For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

నాని అలాంటివాడు కాదు.. ఎలాంటి ఇబ్బంది కాలేదు.. ఆ క్రికెటర్ ఎందుకు ఇష్టమంటే.. జెర్సీ హీరోయిన్

|

అందం, అభినయంతో ఆకట్టుకొంటున్న కన్నడ నటి 'శ్రద్ధా శ్రీనాథ్'. కన్నడలో ఆమె నటించిన యూటర్న్ చిత్రం ఘన విజయం సాధించింది. ప్రస్తుతం జెర్సీ సినిమాలో నాని సరసన నటిస్తూ హీరోయిన్‌గా తెలుగు తెరకు పరిచయం అవుతున్నది. ఇప్పుడు తాజాగా నేచురల్ స్టార్ నాని హీరోగా 'మళ్ళీ రావా' ఫేం గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో సితార ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న 'జెర్సీ' సినిమాతో ఏప్రిల్ 19న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా తెలుగు ఫిల్మీబీట్‌తో శ్రద్ధా శ్రీనాథ్ మాట్లాడుతూ..

హైదరాబాద్‌లో చదువుకొన్నాను

హైదరాబాద్‌లో చదువుకొన్నాను

నేను హైదరాబాద్‌లో చదువుకొన్నాను. తిరుమలగిరి కేంద్రీయ విద్యాలయంలో 7వ తరగతి నుంచి 12 తరగతి వరకు చదువుకొన్నాను. నాకు కొంత తెలుగు తెలుసు. కానీ తెలుగు డైలాగ్స్‌ పలకడంలో కష్టమయ్యేది. అయితే డైరెక్టర్, చిత్ర యూనిట్ బాగా సహకరించారు అని శ్రద్దా శ్రీనాథ్ తెలిపారు.

భావోద్వేగాలతో కూడిన పాత్ర

భావోద్వేగాలతో కూడిన పాత్ర

జెర్సీ సినిమాకు సంబంధించి తన వర్క్ పట్ల శ్రద్ధ చాలా సంతోషంగా ఉన్నాను. ఈ సినిమాలో తనకు అమోఘమైన భావోద్వేగాలను పండించగల సన్నివేశాల్లో నటించే అవకాశం రావడం చాలా ఆనందం కలిగించింది. అలాగే సినిమాలో టీనేజర్‌గా ఓ తల్లిగా ఇలా వేరు వేరు షేడ్స్ ఉన్న పాత్రల్లో కనిపిస్తాను అని శ్రద్దా శ్రీనాథ్ పేర్కొన్నారు.

నానితో ఎలాంటి కష్టం కాలేదు

నానితో ఎలాంటి కష్టం కాలేదు

టాలెంటెడ్ యాక్టర్ అయిన నానితో నటించడం కష్టం కాలేదు. ఎందుకంటే తన నటనా ప్రతిభతో ఎదుటి వాళ్లను భయపెట్టే వ్యక్తి కాదు. చాలా కష్టమైన, కీలకమైన సీన్లలో అతడు బాగా ఎంకరేజ్ చేసే వారు. నీవు బాగా చేశావు.. బాగా ప్రిపేర్ అయ్యావు అని చెప్పే వారు. నాకు ఏదైనా మంచి పేరు వస్తే అది నాని వల్లే. నానిలో ఓ గొప్ప విషయం ఉంది. ఎవరైనా తమ సీన్ షూట్ పూర్తికాగానే వ్యాన్‌లోకి వెళ్తారు. కానీ నాని సెట్‌లోనే ఉంటాడు.

నాని నాకు అలా సహకరించారు

నాని నాకు అలా సహకరించారు

స్వతహాగా నేను స్టేజ్ యాక్టర్ కావడంతో నటన సులభమైంది. తెలుగు ఒక్కటే నాకు సమస్య. తెలుగు విషయంలో ఇబ్బందులు రాకుండా నాని సహకరించారు. జెర్సీకి ముందు నాని సినిమాలు చూడలేదు. జీవితంలో మూడంటే మూడు సినిమాలే చూశాను. అవి పెళ్లిచూపులు, బాహుబలి చిత్రాలు చూశాను. ఇప్పటి వరకు 8 చిత్రాల్లో మాత్రమే నటించాను.

మొదటి సినిమాలో తల్లి పాత్ర అంటే

మొదటి సినిమాలో తల్లి పాత్ర అంటే

తెలుగులో నా మొదటి చిత్రంలోనే తల్లి పాత్ర పోషిస్తే ఓ రకమైన బ్రాండ్ పడుతుందని ఆలోచించలేదు. సాధారణంగా తొలి సినిమాలో ఎలాంటి పాత్రలు చేస్తే.. అలాంటి పాత్రలు వస్తాయని అందరు బెదిరించారు. కానీ రకరకాల షేడ్స్ ఉన్న పాత్రలో లభించినపుడు నేను ఆ పాత్రను ఒదులుకోలేదు అని శ్రద్దా శ్రీనాథ్ చెప్పారు.

 నాకు క్రికెట్ అంటే ఇష్టం..

నాకు క్రికెట్ అంటే ఇష్టం..

నాకు క్రికెట్ అంటే ఇష్టం. కానీ ఐపీఎల్ వచ్చాక చూడటం మానేశాను. ఎందుకంటే ఆ ఫార్మాట్ నాకు నచ్చదు. వన్డేలు, టెస్టులు చూస్తాను. నా ఫేవరేట్ క్రికెటర్ రాహుల్ ద్రావిడ్. కన్నడ అని అతడిని ఇష్టపడలేదు. అతని ఆట, మాట్లాడే స్టయిల్ ఇష్టం. అలాగే అతడి ఇంటర్వ్యూలు చూస్తే నాకు చాలా ఇన్సిపిరేషన్‌గా ఉంటుంది.

 నిర్మాత సూర్యదేవర నాగవంశీ వండర్‌ఫుల్

నిర్మాత సూర్యదేవర నాగవంశీ వండర్‌ఫుల్

సితార ఎంటర్‌టైన్ మెంట్ బ్యానర్ మమల్ని బాగా చూసుకొన్నారు. నిర్మాత సూర్యదేవర నాగవంశీ ప్రతీ ఒక్కరి గురించి చాలా కేర్ తీసుకొన్నారు. మా కంఫర్ట్ వారి ప్రయారిటీ. వారి మర్యాదలు మాటల్లో చెప్పలేం. తెలుగులో ఇంకా కొత్త చిత్రాలు అంగీకరించలేదు. జెర్సీ తర్వాత కొత్త ప్రాజెక్టులపై దృష్టిపెడుతాను అని శ్రద్ధా శ్రీనాథ్ చెప్పారు.

English summary
Natural Star Nani's latest movie is Jersey. Directed by Gowtam Tinnanuri & Produced by S. Naga Vamsi under Sithara Entertainments. An Anirudh Musical!. This film set to release on April 19th. Heroine Shraddha Srinath is a beautiful and talented Kannada actress who is putting her foot on Telugu soil with Jersey. Raised in Hyderabad for a few years, Shraddha has done many Kannada and Tamil films earlier. She plays Sara in Jersey which has Nani as the main lead and Gautam Tinnanuri of Malli Raava fame is the director. Shraddha is quite excited about the film and says that the beautiful emotions in the script made her accept the film right away. "Very rarely does a heroine get to act in such a strong role which showcases two different phases of life. Majili is one such film with honest emotions which everyone will relate to easily" says Shraddha.
 
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more