For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  పెళ్లైన మరుసటి రోజే మిలిటరీ జవాను యుద్దానికి వెళితే? గంధర్వ మూవీ గురించి సందీప్ మాధవ్

  |

  యువ హీరో సందీప్ మాధ‌వ్‌, యువ హీరోయిన్ గాయ్ర‌తి ఆర్‌ సురేష్ జంట‌గా న‌టించిన‌ చిత్రం గంధ‌ర్వ‌. ఫ‌న్నీ ఫాక్స్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బేన‌ర్‌పై ఎఎస్‌కే. ఫిలిమ్స్ స‌హ‌కారంతో యాక్ష‌న్ గ్రూప్ స‌మ‌ర్పిస్తున్న చిత్ర‌మిది. అప్స‌ర్‌ తొలి ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం కాబోతున్నారు. ఈ చిత్రానికి నిర్మాత సుభాని సెన్సార్ పూర్త‌యి జూలై 1వ తేదీన విడుద‌ల‌కాబోతుంది. ఈ సంద‌ర్భంగా గంధ‌ర్వ చిత్ర హీరో సందీప్ మాధ‌వ్ ఆదివారంనాడు పాత్రికేయుల‌తో చిత్రం గురించి, త‌న కొత్త సినిమా గురించి ప‌లు వివ‌రాలు తెలియ‌జేశారు.

  Gandharva movie

  గంధర్వ క‌థ‌ను లాక్‌డౌన్‌లో విన్నాను. సంగీత ద‌ర్శ‌కుడు ష‌కీల్ ద్వారా దర్శకుడు అప్స‌ర్‌ క‌థ చెప్పారు. విన్న వెంట‌నే బాగా న‌చ్చేసింది. ఎందుకు సినిమా చేద్దామ‌నుకున్నానంటే, ఒక పాత్ర‌పై సినిమా ర‌న్ అవుతుంది. జ‌న‌ర‌ల్ సినిమాలోని అంశాల‌తోపాటు స‌రికొత్త పాయింట్ ద‌ర్శ‌కుడు రాసిన విధానం, న‌టుడిగా పెర్‌ఫార్మెన్స్‌కు బాగా స్కోప్ వున్న క‌థ‌. అందుకే ఖ‌చ్చితంగా చేయాల‌నిపించింది. అని సందీప్ మాధవ్ తెలిపారు.

  గంధర్వ చిత్రంలో మిల‌టరీ జవానుగా న‌టించాను. నెల‌ల‌ త‌ర‌బ‌డి డ్యూటీలో వుంటాడు. త‌ల్లిదండ్రుల‌ను, భార్యాపిల్ల‌ల‌ను వ‌దిలి వెళ్ళాల్సివ‌స్తే త‌నేం చేస్తాడు. పెళ్ళయిన మ‌రుస‌టిరోజే యుద్ధానికి వెళ్ళాల్సివ‌స్తే త‌ను ఎటువంటి నిర్ణ‌యం తీసుకుంటాడు. మొత్తంగా త‌ను అస‌లు క‌నిపించ‌కుండా పోతే ప‌రిస్థితి ఎలా వుంటుంది? ఫైన‌ల్‌గా కుటుంబ క‌థాచిత్ర‌మిది. ఈ సినిమా క‌థ 1971లో మొద‌ల‌యి 2021 వ‌రకు ర‌న్ అవుతుంది. అందుకే అలా పెట్టారు అని సందీప్ మాధవ్ పేర్కొన్నారు.

  గంధ‌ర్వ అంటే మ‌న‌కు కింపురుషులు, గంధ‌ర్వులు ఉంటార‌ని తెలుసు. వారికి చావు ఉండ‌దు. ఎప్పుడూ య‌వ్వ‌నంగానే వుంటారు. అస‌లు ఎందుకు ఇలా జ‌రుగుతుంది? స‌హ‌జంగా మ‌నిషి 50 ఏళ్ళకు చాలా మార్పుల‌కు గుర‌వుతాడు. అలాంటి వ్య‌క్తి 50 ఏళ్ళ‌కు కూడా య‌వ్వ‌నంగా ఉంటే ఎలా వుంటుంది? ఇంటికి వ‌చ్చాక భార్య‌, పిల్ల‌ల‌తోపాటు స‌మాజాన్ని ఎలా ఒప్పించాడు అన్న‌దే క‌థ‌. అలా ఇత‌ను వ‌చ్చాక కొన్ని స‌మ‌స్య‌లు ఎదుర‌వుతాయి. వాటిని ఎలా సాల్వ్ చేసుకున్నాడు. ఇది ఇంగ్లీషు సినిమాలా అనిపించినా క‌థ‌లో విష‌యం వుంది. అలా నాతో చాలామంది అన్నారు. కానీ దానికి ఈ క‌థ‌కు ఎటువంటి సంబంధంలేదు. ద‌ర్శ‌కుడు మిల‌ట్రీ ప‌ర్స‌న్ కాబ‌ట్టి అలా అని అనుకొని ఉండ‌వ‌చ్చు అని సందీప్ మాధవ్ వెల్లడించారు

  గంధర్వ ఫైనల్ కాపీ చూసుకున్నాక మేం అనుకున్న‌దానికంటే బాగా వ‌చ్చిందనిపించింది. సాయికుమార్‌, బాబూమోహ‌న్‌, పోసాని కృష్ణ మురళి, గాయ‌త్రీ సురేష్ వంటి పెర్‌ఫార్మ‌న్స్ న‌టీన‌టులున్నారు. సీనియర్స్ వ‌ల్ల మా సినిమాకు చాలా ప్ల‌స్ అయింది. ద‌ర్శ‌కుడు అప్స‌ర్ త‌ను మిల‌టరీ వాడిగా ఫీల్ అయి క‌థ‌ను రాసుకున్నారు. యుద్ధానికి వెళితే ఆ కుటుంబంలో వాతావ‌ర‌ణ ఎలా ఉంటుందో ఆయ‌న‌కు బాగా తెలుసు. పైగా ద‌ర్శ‌కుడు కావాల‌నే త‌ప‌న‌తో తెలుగు నేర్చుకుని క‌థ‌ను రాసుకున్నారు. ఆయ‌న ఆలోచ‌న విధానం నాకు బాగా న‌చ్చింది అని సందీప్ మాధవ్ చెప్పారు.

  గంధర్వ మూవీ క‌థ మూల‌మే ఫిక్ష‌న్. అయినా మ‌న ఇంటిలో ఎలిమెంట్స్ ఎలా ఉంటాయో కూడా ఆయ‌న రాసుకున్నారు. ఇందులోని పాయింట్ తండ్రీ కొడుకు మ‌ధ్య ఆప్యాయ‌త‌, భార్య‌ాభ‌ర్త‌ల మ‌ధ్య ప్రేమ‌, తాత‌కు మ‌న‌వ‌డు మ‌ధ్య ఎమోష‌న్స్ బాగా తీశారు. గ్రాఫిక్స్ ఎక్కువ‌ లేకుండా తీయ‌డం విశేషం. కొడుకు వ‌య‌స్సు 55 అయితే తండ్రి 25 ఏళ్ళ యువ‌కుడు. ఇది యండ‌మూరి సిగ్గు సిగ్గు.. న‌వ‌ల మాదిరిగా ఉంద‌ని నాతో కూడా చాలామంది అన్నారు. కానీ అదివేరు. ఇది వేరు.

  బ‌యోపిక్‌లు చేశాక ఒక ముద్ర వ‌చ్చేసింది. ప్రేక్ష‌కులు కూడా ఒక కోణంలో చూసి ఇమేజ్ ఇచ్చేస్తారు. దానిలోంచి బ‌య‌ట‌కు రావాలంటే విరుద్ధ‌మైన పాత్ర‌లు చేయాలి. ల‌వ‌ర్‌బాయ్‌గా చేయ‌లేను. అలాంటి క‌థ‌లు కూడా వ‌చ్చాయి. యాక్ష‌న్ కూడా వ‌చ్చింది. అందుకే ఇంత‌కంటే భిన్నంగా వుండాల‌ని అనుకుని ఈ సినిమా చేశాను. 1971లో న‌న్ను ఒక‌లా చూపించి 2021లో మ‌రోలా చూపించే విధంగా పాత్ర వుంది కాబ‌ట్టి న‌న్ను నేను మ‌ల‌చుకోవ‌డానికి బాగా ఉప‌యోగ‌ప‌డింది.

  గంధర్వ సినిమాకు సుభాని నిర్మాత‌, సుభాని ద‌ర్శ‌కుడు అప్స‌ర్ సోద‌రుడు. క‌థ వినే టైంలోకూడా అంద‌రం చ‌ర్చించుకుని విన్నాం. నిర్మాత‌గా సుభానిగారికి మంచి నిర్ణ‌యాలు తీసుకునే అవ‌గాహ‌న ఉంది. ఎస్‌కె. ఫిలిమ్స్ విడుదల కావడం మాకు బాగా హెల్ప్ అయింది. కొత్త ద‌ర్శ‌కుడు కాబ‌ట్టి సురేష్ కొండేటిగారు రావ‌డంతో మాకు పిల్ల‌ర్‌గా అనిపించింది. జనాల‌కు కూడా బాగా రీచ్ అయింది. సెన్సార్ స‌భ్యులు బాగా న‌చ్చింద‌ని ప్ర‌శంసించారు. కొత్త‌పాయింట్ చెప్పారు.

  పూరీ జ‌గ‌న్నాథ్‌, రామ్‌గోపాల్ వ‌ర్మ ఇద్ద‌రికీ 24 గంట‌లు సినిమానే ప్ర‌పంచం. అలా ఉంటేనే వ‌ర్క్ ఆటోమేటిక్‌గా బెట‌ర్‌గా వ‌స్తుంద‌ని తెలుసుకున్నాను. స‌హ‌జంగా సాయంత్రానికి అల‌సిపోతుంటాం. కానీ వ‌ర్మ‌, పూరీ ఇద్ద‌రూ చాలా ఎన‌ర్జిటిక్‌గా ఉంటారు. న‌టుడిగా పూరీ నుంచి చాలా నేర్చుకున్నా. పెర్‌ఫార్మెన్స్‌, కామెడీ టైమింగ్‌, డైలాగ్ ఎలా చెప్పాల‌నేది గ్ర‌హించాను. వ‌ర్మ‌గారి ద‌గ్గ‌ర ఆర్టిస్ట్ లుక్ ఎలా వుండాలి. న‌లుగురు వుంటే ఎలా బిహేవ్ చేయాలి అనేది నేర్చుకున్నా అని సందీప్ అన్నారు.

  English summary
  Gandharva movie is set to release on July 1st. Here is the Sandeep Madhav Interview.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X