twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మన్మథుడు 2లో బూతులు నిజమే.. అన్నమయ్య తర్వాత అంత స్వచ్ఛమైన.. నాగ్

    |

    మన్మథుడు సినిమా తర్వాత మళ్లీ 17 ఏళ్ల తర్వాత వస్తున్న చిత్రం మన్మథుడు 2. నాగార్జున వయసు పైబడిన వ్యక్తిగా నటించారు. 25 ఏళ్ల యువతి రకుల్ ప్రీత్ సింగ్‌తో ప్రేమలో పడటం ఈ సినిమా కథగా రూపొందింది. గతంలో మన్మథుడు లభించిన ప్రేక్షకదారణ ఈ చిత్రానికి ఉంటుందని నాగార్జున ఇటీవల చెప్పారు. ఎన్నో అంచనాలతో ఆగస్టు 9న ప్రేక్షకుల ముందుకు వస్తున్న మన్మథుడు 2 చిత్రం గురించి నాగార్జున మీడియాతో ముచ్చటించారు. ఆయన చెప్పిన విషయాలు ఇవే..

    రిలీజ్‌కు ముందు కొంత టెన్షన్‌గా..

    రిలీజ్‌కు ముందు కొంత టెన్షన్‌గా..

    మన్మథుడు 2 సినిమాకు ముందు నాకు ఓ రకమైన టెన్షన్ ఉంది. ఎందుకంటే కొత్తగా ఓ పాత్రలో కనిపించబోతున్నాను. లక్షలాది మంది సినిమాను చూసి తమ తీర్పును ఇచ్చేందుకు రెడీగా ఉన్నారు. అంతేకాకుండా చాలా కష్టపడి, ఇష్టపడి మంచి సినిమాను చేశాం. ఓ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ చేసినప్పుడు దాని ఫలితం ఎలా ఉంటుందనే విషయంపై మరికాస్త ఆసక్తి పెరిగింది. అందుకే కొంత టెన్షన్‌గా ఉంది.

    ఫ్రెంచ్ సినిమా నచ్చడంతో

    ఫ్రెంచ్ సినిమా నచ్చడంతో

    రొమాంటిక్ కామెడీ సినిమాలు చేయాలనే ఉద్దేశం లేదు. ఆ సమయంలోనే ఫ్రెంచ్ సినిమాను చూశాను. అది నాకు కరెక్ట్‌గా సూట్ అవుతుందని అనుకొన్నారు. ఈ సినిమాలో మధ్య వయసు యువకుడు పాత్రను పోషిస్తున్నాను. ఫ్యామిలీ కోసం ఎలా ప్రేమలో పడ్డారనే విషయం చాలా ఫన్‌గా ఉంటుంది. 25 ఏళ్ల వయసులో ఉన్న యువతితో వయసు మళ్లిన వ్యక్తి జీవితంలో ప్రేమ ఎలాంటి మలుపులు తిప్పింది.

    పోర్చుగీస్‌లోనే ఎందుకు చేశామంటే

    పోర్చుగీస్‌లోనే ఎందుకు చేశామంటే

    పోర్చుగీస్ నేపథ్యం వెనుక పెద్దగా బ్యాక్ డ్రాప్‌ లేదు. బ్రిటిష్ కాలంలో వారితోపాటు వలసపోయిన తెలుగు కుటుంబ నేపథ్యంగా సినిమా రూపొందింది. సినిమా బ్యాక్ డ్రాప్ కొత్తగా ఉండాలనే ఉద్దేశంతోనే ఆ దేశాన్ని ఎంచుకొన్నాం. షూటింగ్ చేయడం చాలా తేలిక. అంతేకాకుండా పర్మిషన్లు పొందడం కూడా అంత కష్టమేమీ కాదు. అందుకే పోర్చుగీస్‌లో షూట్ చేశాం.

     ఐదుగురు మహిళల స్టోరీ

    ఐదుగురు మహిళల స్టోరీ

    మన్మథుడు చిత్రంలో రొమాన్స్, ఎమోషనల్ కంటెంట్ నాకు సొనాలి బింద్రే ఉన్నట్టే.. ఈ సినిమాలో క్లైమాక్స్‌లో లక్ష్మీ, ఝాన్సీ ఇతర నటీనటుల మధ్య ఎమోషనల్ సీన్లు ఉంటాయి. ముగ్గురు అక్కలు, తల్లి, ప్రియురాలు లాంటి ఐదురుగు మహిళల కథ. వారి జీవితాల మధ్య నా పాత్ర మధ్య చాలా ఎమోషనల్‌గా ఉంటుంది. అందర్ని ఈ సినిమా ఆకట్టుకొంటుందనే నమ్మకం నాకు ఉంది అని నాగార్జున అన్నారు.

    చాలా డైలాగ్స్‌లకు బీప్‌లు నిజమే

    చాలా డైలాగ్స్‌లకు బీప్‌లు నిజమే


    నా సినిమాలో వినిపించని డైలాగ్స్ ఉన్నాయి. సెన్సార్ బోర్డు అధికారులు చాలా చోట్ల బీపులు వేశారు. చాలా డైలాగ్స్ మ్యూట్ చేశారని అంటే వాటి ప్రాముఖ్యత ఏంటో.. ముందు సినిమా చూసి మాట్లాడండి.. ఆ సందర్భంలో నాకు తెలుగులో బూతులు రావు అంటూ హీరోయిన్ చెబుతుంది. ఈ సినిమాలో F తో మొదలయ్యే పదాలు ఉన్నాయి. సినిమా చూస్తే అసలు ఇలాంటి ప్రశ్నలే రావు. ఎందుకంటే అన్నమయ్య తర్వాత నేను స్వచ్ఛమైన తెలుగు మాట్లాడింది మన్మథుడు 2 చిత్రంలోనే. మన్మథుడు సినిమాకు యూ/ఏ సర్టిఫికెట్ లభించింది అని నాగార్జున చెప్పారు.

    English summary
    Nagarjuna Akkineni is busy with Manmathudu 2 movie promotion and Bigg Boss 3 season host. Manmathudu 2 movie is getting released on August 9th. In this occassion, Nag speaks to Telugu filmibeat exclusively.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X