జీవితంలో ఇదే చివరి పాట అని చెప్పారు.. దివంగత సిరివెన్నెలను తలుచుకొని నాని ఎమోషనల్

నేచురల్ స్టార్ నానికి గత రెండేళ్లు ఓ భిన్నమైన పరిస్థితిని ఎదుర్కొన్నారు. లాక్‌డౌన్ సమయంలో తాను నటించిన సినిమాలు వీ, టక్ జగదీష్ సినిమాలను తప్పని పరిస్థితుల్లో ఓటీటీలో రిలీజ్ చేశారు. గత రెండేళ్ల తర్వాత ప్రస్తుతం శ్యామ్ సింగరాయ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. సాయిపల్లవి, కృతిశెట్టి నటించిన ఈ సినిమా డిసెంబర్ 24న రీలీజ్‌కు సిద్దమైంది. ఈ నేపథ్యంలో నాని మీడియాతో మాట్లాడుతూ..

ఫస్ట్ డే ఫస్ట్ షో చూడాలన్నది..

ఫస్ట్ డే ఫస్ట్ షో చూడాలన్నది..

నేను గత ఇంటర్వ్యూలలో ఎప్పుడు చెప్పిన విధంగానే ఇప్పుడు కూడా అదే చెబుతున్నాను. థియేటర్‌లో సినిమా చూడాలన్నా.. సినిమాను రిలీజ్ చేయాలన్న అదో కిక్కు ఉంటుంది. నాకు సత్యం థియేటర్‌లో ఫస్ట్ డే ఫస్ట్ షో చూడటం ఎంత ఇష్టమో.. నా సినిమా రిలీజ్ రోజున థియేటర్‌లో వెనుక నించొని సినిమా చూడటం ఇంకా కిక్కు ఉంటుంది.

కానీ పరిస్థితుల కారణంగా నా రెండు సినిమాలు కూడా థియేటర్‌లో రిలీజ్ కాలేకపోయాయి. థియేటర్లు లేకపోవడం వల్ల V, టక్ జగదీష్ చిత్రాలను ఓటీటీ ద్వారా రిలీజ్ చేశాం. తాము సినిమా పూర్తి చేయడం వల్ల ప్రేక్షకుల వద్దకు తీసుకెళ్లాలనే ఓకే లక్ష్యంతో వాటిని ఓటీటీలో రిలీజ్ చేశాం అని నాని చెప్పారు.

పీరియాడిక్ సినిమాకు పక్కా కథ

పీరియాడిక్ సినిమాకు పక్కా కథ

శ్యామ్ సింగరాయ్ పీరియాడిక్ సినిమా. నాకు పీరియాడిక్ సినిమా చేయాలని ఎప్పటి నుంచో ఉంది. కానీ ఏది పడితే అది చేయలేం కదా.. అలాంటి పరిస్థితుల్లో సత్యదేవ్ జంగా అందించిన కథ కరెక్ట్ పీరియాడిక్ ఫిలిం అనిపించింది. బడ్జెట్, రిస్క్ ఎక్కువే అనిపించినప్పటికీ కథ మమల్ని ఈ సినిమా తీసేలా చేసింది. శ్యామ్ సింగరాయ్ లాంటి కథను పక్కా పీరియాడిక్ ఫిలిం క్రియేట్ చేసిన దర్శకుడు రాహుల్ సంక్రిత్యన్‌ను అభినందించాల్సిందే అని నాని అన్నారు.

నాయకుడు సినిమాకు సంబంధం లేదు

నాయకుడు సినిమాకు సంబంధం లేదు

నా గెటప్, లుక్ చూస్తే నాయకుడు సినిమాలో కమల్ హాసన్ గుర్తుకు రావడం సాధారణమే. కానీ నాయకుడు సినిమాకు, శ్యామ్ సింగరాయ్ సినిమాకు ఎలాంటి పోలికలు లేవు. శ్యామ్ సింగరాయ్ సినిమా ఒక డిఫరెంట్ ప్రపంచం. కమల్ హాసన్‌ను అభిమానించడం, ఫాలో అవ్వడం కారణంగా మీసం కట్టు, అప్పీయరెన్స్ అలా అనిపించడంలో తప్పేమీ లేదు. పిరియాడిక్ సినిమా ఫీల్ రావడానికి నా గెటప్ మాత్రమే కాకుండా జూనియర్ ఆర్టిస్టులకు కూడా గెటప్స్ కూడా పక్కాగా ప్లాన్ చేశారు అని నాని తెలిపారు.

 శ్యామ్ సింగరాయ్ ఓ ఎపిక్ లవ్ స్టోరి

శ్యామ్ సింగరాయ్ ఓ ఎపిక్ లవ్ స్టోరి

శ్యామ్ సింగరాయ్ సినిమా కథ చెడుపై పోరాటం సాగించిన ఓ యువ రచయిత గురించి. 1960లో జరిగే కాబట్టి స్వాతంత్ర్య పోరాటం గురించి కాదు. కానీ బెంగాల్‌లో ఓ కమ్యూనిస్ట్ రకరకాల అంశాలపై సాగించిన పోరాటం గురించిన కథ. లవ్ స్టోరి ఉంటుంది. దేవదాసిల గురించి కథ చెబుతాం. ఓవరాల్‌గా ఈ సినిమా ఎపిక్ లవ్ స్టోరి. మొత్తంగా ఇది ఫిక్షన్ క్యారెక్టర్. ఈ సినిమాపై బెంగాల్ ప్రజలు ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు అని నాని చెప్పారు.

అందుకే గట్టిగా ప్రమోషన్స్

అందుకే గట్టిగా ప్రమోషన్స్

శ్యామ్ సింగరాయ్ సినిమా నాలుగు భాషల్లో రిలీజ్ చేస్తున్నాం. గత మూడేళ్లలో ఎన్నడూ లేని విధంగా సినిమాల హడావిడి కనిపిస్తున్నది. కాబట్టి మిగితా సినిమాల పోటీని తట్టుకోవడానికి ప్రమోషన్స్ గట్టిగా చేయాలని నిర్ణయించుకోన్నాం. అందుకే నాలుగు భాషల్లో కూడా భారీగా ప్రమోషన్ కార్యక్రమాలు నిర్వహించాం. ప్రమోషన్స్ ఎలా ఉన్నా శ్యామ్ సింగరాయ్ ఎలా ఉంటుందో? ప్రేక్షకులకు ఎలాంటి ఫీలింగ్ కలిగిస్తుందో నాకు తెలుసు అని నాని చెప్పారు.

నా కెరీర్‌లో శ్యామ్ సింగరాయ్ బెస్ట్

నా కెరీర్‌లో శ్యామ్ సింగరాయ్ బెస్ట్

ఓ ఫ్యామిలీ సినిమా తీయాలని టక్ జగదీష్ తీశాం. విలన్ పాత్ర చేస్తే ఎలా రిసీవ్ చేస్తారో అనే విషయం గురించి తెలుసుకోవడానికి వీ సినిమా చేశాం. కానీ శ్యామ్ సింగరాయ్ విషయంలో అలాంటి ప్రయత్నం చేయలేదు. ఈ సినిమా బ్రిల్లియంట్ స్క్రిప్ట్. నా కెరీర్‌లో బెస్ట్ మూవీ అవుతుంది. నేను చేసిన రోల్స్‌లో ఇది బెస్ట్ అవుతుంది. నా కెరీర్ బెస్ట్ అనేది నేను చెప్పడం కంటే.. ప్రేక్షకులు, మీరు చెబితే బాగుంటుంది. నా కెరీర్‌లో బిగ్గెస్ట్ బడ్జెట్ మూవీ అని నాని చెప్పారు.

 సిరివెన్నెల నా చివరి పాట అని చెప్పారు

సిరివెన్నెల నా చివరి పాట అని చెప్పారు

శ్యామ్ సింగరాయ్ సినిమాకు సిరివెన్నెల సీతారామశాస్త్రి పాట రాయడం మా సినిమా యూనిట్‌కు అది పెద్ద ఎమోషనల్ పాయింట్. ఆయన రాసిన పాటను రాహుల్ పంపించి నాకు ఫోన్ చేసి.. నా జీవితంలో ఇదే సిరివెన్నెలపాట అని చెప్పారని నాకు తెలిపారు. ఇది అద్భుతమైన పాట. ప్రణవాలయ పాటలో కథ మొత్తం చెప్పారు. అలా కథ మొత్తం చెప్పిన లిరిక్ రైటర్ ఎవరు లేరు. సిరివెన్నెలకు సాటి రారు.

దేవీ నవరాత్రుల సమయంలో అమ్మవారి కోసం ఒకట పాటపాడుతుంటారు. కానీ శ్యామ్ మనసులో నుంచి వచ్చినట్టు పాడారు. ఆ పాటను వింటే డ్యూయెట్‌లా అనిపిస్తుంది.. మరో పక్క భక్తి గేయంగా కూడా అనిపిస్తుంది. అలా ప్రణవాలయ పాటను సిరివెన్నెల రాశారు. మా సినిమా ద్వారా ఆయనకు ఘనమైన నివాళి అర్పించాలని అనుకొన్నాం. మా ఇంటి నుంచి వెళ్తున్న ఆయనకు ఘనమైన స్వాగతం ఇవ్వాలని అనుకొన్నాం అని నాని ఎమోషనల్ అయ్యారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X