»   » లేడీ సూపర్‌స్టార్ కావాలంటే అలా నటించాలా? ఆ హీరొయిన్లను పట్టించుకోను.. కాజల్

లేడీ సూపర్‌స్టార్ కావాలంటే అలా నటించాలా? ఆ హీరొయిన్లను పట్టించుకోను.. కాజల్

Posted By:
Subscribe to Filmibeat Telugu
Kajal Agarwal Talks About Her Jouney In Industry

అందాల తార కాజల్ అగర్వాల్ లక్ష్మీ కల్యాణం సినిమాతో తెలుగు సినిమా పరిశ్రమలోకి ప్రవేశించింది. ఆ తర్వాత పదేళ్ల కెరీర్ అనంతరం మళ్లీ కల్యాణ్ రామ్‌తో ఎంఎల్ఏ చిత్రంలో నటిస్తున్నది. ఈ చిత్రంలో మార్చి 23 తేదీని విడుదలకు సిద్దమవుతున్నది. ఈ నేపథ్యంలో కాజల్ అగర్వాల్ తన పదేళ్ల జీవితం గురించి, ఎంఎల్ఏ సినిమాలోని పాత్ర గురించి వివరించింది. కాజల్ వెల్లడించిన విషయాలు ఆమె మాటల్లోనే..

 చిరంజీవితో నటించడం

చిరంజీవితో నటించడం

పదేళ్ల కెరీర్‌లో సీనియర్ నటులతోపాటు, యువ నటులతో నటించే అవకాశం రావడం నా అదృష్టం. ఇది అందరికీ ఇలాంటి అవకాశం లభించదు. చిరంజీవితో నటించడం ఓ రకమైన అనుభవం. రాంచరణ్, రానా, ఇతర నటులతో నటించడం మరో రకమైన ఎక్సిపీరియెన్స్. అందరి హీరోలతో మళ్లీ మళ్లీ నటించాలన్నదే నా ఉద్దేశం.

 క్యారెక్టర్‌ను ఎంపిక చేసుకోవడం

క్యారెక్టర్‌ను ఎంపిక చేసుకోవడం

ఓ కార్యెక్టర్‌ను ఎన్నుకొనేటప్పుడు స్క్రిప్టును ముందుగా పరిగణనలోకి తీసుకొంటాను. ఒక్క స్క్రిప్ట్ పరిగణనలోకి తీసుకొను. చాలా రకాల అంశాలు పాత్రల ఎంపికలో ప్రభావం చూపుతాయి. పదేళ్లు పరిశ్రమలో నిలబడటానికి డైరెక్టరు, నటుల నమ్మకం. హార్డ్‌వర్క్, నిజాయితీ అనేవి నా కెరీర్‌కు ఉపయోగపడ్డాయి. గత కొద్ది సంవత్సరాలు నేను చాలా మంచి పాత్రలు పోషించాను. కొత్త జాగ్రత్తగా పాత్రలను ఎంపిక చేసుకోవడం ఒకటైతే.. నా వద్దకు వచ్చిన పాత్రలు నా కెరీర్‌కు ఉపయోగపడేలా ఉన్నాయి.

 స్పెషల్ సాంగ్‌కు మంచి క్రేజ్

స్పెషల్ సాంగ్‌కు మంచి క్రేజ్

జనతా గ్యారేజ్‌లో చేసిన స్పెషల్ సాంగ్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆ తర్వాత నాకు అలాంటి ఆఫర్లు వచ్చాయి. కానీ అలాంటి పాటలు చేయాలంటే ఏదో ఒక స్పెషల్ ఉండాలి. అవసరమనుకొంటే, స్పెషల్‌గా ఉంటుందనుకొంటే అప్పుడప్పుడు అలాంటి పాటలు చేస్తుంటాను. ప్రస్తుతం నేను తమిళంలో క్వీన్ రీమేక్‌లో నటిస్తున్నాను. బెల్లంకొండ శ్రీనివాస్ సినిమా ఒకటి అంగీకరించాను.

 అలా ఆలోచించడం లేదు

అలా ఆలోచించడం లేదు

గ్లామర్ హీరోయిన్‌గా నేను హ్యాపీ. నయనతార, అనుష్కలా లేడీ సూపర్‌స్టార్ ఇమేజ్ కోసం నేను ఆలోచించడం లేదు. ఎవరి కెరీర్ గ్రాఫ్ వారికి ఉంటుంది. నేను క్యారెక్టర్లను ఎంపిక చేసుకోనేటప్పుడు ఎవరినీ దృష్టిలో పెట్టుకొను. ఎవరిని ఫాలో కాను. కొత్త హీరోయిన్ల నుంచి నాకు ఎలాంటి పోటీ లేదు. కొత్త వారు రావడం మంచిదే. టాలీవుడ్‌లో ప్రతీ ఏటా చాలా సినిమాలు చేస్తున్నారు. ఎవరి అవకాశాలు వారికి ఉంటాయి.

లేడీ సూపర్ స్టార్ కావాలంటే

లేడీ సూపర్ స్టార్ కావాలంటే

లేడీ సూపర్ స్టార్ కావాలంటే హారర్ సినిమాల్లో నటించనక్కర్లేదు. మంచి ఫీల్ ఉన్న పాత్రలు, సినిమాల్లో నటించడం ద్వారా ప్రేక్షకుల గుర్తింపు ఉంటుంది. నాకు హారర్ చిత్రాల్లో నటించడమంటే నచ్చదు. వాటికి నేను దూరం. కాబట్టి లేడి సూపర్ స్టార్ అనేది ట్యాగ్‌పై నాకు పట్టింపు లేదు. సినిమాలు చేతిలో ఉన్నాయా? ఎక్కువ చిత్రాల్లో నటిస్తున్నామా అనేదే నా లక్ష్యం అని కాజల్ అగర్వాల్ అన్నారు.

English summary
Kalyan Ram's MLA, short for Manchu Lakshanulla Abbayi, is all set to the hit the screens this Friday. The actor assures his audience that the film, which is set in a political backdrop, is an out-and-out entertainer. Kajal Agarwal is the Heroine. MLA movie set to release on March 23. In this occassion, Kajal Agarwal speaks to Telugu Filmibeat exclusively.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X