For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Shiva Kartikeyan.. ఈ డాక్టర్ చాలా డిఫరెంట్.. యాక్షన్, థ్రిల్, హ్యూమర్ కలబోసిన వరుణ్ డాక్టర్

  |

  తమిళ, తెలుగు ప్రేక్షకులను తన నటనతో ఆకట్టుకొంటున్న విలక్షణ నటుడు శివకార్తీకేయన్.. రెమో, సీమ రాజా, శక్తి చిత్రాలతో మెప్పించారు. ప్రస్తుతం వరుణ్ డాక్టర్ అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. అక్టోబర్ 9వ తేదీన థియేటర్లలో రిలీజ్ అయ్యేందుకు ముస్తాబైంది. తమిళ సూపర్ స్టార్ విజయ్ నటిస్తున్న బీస్ట్ చిత్రానికి దర్శకత్వం వహించిన నెల్సన్ దిలీప్ కుమార్ ఈ సినిమాకు దర్శకుడు. కేజే ఆర్‌ స్టూడియోస్‌ అధినేత కోటపాడి జే రాజేష్‌, గంగ ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఎస్‌కే ప్రొడక్షన్స్‌తో సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. విజయదశమి కానుకగా తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ అవుతున్న నేపథ్యంలో శివ కార్తికేయన్‌ మీడియాతో మాట్లాడుతూ..

  వరుణ్ డాక్టర్ సినిమా మిగితా సినిమాలకు ఎలా డిఫరెంట్‌గా ఉండబోతున్నది?

  నేను వరుణ్ డాక్టర్ చిత్రంలో మిలటరీ డాక్టర్‌గా నటించాను. డాక్టర్లందరూ ఒకే రకంగా ఆపరేషన్లు చేస్తారు. కానీ ఈ డాక్టర్ మాత్రం కొంచెం డిఫరెంట్‌గా ఆపరేషన్ చేస్తారు. మానవ అక్రమ రవాణా, అవయవాల స్మగ్లింగ్ లాంటి అంశాలు సినిమాలో ఎమోషనల్‌గా ఉంటాయి. ఇలాంటి అక్రమాలకు ఎవరు పాల్పడ్డారు? ఎందుకు పాల్పడ్డారు అనేది సినిమా చూస్తే క్లియర్‌గా అర్ధం అవుతుంది అని శివకార్తికేయన్ చెప్పారు.

   Hero Shiva Kartikeyans Interview: Doctor will be combination of Action, Humour

  వరుణ్ డాక్టర్ మూవీ టీజర్, ట్రైలర్ చూస్తే చక్కటి యాక్షన్ డ్రామా అనిపిస్తున్నది? దీనికి మీరు ఏం చెబుతారంటే?

  వరుణ్ డాక్టర్ ట్రైలర్‌లో అలాంటి థ్రిల్ మూడ్, ఫీలింగ్స్ కనిపించడానికి అవకాశం ఉంది. కానీ ఈ సినిమాలో రెండే ఫైట్స్ ఉన్నాయి. అయితే ఫిజికల్ ఫైట్ కంటే మెంటల్ ఫైట్ ఎక్కువగా ఉంటుంది. చక్కటి ఎమోషనల్ అంశాలతో థ్రిల్లింగ్ మూడ్‌తో కథ సాగిపోతుంది అని శివకార్తీకేయన్ అన్నారు.

  సినిమాకు మీరు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు? కథ విన్న తర్వాత నిర్మాతగా మారారా? లేక ముందే ఈ సినిమాను నిర్మించాలని అనుకొన్నారా?

  వరుణ్ డాక్టర్ సినిమా డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ నా క్లోజ్ ఫ్రెండ్. నేను టెలివిజన్ రంగంలో ఉన్నప్పటి నుంచి అంటే 2007 నుంచి నాతో ట్రావెల్ అవుతున్నారు. నా షోకు ఆయన డైరెక్టర్‌గా వ్యవహరించారు. ఆయనపై ఉన్న నమ్మకంతోనే నిర్మాతగా మారాను. ఆయన చెప్పిన కథ నచ్చిన నాకు మరింత నమ్మకం కుదిరింది అని శివ కార్తీకేయన్ తెలిపారు.

  తమిళ వెర్షన్‌లో రెండు పాటలను మీరు రాశారు. 'సో బేబీ...' పాటకు ముందు అనిరుధ్‌, దర్శకుడితో డిస్కషన్‌ చేసిన వీడియో విడుదల చేశారు!
  జనరల్‌గా మేం మాట్లాడుకునేదాంట్లో 10 శాతం మాత్రమే చూపించాం. మా డిస్కషన్స్‌ అలానే ఉంటాయి. ఫస్ట్‌ 'చెల్లమ్మ' (తెలుగులో 'చిట్టమ్మ') పాట రాశా. తర్వాత 'సో బేబీ... చాలామందితో రాయించాం. కుదరలేదు. నువ్వు రాయి' అన్నారు. ట్రై చేశా. 'చెల్లమ్మ' సాంగ్‌ ముందు సినిమాలో అవసరం లేదు. ఎందుకంటే... బ్రేకప్‌తో మొదలవుతుందని చెప్పా కదా! అనిరుధ్‌ 'సాంగ్‌ ఎక్కడ పెడతారు?' అని అడిగారు. 'అది తర్వాత చూద్దాం! ముందు నువ్వు చెయ్‌' అని చెప్పాం. హ్యాపీగా రాశా. సినిమాలో మంచి సందర్భం కుదిరింది. జానీ మాస్టర్‌ కొరియోగ్రఫీ చేశారు. వీడియో చూసి 'బుట్టబొమ్మ'లా ఉందని చెబుతున్నారు.

   Hero Shiva Kartikeyans Interview: Doctor will be combination of Action, Humour

  మీ గత చిత్రాల్లో సున్నితమైన కామెడీ ఉండేది. ఈ చిత్రంలో కాస్త సీరియస్‌గా కనిపించడానికి కారణం ఏమిటి?

  డాక్టర్ చిత్రంలో కూడా కామెడీ ఉంది. కానీ వేరే పాత్రలు కామెడీని పండిస్తాయి. నా క్యారెక్టర్‌ చాలా సీరియస్‌గా ఉంటుంది. కానీ ఈ సినిమా కామెడీతోపాటు అన్ని అంశాలు ఉంటాయి. కథలో సీరియస్ అంశాల మధ్య ఆహ్లాదకరమైన వినోదం ఉంటుంది అని శివకార్తీకేయన్ పేర్కొన్నారు.

  డాక్టర్ పాత్రకు ఎవరైనా స్పూర్తిగా ఉన్నారా?

  నా పాత్రకు ఎవరైనా ఇన్సిపిరేషన్ ఉన్నారా అనే విషయాన్ని దర్శకుడిని అడిగి తెలుసుకోవాలి. దర్శకుడు చెప్పిన కథ, పాత్రలో ఒదిగిపోయేందుకు ప్రయత్నించాను. ఆ పాత్రలో ఎమోషన్స్‌ను పండించేందుకు ప్రయత్నించాను. నేను ఎలా డ్యాన్స్ చేశాననే విషయాన్ని డైరెక్టర్ చెప్పాలి.. రిలీజ్ తర్వాత ప్రేక్షకులు చెబుతారు. ఆ తీర్పు కోసం వేచి చూస్తున్నాను అని శివకార్తీకేయన్ తెలిపారు.

  ప్రియాంక అరుల్ మోహన్ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది?
  ప్రియాంక క్యారెక్టర్‌కు లవ్ సీన్లు పెద్దగా ఉండవు. ప్రతీ పాత్రకు ఓ పర్పస్ ఉంటుంది. ప్రతీ పాత్ర‌ను క్యారెక్టర్ నడిపిస్తుంది. ప్రియాంకతో బ్రేకప్‌ సన్నివేశంతో సినిమా ప్రారంభమవుతుంది. ఈ సినిమా పక్కాగా థియేటర్స్‌లో ప్రదర్శించడానికే తీశాం. ఏ దశలోను ఓటీటీలో రిలీజ్ చేయాలని అనుకోలేదు. 80 శాతం సినిమా ఫస్ట్ లాక్‌డౌన్‌కు పూర్తి చేశాం. మిగితాది రెండో లాక్‌డౌన్ అనంతరం కంప్లీట్ చేశాం. రెండు లాక్‌డౌన్ల కారణంగా సినిమా రిలీజ్ వాయిదా పడింది. ప్రస్తుతం సినిమా బాగుంటే తప్పకుండా ప్రేక్షకులు థియేటర్లకు వస్తున్నారు. మంచి సినిమాలను ఆదరిస్తున్నారనేది చాలా సినిమాలు రుజువు చేశాయి ని శివకార్తీకేయన్ అన్నారు.

   Hero Shiva Kartikeyans Interview: Doctor will be combination of Action, Humour

  డైరెక్ట్‌గా తెలుగులో మీరు చేయబోతున్న సినిమా గురించి చెప్పండి?

  Recommended Video

  Director Shiva Ganesh Speech At Batch Movie Trailer Launch

  తెలుగులో డైరెక్ట్ సినిమా చేస్తున్నాను. కథా, చర్చలు జరుగుతున్నాయి. స్క్రిప్టు‌పై కసరత్తు చేస్తున్నారు. అయితే ఇంకా ఎప్పుడు ప్రారంభించాలనేది ఇంకా నిర్ణయం జరుగలేదు. ఆ విషయాన్ని నిర్మాత అధికారికంగా ప్రకటిస్తారు. త్వరలోనే అధికారిక ప్రకటన రావొచ్చు అని శివకార్తీకేయన్ చెప్పారు.

  English summary
  After Remo, Seema Raja, Shakthi, Actor Shiva Karthikeyan is coming with Varun Doctor. Before its release, He says, Doctor will be combination of Action, Humour.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X