»   »  గత పదేళ్లలో అతడిని ఒక్కసారే కలిశా.. చాలా సిన్సియర్.. కాజల్ అగర్వాల్

గత పదేళ్లలో అతడిని ఒక్కసారే కలిశా.. చాలా సిన్సియర్.. కాజల్ అగర్వాల్

Posted By:
Subscribe to Filmibeat Telugu

అందాల తార కాజల్ అగర్వాల్ లక్ష్మీ కల్యాణం సినిమాతో తెలుగు సినిమా పరిశ్రమలోకి ప్రవేశించింది. ఆ తర్వాత పదేళ్ల కెరీర్ అనంతరం మళ్లీ కల్యాణ్ రామ్‌తో ఎంఎల్ఏ చిత్రంలో నటిస్తున్నది. ఈ చిత్రంలో మార్చి 23 తేదీని విడుదలకు సిద్దమవుతున్నది. ఈ నేపథ్యంలో కాజల్ అగర్వాల్ తన పదేళ్ల జీవితం గురించి, ఎంఎల్ఏ సినిమాలోని పాత్ర గురించి వివరించింది. కాజల్ వెల్లడించిన విషయాలు ఆమె మాటల్లోనే..

 కార్పోరేట్ కంపెనీలో

కార్పోరేట్ కంపెనీలో

ఎంఎల్‌ఏ చిత్రంలో కార్పోరేట్ కంపెనీలో పనిచేసే ఉద్యోగి అనేది నా క్యారెక్టర్. ఎన్నారై పాత్ర. ఇంటర్వెల్‌లో ట్విస్ట్‌తో నా పాత్ర అసలు విషయం తెలుస్తుంది. ఈ సినిమాలో మంచి మెసేజ్ ఉంది. అది కూడా ఎంటర్‌టైనింగ్ మ్యానర్‌లో ఉంటుంది. మంచి లక్షణాల ఉన్న అబ్బాయిలా కల్యాణ్ రామ్ ఉంటాడు. కల్యాణ్ రామ్‌కు పది మార్కులగానూ ఎనిమిదిన్నర పాయింట్లు ఇస్తాను. కల్యాణ్ రామ్ చాలా సిన్సియర్, హర్డ్ వర్కర్.

 పదేళ్లలో కల్యాణ్‌రామ్‌ను..

పదేళ్లలో కల్యాణ్‌రామ్‌ను..

లక్ష్మీకల్యాణం సినిమా తర్వాత పదేళ్లకు మళ్లీ కల్యాణ్‌రామ్‌తో కలిసి నటించాను. పదేళ్ల తర్వాత అదే రిలేషన్. ఓ మంచి ఫ్రెండ్ మాదిరిగా రిసీవ్ చేసుకొన్నారు. పదేళ్ల కెరీర్‌ పరంగానూ. చాలా అన్ని రకాలుగా ఎదిగాం. లక్ష్మీకల్యాణం తర్వాత కల్యాణ్ కలిసిన దాఖలాలు లేవు. ఒకసారి ఏదో ఫంక్షన్‌లో మాత్రమే కలిశాం. స్టార్ల పరిస్థితి మరీ దారుణంగా ఉంటుంది. మాకు ఒక్క రోజు ఓ గంట లేదా రెండు గంటలో సమయం దొరికితే ఫ్యామిలితో గడపాలని అనుకొంటాం.

ఒక్క సినిమా చేసి

ఒక్క సినిమా చేసి

లక్ష్మీ కల్యాణం సినిమాలో నటించేటప్పుడు నేను 50 చిత్రాల్లో నటిస్తానని ఎప్పుడూ అనుకోలేదు. ఒకటో, రెండో సినిమాలు చేసి ఎంబీఏ చదువుకొందామని అనుకొన్నాను. కానీ పదేళ్లకుపైగా జీవితంలో 50 సినిమాలు చేయడం చాలా హ్యాపీగా ఉంది. అందుకు తెలుగు ప్రేక్షకులకు నేను రుణపడి ఉంటాను.

 నాపై ఒత్తిడి లేదు

నాపై ఒత్తిడి లేదు

కెరీర్ మీద ఎక్స్‌పెక్టేషన్ లేకపోవడం నాపై ఒత్తిడి లేదు. దాంతో నా వద్దకు వచ్చిన సినిమాల్లో మంచివి ఎన్నుకోవడం జరిగింది. దాదాపు ఐదు సినిమాల్లో నటించేంత వరకు నా జీవితం సినిమా పరిశ్రమకే అనే అభిప్రాయం కలిగింది. మగధీర సినిమా తర్వాత పూర్తిగా ఇండస్ట్రీయే నా జీవితం అని అభిప్రాయం కలిగింది.

 స్పెషల్ సాంగ్స్.. స్పెషల్‌గానే

స్పెషల్ సాంగ్స్.. స్పెషల్‌గానే

నా కెరీర్‌లో గ్లామర్ తారగా ఎన్నో పాత్రలు పోషించాను. కానీ ప్రస్తుతం నేను అంగీకరించే పాత్రల విషయంలో నేను చాలా జాగ్రత్తగా ఉంటున్నాను. యాక్టర్ అనేటప్పుడు విభిన్నమైన, విలక్షణమైన పాత్రలు పోషించాలి. డ్యాన్సులు, పాటలకే పరిమితం కాకుండా నటిగా నా ప్రభావం చూపే విధంగా చూసుకొంటున్నాను. ఇదంతా ఒక రోజుల సాధ్యపడేది కాదు. కొన్నేళ్ల కెరీర్‌లో జరిగే పరిణామం మాత్రమే.

English summary
Kalyan Ram's MLA, short for Manchu Lakshanulla Abbayi, is all set to the hit the screens this Friday. The actor assures his audience that the film, which is set in a political backdrop, is an out-and-out entertainer. Kajal Agarwal is the Heroine. MLA movie set to release on March 23. In this occassion, Kajal Agarwal speaks to Telugu Filmibeat exclusively.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X