For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Kriti Shetty.. అందుకే నానితో లిప్‌లాక్ ఆ సీన్ చేశా.. చేతులు వణికిపోయాయి.. కృతిశెట్టి ఇంటర్వ్యూ

  |

  ఉప్పెన చిత్రంతో బేబమ్మగా ప్రతీ ఒక్కరిని ఆకట్టుకొన్న కృతిశెట్టి తాజాగా శ్యామ్ సింగరాయ్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. తొలి చిత్రంలో గ్రామీణ యువతిగా కనపించిన బేబమ్మ ప్రస్తుతం ఆధునిక యువతగా కనిపించారు. నాని, సాయిపల్లవికి ధీటుగా కీర్తి అనే పాత్రలో ప్రేక్షకులను మెప్పించారు. ఈ సందర్భంగా మీడియాతో కృతిశెట్టి మాట్లాడుతూ..

  బేబమ్మ నుంచి కీర్తిగా ట్రాన్స్‌ఫార్మ్

  బేబమ్మ నుంచి కీర్తిగా ట్రాన్స్‌ఫార్మ్

  ఉప్పెన సినిమాలో బేబమ్మ పాత్రకు శ్యామ్ సింగరాయ్ సినిమాలోని కీర్తి పాత్రకు ఎలాంటి పోలికలు లేవు. ఉప్పెన తర్వాత బేబమ్మ లాంటి పాత్రలు వచ్చాయి. కానీ నేను వాటిని రిజెక్ట్ చేశాను. శ్యామ్ సింగరాయ్ సినిమా కోసం దర్శకుడు రాహుల్ కథ చెప్పినప్పుడు మోడరన్ అమ్మాయి పాత్ర నాకు బాగా నచ్చింది. ఆ పాత్ర కోసం రీసెర్చ్ చేశాను. అలాగే హాలీవుడ్ సినిమాలు కొన్ని చూశాను. మోడల్స్ మేనరిజం పరిశీలించాను. అలా నా బాడీ లాంగ్వేజ్‌ ఇలా ఉండాలని అనుకొన్నాను. ఈ పాత్ర కోసం రకరకాలుగా లుక్‌ టెస్ట్ జరిగాయి. కొత్తగా ట్రై చేయాలని ఈ పాత్రను చేశాను అని కృతిశెట్టి తెలిపారు.

  నాకు పొగతాగడం అంటే..

  నాకు పొగతాగడం అంటే..

  తల్లి లేని అమ్మాయిగా నటించాలని చెప్పారు. అలాగే తల్లి లేకపోవడం వల్ల గడుసుతనం ఉండే అబ్బాయిగా నటించాలని చెప్పారు. అయితే సిగరెట్ తాగడం ఈ సినిమాలో ఛాలెంజ్‌ అనిపించింది. నాకు పొగతాగడమంటే నాకు ఇష్టం ఉండదు. అందుకే షూటింగ్‌కు ముందు రాహుల్‌ను కలిసి సిగరేట్ తాగే సీన్ ఎందుకు, తీసేయడానికి అవకాశం ఉందా? అంటే.. ఆ పాత్రకు అదే స్పెషల్ ఎట్రాక్షన్.

  ఆ పని చేసేది నీవు కాదు కదా.. కీర్తి పాత్ర కోసం మీరు చేయాల్సిదే అని చెప్పారు. షూటింగ్‌కు రెండు రోజుల ముందు అసిస్టెంట్ డైరెక్టర్ మింట్ సిగరెట్లు తెచ్చి ప్రాక్టీస్ చేయించారు. ఫస్ట్ టైమ్ తాగేటప్పుడు చేతులు వణికాయి. షూటింగ్‌లో పర్‌ఫెక్ట్‌గా చేశాను అని కృతిశెట్టి అన్నారు.

  నాని ఎలాంటి సహకారం అందించారంటే

  నాని ఎలాంటి సహకారం అందించారంటే

  ఉప్పెన సమయంలో అంతా కొత్తవాళ్లే. అప్పుడు పెద్దగా భయం అనిపించలేదు. కానీ శ్యామ్ సింగరాయ్‌ కోసం నానిని కలిసేటప్పుడు నాకు భయం వేసింది. కానీ షూటింగులో ఆయన అందించిన సహకారం మాటల్లో చెప్పలేం. సెట్‌లో అందరి పెర్ఫార్మెన్స్‌ను చూసి బాగుంది.. లేదనే విషయాన్ని చెబుతాడు. అందరికి సలహాలు, సూచనలు ఇస్తారు. ఆయన సపోర్ట్ వల్లనే స్క్రీన్ మీద నా పాత్ర పండిందని అనుకొంటున్నాను అని కృతిశెట్టి తెలిపారు.

  లిప్ లాక్ సీన్ ఎందుకు చేశానంటే..

  లిప్ లాక్ సీన్ ఎందుకు చేశానంటే..

  శ్యామ్ సింగరాయ్‌లో బోల్డ్ సీన్లు, లిప్‌లాక్ సీన్లు అందరికి బ్యాడ్ అనిపిస్తాయి. కానీ నటిగా నేను వాటిని తీసుకొనే తీరును బట్టి మంచి చెడు ఉంటుంది. సినిమాలో నా పాత్ర బిహేవ్ చేయాల్సింది చేశాను. యాక్షన్ సీన్లలో కూడా అందరూ నటిస్తారు. యాక్షన్ సీన్ల మాదిరిగానే బోల్డ్ సీన్లు, లిప్ లాక్ సీన్లను భావించాను. ఏ సీన్ అయినా నటించడమే అని కృతిశెట్టి చెప్పారు.

  కథలో లిప్‌లాక్‌కు ప్రాధాన్యం

  కథలో లిప్‌లాక్‌కు ప్రాధాన్యం

  సినిమా కథ చెప్పినప్పుడు బోల్డ్ సీన్ కానీ, లిప్ లాక్ సీన్‌కైనా ప్రాధాన్యం ఉందా అని చూసుకొంటాను. దానిని బట్టి ఆ సీన్ కోసం ప్రిపేర్ అవుతాను. ఒకవేళ సినిమాలో రొమాంటిక్ సీన్‌కు ప్రాధాన్యం లేకపోతే నటించనని చెబుతాను. నానితో లిప్ లాక్ సీన్‌ కథను మలుపు తిప్పే విషయం. కాబట్టే ఆ సీన్‌ను ఒప్పుకొన్నాను. అంతే తప్ప దానిని ప్రత్యేకంగా చూడనక్కర్లేదు అని కృతిశెట్టి అన్నారు.

  రొటీన్ పాత్రలు చేయను...

  రొటీన్ పాత్రలు చేయను...

  వాస్తవానికి నేను యాక్టర్ కావాలని అనుకోలేదు. అలాంటి సమయంలో నాకు ఛాలెంజింగ్ రోల్స్ వస్తే నటనపై ఇంట్రెస్ట్ కలుగుతుంది. రొటీన్ ఒకే పాత్రలు నేను వేస్తే సినిమాకు రానక్కర్లేదు. నా పాత సినిమాలు ఓటీటీలో చూస్తే చాలు. సినిమా థియేటర్‌కు వచ్చే ప్రేక్షకుడికి నా పాత్ర నేను కొత్త అనుభూతిని కలిగించాలని కోరుకొంటాను. నేను చేసే పాత్ర చేసే పాత్ర ప్రేక్షకులకు నచ్చుతుందా లేదా అనే విషయాన్ని బాగా ఆలోచిస్తాను అని కృతిశెట్టి తెలిపారు.

  English summary
  Heroine Kriti Shetty debuted with Uppena. Now, She is came with Shyam Singha Roy. In this occassion, Kriti Shetty speaks to filmibeat exclusively.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X