twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    క్యాస్టింగ్ కౌచ్‌పై విజయ్ దేవరకొండ హీరోయిన్.. బ్యాగ్‌లో కత్తి పెట్టుకొని తిరిగా..

    By Rajababu
    |

    సంచలన విజయం సాధించిన అర్జున్‌రెడ్డి తర్వాత రిలీజ్ అవుతున్న విజయ్ దేవరకొండ చిత్రం ఏం మంత్రం వేశావే. ఈ చిత్రంలో శివానీ సింగ్ కథానాయిక. హీరోయిన్‌గా ఇంట్రీకి ముందు శివానీ ప్రముఖ టెలివిజన్ ఛానెల్లో హోస్ట్‌గా, మోడల్‌గా కనిపించారు. ఏం మంత్రం వేశావే చిత్రం ద్వారా తొలిసారి బుల్లితెర నుంచి వెండితెరకు పరిచయం అవుతున్నారు. ఈ చిత్రం మార్చి 16 రిలీజ్‌కు సిద్ధమవుతున్న నేపథ్యంలో శివానీ సింగ్ తెలుగు ఫిల్మీబీట్‌తో ప్రత్యేకంగా ముచ్చటించారు. శివానీ వెల్లడించిన విషయాలు ఆమె మాటల్లోనే..

     మోడల్‌గా, హోస్ట్‌గా

    మోడల్‌గా, హోస్ట్‌గా

    నేను పుట్టింది ఢిల్లీలో.. ప్రస్తుతం ముంబైలో ఉంటున్నాను. త్వరలోనే హైదరాబాద్‌లో స్థిరపడాలనుకొంటున్నాను. కాలేజీ ఎడ్యుకేషన్‌ సమయంలోనే చాలా బ్రాండ్లకు మోడలింగ్ చేశాను. ప్రముఖ టెలివిజన్ ఛానెల్ ఎన్డీటీవీ ప్రైమ్‌లో ఓ కార్యక్రమానికి హోస్ట్‌గా వ్యవహరించాను.

    అడిషన్స్‌లో చాలా సమస్యలు

    అడిషన్స్‌లో చాలా సమస్యలు

    ఏం మంత్రం చేశావే సినిమాకు ముందు పలు అడిషన్స్‌కు హాజరయ్యాను. చాలా చోట్ల అనేక సమస్యలు ఎదురయ్యాయి. అయినా నాకు అవకాశం వచ్చే వరకు కాన్ఫిడెన్స్‌ను కోల్పోకుండా నేను ప్రయత్నించాను. ఈ సినిమాలో అవకాశం లభించింది.

     పెద్దగా కష్టపడలేదు గానీ..

    పెద్దగా కష్టపడలేదు గానీ..

    ఆడిషన్స్ సమయంలో పెద్దగా కష్టాలు ఎదురుకాలేదు. కొన్నిసార్లు సక్సెస్ కాలేదు. ఆడిషన్స్ సమయంలో నేను చాలా నేర్చుకొన్నాను. ఒకరి విజన్‌కు మనం మ్యాచ్ అయితే ఆఫర్ దక్కుతుంది. లేకపోతే మళ్లీ మళ్లీ అవకాశాల కోసం తిరుగాల్సిందే. ఫిల్మ్ మేకర్స్‌ను మెప్పించాల్సి ఉంటుంది.

     ఏం మంత్రం చేశావే సినిమాలో

    ఏం మంత్రం చేశావే సినిమాలో

    ఏం మంత్రం చేశావే చిత్రంలో నా పాత్ర చాలా డిజైన్ చేశారు. నా రోల్ చాలా స్ట్రాంగ్‌గా ఉంటుంది. ఎలాంటి పరిస్థితులనైనా తనవైపుకు మరల్చుకొనే పాత్ర. ఈ పాత్ర చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది.

     ఏమౌతుందో నాకు తెలియదు

    ఏమౌతుందో నాకు తెలియదు

    ఈ సినిమాలోని పాత్ర నా కెరీర్‌కు ఉపయోగపడుతుంది అని భావిస్తున్నాను. కానీ ఏ విధంగా ప్లస్ అవుతుందో అనే విషయం మాత్రం నాకు తెలియదు. నా పాత్ర గురించి దర్శకుడు రాసుకున్న విధానం ప్రేక్షకులకు మాత్రం నచ్చుతుంది. ప్రతీ ఒక్క యువతి నా పాత్రతో కనెక్ట్ అవుతుంది.

     విజయ్ దేవరకొండతో వర్క్

    విజయ్ దేవరకొండతో వర్క్

    విజయ్ దేవరకొండతో వర్క్ చేయడం చాలా ఫన్‌గా అనిపించింది. షూటింగ్ సమయంలో చాలా హ్యాపీగా ఫీలయ్యాను. చాలా మంచి వ్యక్తి. నన్ను బాగా టీజ్, ఇరిటేట్ చేసేవాడు. అతడితో ఎక్కువగా మాట్లాడటానికి నాకు కుదురలేదు.

    తెలుగు డైలాగ్స్ చెప్పడానికి

    తెలుగు డైలాగ్స్ చెప్పడానికి

    ఉత్తరాదికి చెందడంతో తెలుగులో డైలాగ్స్ చెప్పడంలో కొంత ఇబ్బంది పడ్డాను. కానీ అసిస్టెంట్ డైరెక్టర్లు, సినిమాటోగ్రఫర్, డైరెక్టర్ నుంచి అడిగి తెలుసుకొనేదానిని. కొన్ని తెలుగు పదాలు నేర్చుకొన్నాను.

     సోషల్ మీడియాలో యాక్టివ్‌గా

    సోషల్ మీడియాలో యాక్టివ్‌గా

    నేను యాక్టర్ని కాబట్టి సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండాలనుకొంటాను. నాకు ఇన్స్‌టాగ్రామ్‌లో యాక్టింగ్‌గా ఉంటాను. ట్విట్టర్, ఫేస్‌బుక్‌ల కంటే ఇన్స్‌టాగ్రామ్‌ను ఎక్కువగా ఇష్టపడుతాను. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండకుంటే బాహ్య ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలియదు.

    వేషాల కోసం పడకగదిలోకి

    వేషాల కోసం పడకగదిలోకి

    క్యాస్టింగ్ కౌచ్‌ (వేషాల కోసం పడకగదిలోకి) అనేది ఒక్క సినిమా పరిశ్రమకే పరిమితం కాదు. అన్ని పరిశ్రమల్లోనూ ఈ సమస్య ఉంది. కొన్నిసార్లు ఇబ్బందులు ఎదురవ్వడంతో పోలీసుల సహకారం తీసుకోవాల్సి వచ్చింది. మహిళలకు ఎక్కడైనా సమస్యలు ఉంటాయి. ఢిల్లీలో నిర్భయ ఘటన తర్వాత హ్యాండ్‌బాగ్‌లో నన్ను నేను రక్షించుకోవడానికి చాకు పట్టుకొని తిరిగేదానిని.

     హాలీవుడ్ డైరెక్టర్ లైంగిక వేధింపులు

    హాలీవుడ్ డైరెక్టర్ లైంగిక వేధింపులు

    హాలీవుడ్‌ దర్శకుడు హర్వే విన్‌స్టెయిన్ లైంగిక వేధింపులు విషయం బయటకు వచ్చిన తర్వాత చాలా మంది హీరోయిన్లు తమ సోషల్ మీడియా అకౌంట్‌లో మీటూ అనే సందేశంతో స్పందిస్తున్నారు. క్యాస్టింగ్ కౌచ్ సమస్యను నేను ఎదుర్కొన్నాను. నాతో తప్పుడుగా బిహేవ్ చేస్తే వారిని గట్టిగా మందలించాను. నేను అలాంటి వ్యక్తిని కాదని ముఖం మీదే చెప్పేదానిని. అలాంటి సమస్యను ఎదుర్కోవడానికి యువతులు మానసికంగా బలంగా ఉండాలి.

    పురుషుల్లో మార్పు రావాలి

    పురుషుల్లో మార్పు రావాలి

    ఇలాంటి సమస్యలకు ముగింపు పలకాలి అంటే పురుషుల్లో మార్పు రావాలి. మగవాళ్లు తమ కుటుంబంలోని మహిళలను చూసి ప్రవర్తనను మార్చుకోవాలి. లైంగిక దాడికి గురయ్యే వ్యక్తి తమ ఇంట్లో మాదిరిగానే ఓ మహిళ అని గుర్తుంచుకోవాలి. మన ప్రవర్తనను బట్టి క్యాస్టింగ్ కౌచ్ అనేది ఆధారపడి ఉంటుంది. మనల్ని ఎవరూ బలవంతం చేయరు. ఏదైనా మన చేతుల్లోనే ఆధారపడి ఉంటుంది. కొన్నిసార్లు మహిళలకు వేరే ఆప్షన్ ఉండదు.

     మహేష్‌బాబు చాలా ఇష్టం

    మహేష్‌బాబు చాలా ఇష్టం

    టాలీవుడ్‌లో నాకు మహేష్‌బాబు అంటే చాలా ఇష్టం. ఆయనతో నటించాలని ఉంది. ఆ రోజు కోసం ఎదురుచూస్తున్నాను. చాలా అందంగా ఉంటాడు. చూడటానికి అమేజింగ్ ఉంటాడు. ఇక బాలీవుడ్‌లో రాజ్‌కుమార్ రావ్, హృతిక్, అక్షయ్ నాకు నచ్చిన హీరోలు అని శివానీ సింగ్ తెలిపారు.

    English summary
    After Arjun Reddy hit, Vijay Devarkonda is acting in Em Mantram Vesave, a romantic drama directed by debutant Sridhar Marri. This movie is set release on March 9. In this occcassion, Heroine Shivani Singh Spoke to Telugu Filmibeat Exclusively.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X