twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Varudu Kavalenu నేను బిగ్‌స్టార్ కావాలంటే.. ఆ హిట్లు పడాలి.. హీరో నాగశౌర్య సెన్సిబుల్ కామెంట్స్

    |

    సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై యువ హీరో నాగశౌర్య, యువ హీరోయిన్ రీతూ వర్మ జంటగా లక్ష్మీ సౌజన్య దర్శకురాలిగా పరిచయమవుతున్న చిత్రం వరుడు కావలెను. దీపావళీ కానుకగా రిలీజ్ అవుతున్న ఈ చిత్రానికి సూర్యదేవర నాగవంశీ నిర్మాత. ఈ సినిమా టీజర్లు, ట్రైలర్లు అన్ని వర్గాల ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకొన్నాయి. ఈ సినిమాపై ఫీల్‌గుడ్ ఫ్యాక్టర్‌ను పెంచింది. అంతేకాకుండా ఫ్యామిలీ ఆడియెన్స్‌ను ఆకట్టుకొనేలా ప్రమోషన్స్ భారీ రేంజ్‌లో చేశారు. ఈ సందర్భంగా హీరో నాగశౌర్య గురువారం తెలుగు ఫిల్మీబీట్‌తో మాట్లాడుతూ..

    వరుడు కావలెను ఎలా మొదలైందంటే..

    వరుడు కావలెను ఎలా మొదలైందంటే..


    2018లో చలో మూవీ సక్సెస్‌ పార్టీలో ఎడిటర్‌ చంటిగారి ద్వారా అక్క లక్ష్మీ సౌజన్య పరిచయమయ్యారు. 'చలో' సినిమా నచ్చి నన్ను అభినందించి, ఓ కథ చెబుతా వింటావా అన్నారు. సరే అని విన్నాను. అప్పుడు మొదలైన జర్నీ ఇప్పటి వరకూ కొనసాగుతుంది. ఫైనల్‌గా సినిమా విడుదలకు వచ్చింది, మా అక్క కల నిజమయ్యే రోజు వచ్చింది అని నాగశౌర్య చెప్పారు.

    మహిళా డైరెక్టర్లతో ఆ వెసులుబాటు

    మహిళా డైరెక్టర్లతో ఆ వెసులుబాటు

    గతంలో నేను దర్శకురాలు నందినీ రెడ్డితో పని చేశా. అమ్మాయి డైరెక్టర్‌ అయితే చాలా అడ్వాంటేజ్‌ ఉంటుంది. వాళ్లకి కోపం త్వరగా రాదు. ఓపిక ఎక్కువ. దేనికీ త్వరగా రియాక్ట్‌ కారు.. ఎప్పుడు రియాక్ట్‌ కావాలో అప్పుడే రియాక్ట్‌ అవుతారు. అన్ని పనులు సమకూర్చుతారు. మేల్‌ డైరెక్టర్స్‌తో పని చేయడంలో కూడా అడ్వాంటేజ్‌ ఉంటుంది అని నాగశౌర్య తెలిపారు.

    పెళ్లి పీటల ముందు వరకూ...

    పెళ్లి పీటల ముందు వరకూ...

    ప్రతి ఇంట్లో చూసే కథే ఇది. 30 ఏళ్లు దాటిన అబ్బాయి, అమ్మాయిలను పెళ్లి ఎప్పుడు? సంబంధాలు చూడాలా? అని అడగడం చాలా ఇబ్బందిగా ఉంటుంది. అబ్బాయి, అమ్మాయి ఎంత వరకూ రెడీగా ఉన్నారు అన్నది ఆలోచించరు. ఇలాంటివి అన్నీ మనం వింటుంటాం. ఈ పాయింట్‌ జనాలకు బాగా రీచ్‌ అవుతుందని అంగీకరించా. ఇది పక్కా యంగ్‌స్టర్స్‌ కథ. మెచ్యుర్డ్‌ లవ్‌స్టోరీ. ఇందులో రెండు ప్రేమకథలుంటాయి. పెళ్లి పీటల ముందు వరకూ జరిగే కథ ఇది. వ్యక్తిగతంగా 70, 80 శాతం నాకీ కథ కనెక్ట్‌ అయింది అని నాగశౌర్య అన్నారు.

    నదియా పాత్ర అద్బుతంగా ఉంటుంది

    నదియా పాత్ర అద్బుతంగా ఉంటుంది

    వరుడు కావలెను సినిమా కోసం త్రివిక్రమ్‌గారు ఓ సీన్‌ రాశారు. ఆ సీన్‌లో నేను యాక్ట్‌ చేశా. ఆయన రాసిన డైలాగ్‌లు చెప్పా. ఇందులో 15 నిమిషాల క్లైమాక్స్‌ ఉంటుంది. అది చాలా అద్భుతంగా ఉంటుంది. ఆ సన్నివేశాలను అందరూ ఫ్రెష్‌గా ఫీలవుతారు. 'అత్తారింటికి దారేది'లో నదియాగారు పోషించిన పాత్ర చూసి ఆమెతో ఈ తరహా పాత్ర చేయించడం కరెక్టేనా అనిపించింది. అయితే షూట్‌లో ఆమె అభినయం చూసి ఆ పాత్రతో ప్రేమలో పడిపోయా. అంత వేరియేషన్‌ ఊహించలేదు అని నాగశౌర్య పేర్కొన్నారు.

    Recommended Video

    Varudu Kavalenu Movie Team Interview
    ఇంకా మూడు హిట్లు కావాలి

    ఇంకా మూడు హిట్లు కావాలి

    సాధారణంగా ఏ హీరోనైనా బిగ్‌స్టార్ అవ్వాలంటే ఐదు హిట్లు పడాలి. నాకు కెరీర్‌లో అతి పెద్ద హిట్‌ చలో. ఇంకా నాలుగు హిట్లు కావాలి. వరుడు కావలెను మూవీ రెండోది పెద్ద హిట్‌. ఇక అశ్వద్ధామ మూవీ సక్సెస్‌ కాదు అంటే నేను ఒప్పుకోను. నర్తనశాల లాంటి ఫ్లాప్‌ సినిమా తర్వాత నాకు బెస్ట్‌ ఓపెనింగ్స్‌ తెచ్చిన సినిమా 'అశ్వద్ధామ'. హీరోగా ఒకే రోజు ఎదగడం కంటే ఒక్కో మెట్టు ఎక్కడం మంచిదని నెమ్మదిగా వెళ్తున్నా అని నాగశౌర్య అన్నారు.

    English summary
    Varudu Kavalenu' marks the directorial debut of Lakshmi Sowjanya. Starring Naga Shaurya and Ritu Varma in the lead roles. The film, presented by PDV Prasad and produced by Naga Vamsi Suryadevara under prestigious production house Sithara Entertainments, is all set for release on October 29th in theatres.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X