లిటిల్ హార్ట్స్‌తో సరికొత్త రికార్డ్.. ఇండస్ట్రీ షేక్ అయ్యేలా.. డైరెక్టర్ మార్తాండ్ అసలు ప్లాన్
తెలుగు ప్రేక్షకుల నుంచి ప్రశంసలు అందుకుంటున్న చిన్న బడ్జెట్ చిత్రం లిటిల్ హార్ట్స్. ఈ రొమాంటిక్ డ్రామాలో యువ హీరో మౌళి తనుజ్ నటించడం విశేషం. ఈయన ఇప్పటికే 90's మిడిల్ క్లాస్ మెలోడిస్ సిరీస్ తో పాపులర్ అయ్యాడు. నటుడు శివాజీ, మౌళి తండ్రి కొడుకులుగా అలరించిన సంగతి తెలిసిందే. ఇక సెప్టెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు వచ్చిన లిటిల్ హార్ట్స్ చిత్రంలో టాలీవుడ్ ప్రముఖ నటుడు రాజీవ్ కనకాల, మౌళి తండ్రి కొడుకులుగా అలరించారు. ఈ చిత్రానికి యువతతో పాటు ఫ్యామిలీ ఆడియెన్స్ నుంచి కూడా మంచి రెస్పాన్స్ దక్కుతుండటం విశేషం.
ఇక లిటిల్ హార్ట్స్ చిత్రానికి డెబ్యూ డైరెక్టర్ సాయి మార్తాండ్ దర్శకత్వం వహించడం విశేషం. 90's మిడిల్ క్లాస్ మెలోడిస్ సిరీస్ కు దర్శకత్వం వహించిన ఆదిత్యా హాసన్ ఈ సినిమాకు నిర్మాతగా మారారు. ఏ విన్ ఒరిజినల్ ప్రొడక్షన్ బ్యానర్ లో కేవలం రూ.2.5 కోట్ల బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మించారు. నటీనటుల రెమ్యునరేషన్స్, మూవీ ప్రొడక్షన్ కాస్ట్, ప్రచార కార్యక్రమాలన్నీ కలుపుకొని సినిమాకు ఈమేర బడ్జెట్ అయ్యిందని టీమ్ వెల్లడించారు. చిన్న బడ్జెట్ చిత్రంగా వచ్చి భారీ స్థాయిలో ప్రశంసలు అందుకుంటోంది.

ఈ చిత్రాన్ని టాలీవుడ్ ప్రముఖ నిర్మాత బన్నీ వాస్ ఎంటర్ టైన్ మెంట్స్, వంశీ నందిపాటి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్లలో ఈ చిత్రాన్ని గ్రాండ్ గా విడుదల చేశారు. సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ రెస్పాన్స్ దక్కుతోంది. ఈ సందర్భంగా మూవీ టీమ్ బ్యాక్ టు బ్యాక్ ఇంటర్వ్యూలు ఇస్తూ పోస్ట్ రిలీజ్ ప్రమోషన్స్ ను మరింత జోరుగా కొనసాగుతున్నారు. కాగా తాజాగా లిటిల్ హార్ట్స్ మూవీ డైరెక్టర్ సాయి మార్తాండ్ ఇంటర్వ్యూ ఇచ్చారు. తన సినిమా గురించి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.
సాయి మార్తాండ్ మాట్లాడుతూ.. లిటిల్ హార్ట్స్ సినిమాను నేను 30 లక్షల రూపాయల బడ్జెట్ తో తీద్దామని అనుకున్నాను. కానీ 2 కోట్ల రూపాయల బడ్జెట్ ను ఇప్పించాడు ఆద్యిత హసన్. నేను చూపించాలని అనుకున్న అన్ని సన్నివేశాలకు 30 లక్షల బడ్జెట్ సరిపోతుందని నా అభిప్రాయం. పెళ్లి చూపులు సినిమాను కూడా రూ.60 లక్షలలో తెరకెక్కించారు. అలాంటిది నాకు రూ.2.5 కోట్లను సమకూర్చడంతో సినిమా తీయడం ఇబ్బందేమీ కాలేదు. కానీ ఎవరో ఒకరు ఇండస్ట్రీలో 30 లక్షల్లోనే సినిమాను తీసి సెన్సేషన్ క్రియేట్ చేస్తారు. రాబోయే 2 ఏళ్లలో ఇది జరుగుతుందని నా అభిప్రాయం.
ఈ కథ రాసేటప్పుడే సూపర్ హిట్ అయితే చాలానుకున్నా.. కానీ అంతకు మించిన రెస్పాన్స్ రావడం చాలా సంతోషం. నాకు లిటిల్ హార్ట్స్ చిత్రంపై చాలా కాన్ఫిడెన్స్ గా ఉన్నాను. ఈ చిత్రాన్ని మొదట్లో ఓటీటీలోనే విడుదల చేయాలని అనుకున్నాను. ఇక ఈ చిత్రంలో జగపతి బాబు ఫాదర్ గా నటించాల్సి ఉంది. కానీ కుదరలేదు. ఇదే సినిమా షూట్ సమయంలో మళ్లీ కలిశాం. ఇక ఆ తర్వాత కొన్ని రోజులకు ఆయన శ్రీలంకలో ఉండి జగపతి బాబు నాకు సినిమా ఆఫర్ ఇచ్చారు. అడ్వాన్స్ కూడా ఇచ్చారు.


Click it and Unblock the Notifications











