Krithi Shetty ఆ విషయంలో రామ్‌‌ను చూసి భయపడ్డా..విజిల్స్ కొట్టడం పక్కా.. కృతిశెట్టి

యువ కథానాయకుడు, ఉస్తాద్ రామ్ పోతినేని నటించిన సినిమా 'ది వారియర్'. తమిళ అగ్ర దర్శకుడు లింగుస్వామి దర్శకత్వం వహించారు. పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా సిల్వ‌ర్ స్క్రీన్ పతాకంపై ప్రొడ‌క్ష‌న్ నెం. 6గా శ్రీనివాసా చిట్టూరి నిర్మించారు. జూలై 14న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ భాషల్లో భారీ ఎత్తున విడుదల కానుంది. ది వారియర్ మూవీ గురించి, లింగుస్వామి, హీరో రామ్ గురించి కృతి శెట్టి ఆసక్తికరమైన విషయాలు చెబుతూ..

లింగుస్వామి అంటే నాకు ఇష్టం

లింగుస్వామి అంటే నాకు ఇష్టం


చిన్నతనం నుంచే డైరెక్టర్ లింగుస్వామి సినిమాలు అంటే ఇష్టం. ఆయన రూపొందించిన ఆవారా సినిమా నాకు ఇష్టం. చిన్నతనంలో మా అమ్మమ్మ ఊరికి వెళ్లే సమయంలో ఆవారా క్యాసెట్ తీసుకెళ్లి.. రోజుకు రెండుసార్లైనా చూసేదానిని. లింగుస్వామి సినిమాల్లో హీరోయిన్లకు మంచి క్యారెక్టరైజేషన్ ఉంటుంది. ఆయన సినిమాల్లో హీరోయిన్లకు మంచి ప్రాధాన్యం ఉంటుంది. ది వారియర్ సినిమా కథ నాకు చెప్పినప్పుడు చాలా ఎక్సైట్ అయ్యాను. నాకు ఇష్టమైన దర్శకుడితో పనిచేస్తున్నానే సంతోషం కలిగింది అని కృతిశెట్టి తెలిపింది.

బుల్లెట్ సాంగ్, విజిల్ సాంగ్ గురించి

బుల్లెట్ సాంగ్, విజిల్ సాంగ్ గురించి


బుల్లెట్ సాంగ్ చాలా మందికి రీచ్ అయింది. రీల్స్, యూట్యూబ్‌లో ట్రెండింగ్‌గా మారింది. అయితే ఈ పాటకు ముందు నాకు చాలా భయం వేసింది. హీరో రామ్ ఎనర్జీ మ్యాచ్ చేయగలనా అనే సందేహం కలిగింది. ఒకసారి పాట చిత్రీకరణ పూర్తయిన తర్వాత ఎక్కడా బ్రేక్ పడకుండా ఒక ఫ్లోలో పూర్తయింది. మేము ఆ పాట షూట్‌లో నేను చాలా ఎంజాయ్ చేశాను. బుల్లెట్ సాంగ్ అర్బన్ ప్రేక్షకులకు, విజిల్ సాంగ్ మాస్ ప్రేక్షకులు ఎంజాయ్ చేసేలా ఉంటాయి అని కృతిశెట్టి పేర్కొన్నది

రామ్‌తో కెమిస్ట్రీ ఎలా ఉంటుందంటే?

రామ్‌తో కెమిస్ట్రీ ఎలా ఉంటుందంటే?


ది వారియర్ సినిమాలో నా పాత్ర క్యూట్ క్యారెక్టర్. ప్రతీ ఒక్కరికి మా పక్కింటి అమ్మాయిలా కనిపిస్తుంది. విజిల్ మహాలక్ష్మీ నా పాత్ర పేరు. ఈ సినిమాలో నేను రేడియో జాకీలా నటిస్తున్నాను. ఆర్జే పాత్ర కోసం చాలా ఆడియో, వీడియోలు విన్నాను. చూశాను. ప్రాడ్‌కాస్ట్ విన్నాను. ఆర్జేలు ఎలా మాట్లాడుతారో విని నేను పాత్రలోకి వెళ్లిపోయాను. ఈ సినిమాలో మా కెమిస్ట్రీ బాగుంటుంది. ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకొంటారో అని ఎదురు చూస్తున్నాను. పోలీస్ స్టేషన్, రేడియో స్టేషన్, రైల్వే స్టేషన్‌లో మా లవ్ ట్రాక్ నడుస్తుంది. చాలా ఇంట్రెస్టింగ్ లవ్ ట్రాక్ అని కృతిశెట్టి తెలిపింది.

 లింగుస్వామితో పనిచేయడం

లింగుస్వామితో పనిచేయడం


గత రెండు సినిమాల్లో నేను పోషించిన పాత్రలకు భిన్నంగా విజిల్ మహాలక్ష్మీ ఉంటుంది. ఈ పాత్ర అంతా ఛాలెంజిగ్‌గా అనిపించలేదు. చాలా ఈజీగా పాత్రను అర్దం చేసుకొన్నాను. లింగుస్వామితో పనిచేయడం సులభం. ఆయన నేను ఏం చేయాలనే విషయాలను స్పష్టంగా చెబుతారు. దాంతో విజిల్ మహాలక్ష్మీ పాత్రను పోషించడం చాలా ఈజీ అయింది అని కృతిశెట్టి చెప్పింది.

మా జంట బాగుంటుందని

మా జంట బాగుంటుందని


హీరో రామ్‌తో నటించే ముందు చాలా ఎనర్జీగా ఉండాలని అనుకొన్నాను. కానీ సెట్లో రామ్‌ను చూసిన తర్వాత అతడు చాలా కూల్‌గా అనిపించాడు. ది వారియర్ సినిమా చేసే ముందు రామ్ నటించిన ఇస్మార్ట్ శంకర్, రెఢీ, హలో ప్రేమ కోసమే గురూ, దాదాపు అన్ని సినిమాలు చూశాను. అందరూ మా జంట బాగుంటుందని అంటున్నారు. సీన్స్ కూడా బావుంటాయి. థియేటర్లలో సినిమా వచ్చే వరకు వెయిట్ చేయండి. సీన్స్ గురించి ఇప్పుడే చెప్పలేను.ఆయన హై ఎనర్జీతో ఉంటారు. అందుకని, కొంచెం నెర్వస్ ఫీలయ్యా. కానీ, హీ ఈజ్ వెరీ కూల్ అని కృతిశెట్టి తెలిపింది.

నేను విజిల్స్ వేస్తా..

నేను విజిల్స్ వేస్తా..


ది వారియర్ సినిమా తెలుగు, తమిళ భాషలో రిలీజ్ అవుతున్నది. రెండు భాషల్లో షూటింగ్ చేయడం నాకు కష్టం అనిపించలేదు. నా కంటే రామ్ ఎక్కువ కష్టపడ్డారు. నేను లిప్ సింక్, మ్యాచ్ చేయడం ఈజీ. రామ్ అలా కాదు... ప్రతి సీన్, డైలాగ్ విషయంలో ఆయన కష్టపడ్డారు. ఈ సినిమా చూసేటప్పుడు ప్రేక్షకుల రియాక్షన్ చూసి నేను విజిల్స్ వేస్తా. అది మాత్రం పక్కా అని కృతిశెట్టి చెప్పింది.

సినిమా అంటే ప్రేమ..

సినిమా అంటే ప్రేమ..


శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ ప్రొడక్షన్ హౌస్‌లో బ్యాక్ టు బ్యాక్ రెండు సినిమాలు చేస్తున్నాను. వెరీ నైస్ ప్రొడక్షన్ హౌస్. కాంప్రమైజ్ కాకుండా రిచ్‌గా సినిమా తీశారు. మా నిర్మాత శ్రీనివాసా చిట్టూరికి సినిమా అంటే ప్రేమ. ఆయన తక్కువ మాట్లాడతారు. సినిమా ఖర్చు విషయంలో ఆ ప్రేమ చూపిస్తారు అని కృతిశెట్టి తెలిపింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X