twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    దేవుడే జన్మనిస్తాడు.. ఆ సామే సావును గిఫ్టుగా ఇస్తే.. హీరో కార్తికేయ ఎమోషనల్ ఇంటర్వ్యూ

    |

    RX 100 మూవీతో యూత్‌లో మంచి క్రేజ్ సంపాదించుకొన్న హీరో కార్తికేయ గుమ్మకొండ వరుస చిత్రాలతో ఆలరిస్తున్నారు. ఆయన నటించిన చావు కబురు చల్లగా చిత్రం మార్చి 19న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలో గీతా ఆర్ట్స్‌లో తన ప్రయాణాన్ని, అలాగే కొత్త డైరెక్టర్ కౌశిక్ గురించి హీరో కార్తీకేయ వివరిస్తూ..

    ఆ హీరోలకు నెక్ట్స్ లెవెల్ మూవీస్

    ఆ హీరోలకు నెక్ట్స్ లెవెల్ మూవీస్

    గీతా ఆర్ట్స్ బ్యానర్ అంటే నాకు ఎంతో గౌరవం. గీతా ఆర్ట్స్ బ్యానర్‌లో బయట నుంచి వచ్చిన హీరోలకు గీతా గోవిందం, భలే భలే మొగాడివో చిత్రాలు నెక్ట్స్ లెవెల్ సక్సెస్ లభించాయి. అలాంటి బ్యానర్ నుంచి 2019లో నాకు ఫోన్ వచ్చింది. దాంతో చావు కబురు చల్లగా మూవీ ప్రయాణం మొదలైంది. ఆ కాల్‌తో ఓ పాజిటివ్ జర్నీ మొదలైంది అని హీరో కార్తీకేయ తెలిపారు.

    డైరెక్టర్ ఫిలాసఫి సూపర్బ్

    డైరెక్టర్ ఫిలాసఫి సూపర్బ్

    సినిమా గురించి చర్చించడానికి గీతా ఆర్ట్స్‌ రాగానే డైరెక్టర్ కౌశిక్‌ను కలిశాను. ఆ తర్వాత చిన్న పిల్లాడులా ఉన్నాడేంటి అనుకొన్నాను. పెళ్లి చూపులు లాంటి సినిమా ఏదో ఉంటుందనుకొన్నాను. కథ చెప్పడం ప్రారంభించిన తర్వాత ఆయన ఫిలాసఫీని చూసిన తర్వాత ఈ సినిమాను మిస్ చేసుకోవద్దు అనుకొన్నాను అని కార్తీకేయ పేర్కొన్నారు.

    డైరెక్టర్ కౌశిక్‌ని వదులుకోవద్దని అనుకొన్నా

    డైరెక్టర్ కౌశిక్‌ని వదులుకోవద్దని అనుకొన్నా

    నా కెరీర్ చిన్నదైనప్పటికీ.. చాలా కథలు వింటూ సినిమాలు చేస్తూ వస్తున్నాను. కౌశిక్ కథ చెప్పిన తర్వాత ఇలాంటి డైరెక్టర్‌ను వదులుకోవద్దని డిసైడ్ అయ్యాను. ఈ కథలో నన్ను ఆకట్టుకొన్న విషయానికి వస్తే.. శవాల బండి నడుపుకొనే వాడు.. చచ్చిపోయిన వాడి పెళ్లాన్ని లవ్ చేయడం లాంటి పాయింట్ నన్ను విపరీతంగా ఆకట్టుకొన్నది అని కార్తీకేయ తెలిపారు.

    సెంటిమెంట్, ఎమోషన్స్‌తో

    సెంటిమెంట్, ఎమోషన్స్‌తో

    చావు కబురు చల్లగా సినిమాలో ప్రతీ సీన్‌ చక్కగా ఉంటుంది. ఒక్కో దశలో ఎమోషన్స్ పీక్స్‌కు వెళ్లి కంటతడి పెట్టించేలా ఉంటుంది. దర్శకుడు రాసుకొన్న ప్రతీ ఫ్రేమ్ బ్రహ్మండంగా ఉంటుంది. ఎమోషన్స్, ఎంటర్‌టైన్‌మెంట్ మిక్స్ చేసి ఈ సినిమాను రూపొందించారు. సెంటిమెంట్‌తోపాటు అన్ని అంశాలను బ్యాలెన్స్ చేస్తూ రూపొందించిన చిత్రమని చెప్పవచ్చని హీరో కార్తికేయ వెల్లడించారు.

    Recommended Video

    90ml Director Shekar Reddy Exclusive Interview
    చావుపై ఫిలాసఫీ కట్టిపడేసింది

    చావుపై ఫిలాసఫీ కట్టిపడేసింది

    శవాల బండి నడుపుకొనే వ్యక్తి కథ అయితే రిస్క్‌గా భావించే వాడిని. కానీ సినిమా కథ మొత్తం చెప్పిన తర్వాత ఎలాంటి రిస్క్ లేదనిపించింది. దేవుడే జన్మనిస్తాడు.. దేవుడే చావును ఇస్తాడు. పుట్టిన రోజును గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకొంటాం. చావు అనేది దాని గురించి ఆలోచించం. అన్ని ఇచ్చిన ఆ సామే సావును గిఫ్టుగా ఇస్తే.. ఎందుకు వద్దంటావు చిత్రంగా అనే ఫిలాసఫీ నాకు బాగా నచ్చింది అని కార్తికేయ పేర్కొన్నారు.

    English summary
    Chaavu Kaburu Challaga is an upcoming Telugu Feature Film Presented by Allu Aravind, Ft. Kartikeya, Lavanya Tripathi, Aamani & others in Lead Roles, Directed by Koushik Pegallapati, Music by Jakes Bejoy & Produced by Bunny Vas Under GA2 Pictures.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X