For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  నదిలోకి నాణేలను ఎందుకు విసురుతారో తెలుసా? కార్తికేయ 2 డైరెక్టర్ చందూ అద్బుతమైన జవాబు వింటే..

  |

  టాలీవుడ్‌లో అభిరుచి ఉన్న యువ దర్శకుల్లో చందూ మొండేటి ఒకరు. ప్రేమమ్, సవ్యసాచి, కార్తికేయ‌ చిత్రాలు ఆయన దర్శకత్వం ప్రతిభకు అద్దం పడుతాయి. తాజాగా చందూ దర్శకత్వం వహించిన చిత్రం కార్తికేయ 2. ప్రముఖ నిర్మాణ సంస్థ‌లు పీపుల్స్ మీడియా ఫ్యాక్ట‌రి, అభిషేక్ అగ‌ర్వాల్ ఆర్ట్స్ బేన‌ర్‌పై యంగ్ హీరో నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ జంట‌గా నటించారు. కార్తికేయ చిత్రానికి సీక్వెల్‌గా వస్తున్న కార్తికేయ‌ 2 సినిమాను టీజీ విశ్వ‌ప్ర‌సాద్, అభిషేక్ అగ‌ర్వాల్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఆగస్ట్ 13న థియేటర్స్‌లో విడుదల అవుతున్న సందర్బంగా డైరెక్టర్ చందు మొండేటి మాట్లాడుతూ..

  కృష్ణుడి కథలు వెండితెరపై

  కృష్ణుడి కథలు వెండితెరపై

  కృష్ణతత్త్వం కాన్సెప్ట్ తీసుకొని నేటి తరానికి కృష్ణ భగవానుడి గొప్పతనం గురించి చెప్పబోతున్నాం. శ్రీకృష్ణ భగవానుడిని మోటివ్‌గా తీసుకొని తీసిన సినిమాలు వెండితెరపైన మ్యాజిక్ చేశాయి. శ్రీకృష్ణుడు దాని డెఫినేషన్ అంతా అర్థమయ్యేలా కొంతవరకు చూపించే ప్రయత్నం చేశా. భక్తి సినిమాలు చూడడానికి ఎవరూ ఆలా రావడం లేదు. భక్తితో పాటు అడ్వెంచర్‌తో కూడిన థ్రిల్ ఉండాలని కార్తీకేయ 2 సినిమా తీయడం జరిగింది.ఈ సినిమాను చూసిన ఆడియన్స్ ఒక కొత్త అనుభూతితో బయటకు వస్తారు అని చందూ మొండేటి విశ్వాసం ప్రకటించారు.

  మా కథను నిర్మాతలు బలంగా నమ్మారు

  మా కథను నిర్మాతలు బలంగా నమ్మారు


  ఏ కథకైనా నిర్మాతలు కొన్ని పరిమితులు విధిస్తారు. బడ్జెట్‌ను దృష్టిలో పెట్టుకొని కార్తీకేయ 2 కథను చేశాం. అభిషేక్ అగర్వాల్, వివేక్ కూచిబొట్ల, మయాంక్ గార్లు మమ్మల్ని, మా కథను నమ్మారు. కరోనా వైరస్ లాక్‌డౌన్స్ కారణంగా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురైనా వెనుకడుగు వేయకుండా ఈ సినిమాను తెరకేక్కించారు.ఈ స్క్రిప్ట్ పై నిర్మాతలు చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నారు అని చందూ మొండేటి తెలిపారు.

   నదిలోకి నాణేల వెనుక సైంటిఫిక్ రీజన్

  నదిలోకి నాణేల వెనుక సైంటిఫిక్ రీజన్


  దేవుడు, భక్తికి ఉండే డెఫినేషన్‌ను చెప్పే ప్రయత్నం చేశాను. మన సమాజంలో చాలా నమ్మకాలు ప్రజల్లో ఉంటాయి. వాటిని ప్రజల నుంచి విడదీయలేం. చాలా మంది నదీ మీదుగా వెళ్లేటప్పుడు, నదీ స్నానం చేసేటప్పుడు.. నదీ వద్దకు వెళ్లినప్పుడు అందులో పైసలు విసిరివేస్తారు. అయితే దాని వెనుక ఓ సైంటిఫిక్ రీజన్ ఉంది.

  నదిలోకి నాణెలు ఎందుకు విసిరేస్తారంటే

  నదిలోకి నాణెలు ఎందుకు విసిరేస్తారంటే


  గతంలో పైసలు రాగి నాణెలుగా చెలామణిలో ఉండేవి. అణాలు, రూపాయలు లాంటి బిళ్లలు రాగితో చేసేవారు. అయితే ఒకప్పుడు తాగునీటికి నదీ నీళ్లను ఉపయోగించే వారు. అందులో మాలిన్యాలు, చెత్త చెదారం ఉండేవి. అలాంటి కలుషిత నీటిని రాగి ప్యూరిఫై చేస్తాయి. అందుకే అప్పట్లో ప్రజలు నదిలో రాగి నాణెలు విసిరే వారు. అది ఒక నమ్మకంగా మారింది. ఇప్పటికీ దానిని మన పెద్దలు పాటిస్తారు అని చందూ మొండేటి తెలిపారు.

  Recommended Video

  లాల్ సింగ్ గా అమిర్ ఖాన్ ఆకట్టుకున్నాడా? లేదా? *Reviews | Telugu OneIndia
  కార్తీకేయ 3పై క్లారిటీ

  కార్తీకేయ 3పై క్లారిటీ


  కార్తీకేయ 2 సినిమాను ప్రేక్షకులు రిసీవ్ చేసుకునే దానిని బట్టి సీక్వెల్ ఉంటుందా లేదా అనేది తేలుతుంది. ఈ సినిమా తర్వాత గీతా ఆర్ట్స్‌లో మూవీ ఉంటుంది. ప్రస్తుతం రెండు సినిమా కథలపై వర్క్ జరుగుతున్నది. ఒకటి లవ్ స్టోరి, మరోటి సోషల్ డ్రామా. గీతా ఆర్ట్స్ తర్వాత నాగార్జున గారితో మరో చిత్రం చేయబోతున్నాను. కరోనా రాకుండా ఉంటే ఇవి సెట్స్ పై ఉండేవి అని చందూ మొండేటి తెలిపారు.

  English summary
  Karthikeya 2 movie is sequel for super hit movie Karthikeya Which acted Nikhil Siddarth. Karthikeya 2 is releasing on August 13th. In this occassion, Chandoo Mondeti reveals about Karthikeya 2 and Lord Krishna Bhagawan in latest interview
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X