twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ప్రేక్షకుడిని థియేటర్‌కు రప్పించాలంటే.. హీరోల పద్దతి మార్చుకోవాలి.. రెమ్యునరేషన్లపై నాగచైతన్య సంచలన వ్యాఖ్యలు

    |

    యువ సామ్రాట్ అక్కినేని నాగ చైత‌న్య హీరోగా దిల్‌రాజు ప్రొడ‌క్ష‌న్ అసోసియేష‌న్ విత్ ఆదిత్య మ్యూజిక్ కాంబినేష‌న్‌తో శ్రీమ‌తి అనిత స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై దిల్‌రాజు, శిరీష్ నిర్మించిన చిత్రం 'థాంక్యూ'. విక్రమ్ కే కుమార్ దర్శకత్వం వహించారు. జూలై 22న సినిమా విడుదలవుతుంది. ఈ సినిమా రిలీజ్ సంద‌ర్భంగా హీరో అక్కినేని నాగ చైత‌న్య మీడియాతో మాట్లాడుతూ..

    ప్రేక్షకుల మైండ్ సెట్ మారింది

    ప్రేక్షకుల మైండ్ సెట్ మారింది

    కోవిడ్ తర్వాత ప్రేక్షకుల మైండ్ సెట్ మారింది. ప్రేక్షకులను థియేటర్‌కు రప్పించాలంటే.. తప్పకుండా కొత్త కథలతో సినిమాలు చేయాలి. టీజర్, ట్రైలర్లు ప్రేక్షకులను ఆకట్టుకొనేలా కట్ చేయాలి. లవ్ స్టోరి గానీ, యాక్షన్ సినిమా గానీ.. చేసేటప్పుడు కొత్త పాయింట్ ఉండాలి అని నాగచైతన్య తెలిపారు.

    సినిమాకు కంటెంట్ మాత్రమే కింగ్

    సినిమాకు కంటెంట్ మాత్రమే కింగ్


    కోవిడ్ తర్వాత కూడా నా మైండ్ సెట్ మారింది. ఓ రెగ్యులర్ లవ్ స్టోరి చేయొచ్చు. ప్రేక్షకులు ఆ సినిమాను హ్యాపీగా చూసేలా ఉండాలి. సినిమాకు ప్రధానంగా కంటెంట్ ముఖ్యం. హీరో క్యారెక్టర్, తదితర అంశాలు ఆ తర్వాతే. సినిమా కొత్తగా ఉంటే ప్రేక్షకుడు తప్పకుండా సినిమా థియేటర్‌కు వస్తాడనేది నా అభిప్రాయం అని నాగచైతన్య పేర్కొన్నారు.

    ప్రేక్షకుడిని థియేటర్‌కు రప్పించాలంటే?

    ప్రేక్షకుడిని థియేటర్‌కు రప్పించాలంటే?


    కోవిడ్ సమయంలో ఓటీటీలో సినిమా చూడటానికి అలవాటు పడ్డారు. అది తప్పు అని నేను అనను. కానీ ప్రేక్షకులను థియేటర్‌కు రప్పించే విధంగా, థ్రిల్లింగ్ ఎలిమింట్స్‌తో సినిమాలు తీయాలి. సినీ నిర్మాణంలో అనేక మార్పులు తీసుకురావాలి. అప్పుడే నిర్మాత బతికి బయటపడుతాడు. రెమ్యునరేషన్లు కాకుండా ప్రాఫిట్‌లో షేర్ తీసుకోవాలి. హీరోలు, దర్శకులు, నిర్మాతలు బలంగా ఉంటే ఇలాంటి విషయాలు సాధ్యమవుతాయి అని నాగచైతన్య అన్నారు.

    ఓటీటీ రిలీజ్‌పై ఆంక్షలు విధించాలి

    ఓటీటీ రిలీజ్‌పై ఆంక్షలు విధించాలి


    బడ్జెట్, మేకింగ్ బడ్జెట్, ప్రాఫిట్స్‌ను బట్టి ప్రాఫిట్ రేషియో డిసైడ్ అవుతాయి. ఓటీటీ, శాటిలైట్, డిజిటల్ సినిమాలు బిజినెస్ తర్వాత పెట్టిన పెట్టుబడి.. వచ్చిన ఆదాయాన్ని బట్టి హీరోల వాటా నిర్ణయం జరుగుతుంది. అయితే సినిమా థియేటర్లకు ప్రేక్షకుడిని తీసుకు రావాలంటే.. ఓటీటీ రిలీజ్ కనీసం 10 వారాలు గడువు పెట్టాలి. ఈ అంశం గురించి సినిమా పరిశ్రమలో చర్చ జరుగుతున్నది. కొద్ది రోజుల్లో ఓ క్లారిటీ వస్తుంది అని నాగచైతన్య చెప్పారు.

     నాగచైతన్య రాబోయో సినిమాలు

    నాగచైతన్య రాబోయో సినిమాలు


    వెంకట్ ప్రభు దర్శకత్వంలో నేను నటించబోయే సినిమా కమర్షియల్ మాస్ ఎంటర్‌టైనర్. పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తున్నాను. మనాడు సినిమాను రీమేక్ చేయాలని అనుకొన్నాం. కానీ డబ్బింగ్ రైట్స్ విషయంలో కుదర్లేదు. కానీ ఇప్పుడు రానా దగ్గుబాటి మనాడు సినిమా రైట్స్ తీసుకొన్నాడు. పరుశురామ్‌తో ఒక సబ్టెక్ట్ అనుకొన్నాం. కొద్ది రోజుల క్రితం నాకు మంచి పాయింట్ చెప్పారు. పది రోజలల్లో పూర్తి కథతో వస్తారు. అలాగే తరుణ్ భాస్కర్‌తో ఒక కథ గురించి చర్చిస్తున్నాం.
    ధూత వెబ్ సిరీస్ నెట్‌ఫ్లిక్స్ ద్వారా వచ్చే ఏడాది రిలీజ్ అవుతుంది అని నాగచైతన్య చెప్పారు.

    English summary
    Hero Naga Chaitanya opened about Telugu film industry issues. He said, Heroes should take share in profit, not before film process. That only solve Issues some extent.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X