Just In
- 25 min ago
రేయ్ రేయ్ అల్లరి నరేష్ పేరు మార్చేయ్.. కామెడీ హీరోకు నాని సలహా
- 1 hr ago
రష్మిక బ్రేకప్ పై ఇంకా తగ్గని ప్రశ్నలు.. విజయ్ దేవరకొండ ఇచ్చిన జవాబుకు రిపోర్టర్ మైండ్ బ్లాక్
- 2 hrs ago
2021 గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ .. ఇండియాలో కూడా లైవ్.. ఎప్పుడంటే?
- 2 hrs ago
అరణ్య ట్రైలర్ ఎప్పుడంటే.. రచ్చ చేసేందుకు రానా రెడీ!
Don't Miss!
- News
టీఆర్ఎస్ సభ్యత్వం తీసుకుంటేనే ప్రభుత్వ పథకాలు..: ఎమ్మెల్యే రాజయ్య సంచలనం
- Sports
కొంచెం స్పిన్ అయితే చాలు ఏడుపు మొదలుపెడతారు.. మొతేరా పిచ్ విమర్శకులపై నాథన్ లయన్ ఫైర్!
- Finance
9 కంపెనీల మార్కెట్ క్యాప్ రూ.2.2 లక్షల కోట్లు డౌన్, రిలయన్స్ మాత్రమే అదరగొట్టింది
- Automobiles
అతి తక్కువ ధరకే బౌన్స్ ఎలక్ట్రిక్ స్కూటర్.. పూర్తి వివరాలు
- Lifestyle
ఈ వారం మీ రాశి ఫలాలు ఫిబ్రవరి 28 నుండి మార్చి 6వ తేదీ వరకు
- Technology
వన్ప్లస్ నార్డ్ స్మార్ట్ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
అందుకే స్టాలిన్ అని పెట్టాం.. రంగం తరువాత ఇదే.. హీరో జీవా కామెంట్స్
'రంగం' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన జీవా హీరోగా నటిస్తున్న తాజా చిత్రం స్టాలిన్. అందరివాడు ఉపశీర్షిక. నవదీప్ ప్రతి నాయకుడి పాత్రలో నటించడం విశేషం. రతిన శివ దర్శకత్వంలో తమిళంలో వరుస హిట్ చిత్రాలను అందించిన వేల్స్ ఫిలిం ఇంటర్నేషనల్ సంస్థతో కలసి తెలుగులో ప్రముఖ నిర్మాణ సంస్థ నట్టిస్ ఎంటర్టైన్మెంట్స్, క్విటీ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని తెలుగులో అందిస్తున్నాయి. ప్రంపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ బాషలలో ఫిబ్రవరి 7న భారీగా విడుదలకానున్న సందర్భంగా జీవా మీడియాతో ముచ్చటించాడు.

అందుకే ఈ టైటిల్..
తమిళ టైటిల్ సీర్.. అంటే గర్జన అని చెప్పుకొచ్చాడు. స్టాలిన్అనేది చిరంజీవిగారి సినిమా టైటిల్ కూడా కావడంతో మాకు ఆడియన్స్ అటెన్షన్ కూడా ఉంటుందనుకుంటున్నామని తెలిపాడు. ఈ సినిమాలో హీరో క్యారెక్టర్ పేరు కూడా స్టాలినే అందుకే ఈ టైటిల్ ఫిక్స్ అయ్యామని వెల్లడించాడు. అందరివాడు అనేది ఉప శీర్షిక. అందరివాడు కూడా చిరంజీవిగారి సినిమా టైటిలే. నిర్మాత చిరంజీవిగారికి పెద్ద ఫ్యాన్ అయి ఉంటారని నేను ఊహిస్తున్నానని అన్నాడు. ఇటీవల వచ్చిన కార్తి `ఖైదీ`కూడా చిరంజీవిగారి మూవీ టైటిలే. మా సినిమా కూడా అంతటి ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నానని తెలిపాడు.

అందరూ కలిసి చూడదగ్గ చిత్రం..
ఓ గ్రామంలో కుటుంబంతో సంతోషకరమైన జీవితాన్ని గడుపుతున్న ఓ మధ్యతరగతి యువకుడు ఓ సమస్యలో ఇరుక్కుంటాడని. అతను ఎలాంటి సమస్యలో చిక్కుకున్నాడు? ఈ సమస్యకు మహిళా సాధికారిత అంశం ఎలా లింక్ అయ్యిందన్నదే కథాంశమని చెప్పుకొచ్చాడు. కొన్ని వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించామన్నాడు. మహిళలకు సంబంధించిన అంశాలపై దర్శకుడు చాలా పరిశోధన చేశాడనీ, కుటుంబమంతా కలిసి వీక్షించదగిన చిత్రమిదని అన్నాడు.

అన్ని రకాల ఎమోషన్స్..
ఈ సినిమాలో యాక్షన్, ఫ్యామిలీ సెంటిమెంట్, ఫ్రెండ్‌షిప్, ఎమోషన్స్ ఇలా అన్ని అంశాలు మిళితమై ఉన్నాయని తెలిపాడు. మహిళా సాధికారత వంటి సామాజిక అంశాలను కూడా ప్రస్తావించామన్నాడు. ఇదొక మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ అని పేర్కొన్నాడు. యూత్ కెనెక్ట్ అయ్యే అంశాలు కూడా ఉన్నాయని తెలిపాడు. అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేందుకు వాణిజ్య అంశాలను కూడా జోడించామని, ఈ సినిమాకు ప్రేక్షకులు తప్పక రిలేట్ అవుతారని చెప్పుకొచ్చాడు.

రంగం తరువాత ఇదే
నేను నటించిన `రంగం` సినిమాకు తెలుగులో మంచి ప్రేక్షకాదరణ లభించిందని గుర్తు చేసుకున్నాడు. మళ్ళీ తెలుగు ప్రేక్షకులకు కావాలసిన అంశాలన్ని ఈ సినిమాలో ఉన్నాయని వెల్లడించాడు. తెలుగు నేటివిటీ, తెలుగు ప్రేక్షకులును దృష్టిలో ఉంచుకునే ఈ చిత్రంలోని కొన్ని సీన్స్, డైలాగ్స్ ఉంటాయన్నాడు. అందుకే తెలుగు ప్రేక్షకులకు ఈ సినిమా నచ్చుతుందని గ్యారెంటీగా చెప్పగలనని అన్నాడు. ఆ నమ్మకంతోనే ఈ సినిమాను తమిళంతో పాటు తెలుగులో కూడా ఒకే సమయంలో విడుదల చేస్తున్నామని తెలిపాడు.