twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సినిమాను ఎంజాయ్ చేసే రోజులు పోయాయి.. బొక్కలు వెతికేందుకే వస్తున్నారు.. డైలాగ్ రైటర్ లక్ష్మీభూపాల

    |

    శ్రీ వేదాక్షర ఫిలింస్, నాగశేఖర్ మూవీస్, మణికంఠ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై సత్యదేవ్, పాన్ ఇండియా యాక్టరస్ తమన్నా భాటియా, మేఘా ఆకాష్, కావ్య శెట్టి, ప్రియదర్శి, సుహాసిని నటిస్తున్నారు. కన్నడలో సక్సెస్ ఫుల్ డైరెక్టర్ నాగశేఖర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని చింతపల్లి రామారావు, భావన రవి, నాగశేఖర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. చినబాబు, ఎంఎస్ రెడ్డి సమర్పించారు. ఈ సినిమా డిసెంబర్ 9వ తేదీన రిలీజ్ అవుతున్న నేపథ్యంలో మాటల రచయిత లక్ష్మీభూపాల మాట్లాడుతూ..

    గుర్తుందా శీతాకాలం సినిమా జర్నీ గురించి

    గుర్తుందా శీతాకాలం సినిమా జర్నీ గురించి

    గుర్తుందా శీతాకాలం సినిమాకు ముందుగా వేరే డైరెక్టర్ అనుకొన్నాడు. ఆ డైరెక్టర్ నాకు కథ చెప్పి.. సత్యదేవ్ కావాలని అడిగాడు. అలా నేను ఈ ప్రాజెక్టులోకి ఎంట్రీ ఇచ్చాను. ఆ తర్వాత డైరెక్టర్ మారడం, నాగశేఖర్ ప్రాజెక్టు టేకప్ చేయడం జరిగింది. సత్యదేవ్‌తో నాకు ఉన్న అనుబంధం ఎప్పటిదో. సత్యదేవ్ చిన్న చిన్న పాత్రలు వేసేటప్పటి నుంచి నాకు పరిచయం ఉంది. సత్యదేవ్ మా ఇంటి సభ్యుడని నేను చెప్పగలను అని రచయిత లక్ష్మీభూపాల తెలిపారు.

    నాలుగు వేరియేషన్స్‌తో కథ

    నాలుగు వేరియేషన్స్‌తో కథ

    నా ఆటోగ్రాఫ్ లాంటి సినిమాలు పదేళ్లకోసారి రావడం కష్టమే. అలాంటి కథతో నాలుగు వేరియేషన్స్ ఉండటం గుర్తుందా శీతాకాలం స్టోరీకి స్పెషల్ ఎట్రాక్షన్. రీమేక్ సినిమాలంటే ప్రేక్షకులకు ఆ ప్రత్యేకమైన ఆసక్తి ఉంటుంది. ఒరిజినల్ ఎలా ఉంది.. రీమేక్ ఎలా ఉందని పోల్చి చూస్తారు అని రచయిత లక్ష్మీ భూపాల అన్నారు.

    సినిమాను సినిమాగా చూడటం లేదు

    సినిమాను సినిమాగా చూడటం లేదు

    ప్రస్తుతం సినిమాను ప్రేక్షకులు ఎంజాయ్ చేసే రోజులు పోయాయి. సినిమాను సినిమాగా చూసే రోజులు పోయాయి. ఇప్పుడు ప్రేక్షకులు నల్లకోట్లు వేసుకొని జడ్జిమెంట్ ఇచ్చేందుకు రెడీగా ఉంటున్నారు. ప్రతీ ఒక్కరు రివ్యూలు రాయడానికో.. సన్నివేశాలను స్క్రీన్ షాట్స్ సోషల్ మీడియాలో పెట్టడానికో సినిమాకు వస్తున్నారు. సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్ల ప్రభావం సినిమాలపై పడుతున్నది. కానీ కొందరు సినిమాపై ప్రేమ, అభిమానంతో వచ్చే వారు కూడా ఉన్నారు. వారు సినిమా సినిమాగా చూస్తారు. బొక్కలు వెతకడం ఎక్కువైంది అని లక్షీ భూపాల చెప్పారు.

    పదేళ్ల క్రితం రచయితగా నా ప్రయాణం

    పదేళ్ల క్రితం రచయితగా నా ప్రయాణం

    పదేళ్ల క్రితం అలా మొదలైంది సినిమాతో రచయితగా నా ప్రయాణం మొదలైంది. అయితే పదేళ్ల కాలంలో రకరకాల విభిన్నమైన సినిమాలకు మాటలు రాసే అవకాశం వచ్చింది. ప్రేమకథలు, రాజకీయ నేపథ్యం, పల్లెటూరి బ్యాక్ డ్రాప్‌తో వచ్చే సినిమాలకు మాటలు రాసి మెప్పించారు. కథ నన్ను మెప్పించి.. కంటెంట్ స్ట్రాంగ్‌గా ఉంటే మంచి మాటలు రాయడానికి స్కోప్ ఉంటుంది అని లక్ష్మీ భూపాల అన్నారు.

    ఛాలెంజ్ విసిరే కథలు రావడం లేదు..

    ఛాలెంజ్ విసిరే కథలు రావడం లేదు..

    గుర్తుందా శీతాకాలం సినిమా గీతాంజలి మాదిరిగా ఉంటుందని చెప్పడం ఒక రెఫరెన్సుగానే తీసుకోవాలి. ఆ సినిమాలో ఉండే ఫీల్ గుర్తుందా శీతాకాలం సినిమాలో ప్రేక్షకులకు అనుభూతిని పంచుతుంది. కొన్ని సన్నివేశాల్లో కంటతడి పెట్టించే ఎమోషన్స్ ఉంటాయి. రచయితగా నాకు ఛాలెంజ్‌ విసిరే సినిమాలు రావడం లేదు. ఏలియన్, రాకెట్ సైన్స్, న్యూక్లియర్ సైన్స్ కథలకు డైలాగ్స్ రాయడం లేదు కదా.. రెగ్యులర్ కథలు, అమ్మాయి, అబ్బాయి మధ్య గొడవలు తప్ప.. కొత్తగా ఏమీ రావడం లేదు. ఇష్టపడి రాసామా? డబ్బు కోసం రాశామా? అనేదే ప్రధాన అంశం అని లక్ష్మీభూపాల తెలిపారు.

    త్వరలోనే డైరెక్షన్ చేస్తా

    త్వరలోనే డైరెక్షన్ చేస్తా

    రచయితలు సినీ దర్శకులుగా మారి రాణిస్తున్నారు. నాకు కూడా డైరెక్షన్ ఛాన్స్ వచ్చింది. పెద్ద బ్యానర్లు కూడా నాకు డైరెక్షన్ ఆఫర్ ఇచ్చాయి. కానీ ఎవరో చేయమని చెప్పినప్పుడు డైరెక్షన్ చేయడం కాదు.. నాకు చేయాలనిపిచ్చినప్పుడు నేను డైరెక్షన్ చేస్తాను. ప్రస్తుతం నేను నిర్మాతగా మారాను. త్వరలోనే నా సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తున్నది.

    English summary
    Gurtundha Seethakalam is set to release on December 9th. In this occassion, Movie unit released trailer on December 3rd. Here is the Dailogue writer Lakshmi Bhoopala Interview exclusively.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X