For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Banaras రెండు కిక్కులు థ్రిల్ చేస్తాయి.. ఆ ప్రయోగం వల్లే పాన్ ఇండియా మూవీగా.. జైద్ ఖాన్ ఇంటర్వ్యూ

  |

  కర్ణాటక రాజకీయాల్లో సీనియర్ పొలిటిషియన్, ఛామ్‌రాజ్ పేట ఎమ్మెల్యే జమీర్ అహ్మద్ కుమారుడు జైద్ ఖాన్ హీరోగా బెనారస్ చిత్రంతో భారతీయ సినిమా పరిశ్రమలో అడుగుపెడుతున్నాడు. బెల్ బాటమ్ లాంటి సంచలన విజయం అందుకొన్న జయతీర్థ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. సోనాల్ మెంటెరో హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రాన్ని ఎన్‌కే ప్రొడక్షన్స్ బ్యానర్‌పై తిలకరాజ్ బల్లాల్ నిర్మించారు. పాన్ ఇండియా మూవీగా నవంబర్ 4వ తేదీన ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళం, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో రిలీజ్ అవుతున్నది. ఈ నేపథ్యంలో హీరో జైద్ ఖాన్ మీడియాతో మాట్లాడుతూ....

  వైజాగ్, లక్నో ఈవెంట్‌లో భారీ రెస్పాన్స్

  వైజాగ్, లక్నో ఈవెంట్‌లో భారీ రెస్పాన్స్

  బనారస్ సినిమా ప్రమోషన్స్ బ్రహ్మండంగా జరిగాయి. దేశవ్యాప్తంగా భారీగా స్పందన వ్యక్తమవుతున్నది. ముంబై, పూణే, ఢిల్లీ, లక్నో, బనారస్, గుజరాత్, ఆంధ్రా, తెలంగాణ, కోల్‌కత్తా, తమిళనాడు భారీగా ప్రమోషన్స్ చేశాం. దేశవ్యాప్తంగా లక్నోలో మంచి స్పందన కనిపించింది. వైజాగ్‌లో జరిగిన ఈవెంట్‌‌లో అభిమానులు చూపించిన ప్రేమలో తడిసిపోయాం అని జైద్ ఖాన్ తెలిపాడు.

  దర్శకుడిని నేనే అప్రోచ్ అయ్యా

  దర్శకుడిని నేనే అప్రోచ్ అయ్యా

  బనారస్ సినిమా చేయడం నా ఛాయిస్. దర్శకుడు జయతీర్థ నాకు కథ చెప్పలేదు. నేను దర్శకుడిని అప్రోచ్ అయ్యాను. మంచి స్క్రిప్టు లభించడంతో బెనారస్ సినిమా కోసం డైరెక్టర్‌ను అప్రోచ్ అయ్యాను. బెనారస్ సినిమా షూట్‌లో ఉండగానే చాలా ఆఫర్లు వచ్చాయి. నాంది ఫేమ్ నిర్మాత సతీష్‌ గారు తెలుగు సినిమా చేద్దామని అడిగారు. అయితే నేను ఒక కోర్స్ ట్రైనింగ్‌లో ఉన్నాను. అందుకే కొంత సమయం తీసుకొని చేద్దామని చెప్పాను. హిందీలో ఆఫర్లు వచ్చినా.. నేను సౌత్ సినిమాలపైనే దృష్టి పెట్టాలని అనుకొంటున్నాను అని జైద్ ఖాన్ చెప్పారు.

  నాపై అలాంటి ఒత్తిడి...

  నాపై అలాంటి ఒత్తిడి...

  నేను నటించిన మొదటి సినిమా. కన్నడ సినిమా రంగంపై ప్రస్తుతం దేశవ్యాప్తంగా దృష్టి ఉంది. కంతారా సినిమా తర్వాత కన్నడ సినిమాతో నా సినిమా వస్తుండటంతో నాపై ఒత్తిడి ఉంది. కేజీఎఫ్ సినిమాతో కన్నడ ఇండస్ట్రీ ప్రతిష్ట పెరిగింది. ఇలాంటి నేపథ్యంలో నేను బెనారస్ సినిమాను డిస్టిబ్యూటర్లందరికి చూపించాం. అందరూ ఈ సినిమా చూసి అభినందించారు. దేశవ్యాప్తంగా బెనారస్ సినిమా ఆకట్టుకొంటుందని నమ్మకం కుదరడంతో ఈ సినిమాను పాన్ ఇండియా మూవీగా రిలీజ్ చేయాలని డిసైడ్ చేశాం అని జైద్ ఖాన్ అన్నారు.

  బనారస్‌లోనే 85 శాతం షూట్

  బనారస్‌లోనే 85 శాతం షూట్


  బనారస్ సినిమా కథ మిస్ట్రీరియస్ లవ్ స్టోరి. ఈ సినిమా బ్యాక్ డ్రాప్‌కు సంబంధించిన డార్క్ ఎలిమెంట్స్ స్పెషల్‌గా ఉంటుంది. ఈ సినిమాను నవంబర్ 4వ తేదీన చూసిన ప్రేక్షకులకు రెండు రకాల కిక్క్స్ కనిపిస్తాయి. ఒకటి కంటెంట్... రెండు బ్యాక్ డ్రాప్‌ ఆడియెన్స్‌ను థ్రిల్ చేస్తాయి. ప్రేమ కథా చిత్రాన్ని బనారస్‌లోనే 85 శాతం షూట్ చేశాం. ఈ సినిమా కథతో చేసిన ప్రయోగం అందరికి నచ్చుతుంది. సెకండాఫ్‌లో చేసిన ప్రయోగం కారణంగానే సినిమా సూపర్ సక్సెస్ అవుతుందని నమ్ముతున్నాం. ఈ సినిమా చూసపిన తర్వాత అందరూ ఒకసారి బెనారస్ వెళ్లాలని అనుకొంటారు. ఇప్పటి వరకు చూసిన ప్రతీ ఒక్కరు మంచి రివ్యూలను ఇచ్చారు. ఈ కథలో టైమ్ ట్రావెల్ స్పెషల్ ఎట్రాక్షన్ అని జైద్ ఖాన్ తెలిపారు.

  బనారస్ లేట్ ఎందుకైందంటే?

  బనారస్ లేట్ ఎందుకైందంటే?


  బెనారస్ సినిమాను 2019 సెప్టెంబర్‌లో షూటింగ్ మొదలుపెట్టాం. అదే సమయంలో వరదలు వచ్చాయి. లాక్‌డౌన్‌కు ముందే రెండు పాటల తప్పా.. షూటింగ్ కంప్లీట్ అయింది. లాక్‌డౌన్ తర్వాత రెండు పాటలు షూట్ చేశాం. అయితే ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేయాలని నిర్మాతలు నిర్ణయించారు. అన్ని భాషల్లో డబ్బింగ్, పాటలు రిక్రియేషన్ చేశాం. దాంతో డబ్బింగ్, ఇతర అంశాల వల్ల రిలీజ్ లేట్ అయింది.

  English summary
  Karnataka's Chamrajpet MLA Zameer Ahmed Khan's Son Zaid Khan is introducing as hero at Pan India movie Banaras. Here is the Zaid Khan Interview for the Filmibeat telugu users.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X