Hunt Movie సుధీర్ బాబు కెరీర్‌లోనే ది బెస్ట్.. వాటి వల్లే సినిమాలు ఆడవు.. మహేష్
నైట్రో స్టార్ సుధీర్ బాబు హీరోగా ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ భవ్య క్రియేషన్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత వీ ఆనంద ప్రసాద్ నిర్మించిన చిత్రం హంట్. యువ దర్శకుడు మహేష్ సూరపనేని దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శ్రీకాంత్, తమిళ హీరో భరత్ ప్రధాన పాత్రల్లో నటించారు. రిపబ్లిక్ డే కానుకగా జనవరి 26న థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా మహేష్ సూరపనేని మీడియాకు ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ..

సుధీర్ బాబుకు సూట్ అవుతుందని
హంట్ మూవీకి సంబంధించిన స్టోరి పాయింట్ నిర్మాత, కథ నిర్మాత ఆనంద్ ప్రసాద్ గారికి, ఆయన టీమ్‌కు నచ్చడం, స్క్రిప్ట్ రెడీగా ఉండటంతో వెంటనే స్టార్ట్ చేయొచ్చని ప్లాన్ చేశాం.సుధీర్ బాబు అయితే బావుంటుందని నిర్మాత చెప్పడంతో ఆయనకు కథ చెప్పా. రెండు రోజుల్లో సినిమా ఓకే అయిపొయింది. దాంతో హంట్ సినిమా అలా ప్రారంభమైంది అని మహేష్ చెప్పారు.

గత మరిచిపోయిన పోలీస్ ఆఫీసర్
హంట్ సినిమా కథ విషయానికి వస్తే.. పోలీస్ ఆఫీసర్ అయిన హీరోకి గతం మరిచిపోతాడు. గతం మర్చిపోవడానికి ముందు, వెనుక ఏం జరిగింది? అనేది డ్రామా. మా హంట్ సినిమాలో ఆ డ్రామా కంప్లీట్ డిఫరెంట్ & కొత్తగా ఉంటుంది. చాలా మంది హాలీవుడ్ సినిమాలు, 'బార్న్ అల్టిమేటమ్' అని చెబుతారు. హీరో గతం మర్చిపోయి, తెలుసుకునే ప్రాసెస్ చాలా సినిమాల్లో ఉంది. మెమరీ లాస్ అంటే చాలా మంది ఫన్నీగా ఆలోచిస్తారు. హీరో తన జీవితాన్ని మలుపు తిప్పిన సంఘటనకు సంబంధించిన మిస్టరీని సాల్వ్ చేయాల్సివస్తుంది. పరిస్థితులన్నీ ప్రతికూలంగా మారి.. జీవన్మరణ సమస్య ఏర్పడుతుంది. ఈ కథలో మేం ఓ కొత్త పాయింట్ చెబుతున్నాం. థియేటర్ నుంచి బయటకు వచ్చే ప్రేక్షకుడు... క్లైమాక్స్ చూసి ఎంజాయ్ చేస్తాడు అని మహేష్ చెప్పారు.

భరత్, శ్రీకాంత్ పాత్రలు ఎలా ఉంటాయంటే?
ప్రేమిస్తే ఫేమ్ భరత్ చాలా రోజుల తర్వాత తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. సినిమాలో ఆయనది చాలా ఇంపార్టెంట్ రోల్. భరత్ కంటే ముందు కొంత మంది తెలుగు నటులను కూడా పరిశీలించాం. అయితే... సుధీర్ బాబు, భరత్ కాంబినేషన్ కొత్తగా ఉంటుందని అనిపించింది. ఆయన తమిళంలో వరుసగా సినిమాలు చేస్తున్నారు. ఆయనకు కథ బాగా నచ్చింది. ఆ సమయంలో తెలుగు సినిమా చేయాలని బలంగా ఉన్నారు. ఇకసీనియర్ హీరో శ్రీకాంత్ ను తీసుకోవడానికి కారణం కథలో సుధీర్ బాబుకుఒక మార్గదర్శి లాంటి రోల్ ఉంది. హీరోకి సలహాలు ఇస్తూ... మోరల్ సపోర్ట్ ఇచ్చే క్యారెక్టర్ ఉంటుంది. ఆ పాత్ర ఎవరు చేస్తే బావుంటుంది? అనిపించినప్పుడు... శ్రీకాంత్ గారు గుర్తొచ్చారు. లుక్స్ & స్క్రీన్ ప్రజెన్స్ కోసం తీసుకున్నా అని మహేష్ చెప్పారు.

ఫారిన్ స్టంట్ మాస్టర్.. ప్యారిస్ షూటింగ్
ఎపిసోడ్స్ కోసం ఫారిన్ స్టంట్ కొరియోగ్రాఫర్స్‌ను తీసుకొన్నాం. కథ డిమాండ్ చేయడం, అలాగే హీరో ఎలివేషన్స్ కోసం ఉపయోగించుకొన్నాం. సుధీర్ బాబు ఎప్పట్నుంచో యూరప్‌కు చెందిన స్టంట్ కొరియోగ్రాఫర్స్టీమ్ చేసే వీడియోలనుఇన్స్‌టాగ్రామ్‌లో ఫాలో అవుతున్నాడు. దాంతో వారిని వీడియో కాల్స్ ద్వారా కలిసి మాట్లాడటం.. వారు ఈ సినిమా చేయడానికి ఒకే చెప్పడంతో వాళ్లు ఈ ప్రాజెక్టులోకి వచ్చాం. పారిస్ వెళ్ళి అక్కడ ఫైటర్లతో షూట్ చేశాం. ఇండియాలో జరిగేఫైట్ అది. కానీ, మేం ఫారిన్ లో చేశాం. సినిమాలో మొత్తం ఆరు ఫైట్స్ ఉన్నాయి. అందులో రెండు ఛేజింగ్ సీక్వెన్సులు షూటింగ్ చేశాం. టీజర్, ట్రైలర్ రిలీజ్ అయ్యాక ఫైట్స్ బావున్నాయని చెబుతుండటం హ్యాపీగా ఉంది అని మహేష్ తెలిపారు.

తేజ వద్ద పనిచేశా
నిర్మాత వీ ఆనంద ప్రసాద్, భవ్య క్రియేషన్స్ నుంచి మంచి సపోర్ట్ లభించింది. నేను తేజ గారి దగ్గర డైరెక్షన్ డిపార్ట్‌మెంట్‌లో పనిచేశా. నా ఫస్ట్ సినిమా భవ్య క్రియేషన్స్‌లోనే. అప్పటి నుంచి ఆనంద ప్రసాద్ గారు, ఎగ్జిక్యూటివ్ నిర్మాత అన్నేరవి గారితో పరిచయం ఉంది. నాకు ఎంతో బాగా చూసుకున్నారు. నాకు మంచి సపోర్ట్ ఇచ్చారు. ఇంతభారీ తారాగణం, నిర్మాణ వ్యయంతో సినిమా తీశానంటేఆనంద ప్రసాద్ గారు, రవి గారేకారణం. వాళ్ళ వల్లే ఈ రోజు నేను ఇలా నిలబడగలిగా అని మహేష్ చెప్పారు.

సుధీర్ బాబు కెరీర్ డిఫైన్ చేసే సినిమా
హంట్ టీజర్, ట్రైలర్ చూశాక... స్టంట్స్, ఫైట్స్ గురించి బాగా మాట్లాడుకొంటున్నారు. సినిమాలో ఫైట్స్ మాత్రమే కాదు, ఇంకా చాలా ఉన్నాయి. ఫైట్స్ వల్ల సినిమాలు ఆడతాయని నేను నమ్మను. ఎమోషనల్ కంటెంట్ వల్ల సినిమాలు నిలబడతాయి. హంట్‌లో సుధీర్ బాబు, శ్రీకాంత్, భరత్ క్యారెక్టర్ల మధ్య స్ట్రాంగ్ ఎమోషన్ ఉంటుంది. ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ వచ్చేసరికి ప్రేక్షకులు ఉద్వేగానికి గురి అవుతారు. ఫైట్స్ కంటే అక్కడ ఎమోషన్ప్రేక్షకులను హంట్ చేస్తుంది. క్లైమాక్స్ చూశాక మంచి ఫీలింగ్ తో, బరువెక్కిన గుండెతో బయటకు వెళతారు. సినిమాటోగ్రాఫర్ అరుల్విన్సెంట్ బాగా చేశారు. ఇది సుధీర్ బాబు కెరీర్ డిఫైన్ చేసే సినిమా అవుతుంది. అతను ఎప్పటికీ గుర్తు పెట్టుకునే సినిమా అవుతుంది.


Click it and Unblock the Notifications











