థ్రిల్‌తో ప్రేక్షకుడు వెళ్తాడనేది నా నమ్మకం అని హను రాఘవపూడి చెప్పారు.

    సీతారామం కథకు స్పూర్తి ఏమిటంటే?

    సీతారామం కథకు స్పూర్తి ఏమిటంటే?


    సీతారామం సినిమా కథ ఎలా పుట్టిందంటే.. నేను కోఠికి వెళ్లి సెకండ్ హ్యాండ్ బుక్ మార్కెట్‌లో పుస్తకాలు కొనడం అలవాటు. అలా ఓ పుస్తకం కొన్నప్పుడు అందులో చదవని ఒక లెటర్ ఉంది. అయితే ఆ లెటర్‌ ఒపెన్ చేస్తే అందులో పెద్దగా మ్యాటర్ లేదు. కానీ ఒపెన్ చేయని లెటర్‌లో లైఫ్ జర్నీపై మార్చే ఏదైనా ఇంపార్టెంట్ విషయం ఉంటే.. నా జర్నీ ఎలా ఉండేదనే పాయింట్‌ నుంచి పుట్టిన కథ. పూర్తిగా ఫిక్షన్ మాత్రమే అని హను రాఘవపూడి వెల్లడించారు.

    సీతారామం లవ్ స్టోరి మాత్రమే కాదు..

    సీతారామం లవ్ స్టోరి మాత్రమే కాదు..


    సీతారామం సినిమా కథ రాసుకొన్నప్పుడు ఏ హీరోను నా దృష్టిలో పెట్టుకోలేదు. ప్రస్తుతం తెలుగులో హీరోలందరూ చాలా బిజీగా ఉన్నారు. వారి కోసం ఆగితే మరో మూడేళ్లు గ్యాప్ వచ్చే ప్రమాదం ఉంది. అలాంటి సమయంలో స్వప్న దత్ నన్ను అడగడం.. వెంటనే నేను కథ చెప్పడం.. ఆమె ఒకే చేయడంతో సీతారామం సినిమా ప్రాజెక్ట్ పట్టాలెక్కింది. అయితే ఈ సినిమాలో దుల్కర్ సల్మాన్‌ను తీసుకోవాలన్నా ఐడియా మాత్రం నిర్మాత స్వప్నదే. సౌత్ మార్కెట్‌ను దృష్టిలో పెట్టుకోలేదు కానీ.. ఈ సినిమా Larger Than Life సినిమా, ఇది లవ్ స్టోరి కాదు.. Beyond love story అని హను రాఘవపూడి చెప్పారు.

     యుద్దంతో జరిగే ప్రేమ కథలో..

    యుద్దంతో జరిగే ప్రేమ కథలో..

    యుద్ధంతో జరిగే ప్రేమ కథ అనే ఉప శీర్షికలోనే ఒక ట్విస్టు ఉంది. యుద్ధం అనేది రెండు దేశాల మధ్య జరిగే కథ కాదు. పలు మనసుల మధ్య జరిగే మానసిక సంఘర్షణ. పాత్రల మధ్య బంధాలు, అనుబంధాలు చాలా గొప్పగా ఉంటాయి. ప్రతీ పాత్ర కూడా కథను మరో లెవెల్‌కు తీసుకెళ్తుంది. తప్పకుండా ప్రేక్షకుడికి కనెక్ట్ అవుతుంది అని హను రాఘవపూడి అన్నారు.

    English summary
    Director Hanu Raghavapudi's latest movie is Sita Ramam. Dulquer Salmaan, Mrinal Thakur, Rashmika Mandanna are lead roles. This movie is going to hit the screen on August 5th. In this occassion, Telugu filmibeat bring exlusive interivew.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X