»   »  నిర్మాతనా.. వీడికి అవసరమా అన్నారు.. నేను యూస్‌లెస్ ఫెలోనే.. భయం పట్టుకొంది.. నాని

నిర్మాతనా.. వీడికి అవసరమా అన్నారు.. నేను యూస్‌లెస్ ఫెలోనే.. భయం పట్టుకొంది.. నాని

Posted By:
Subscribe to Filmibeat Telugu
నేను యూస్‌లెస్ ఫెలోనే కానీ చిరంజీవి సినిమా రీమేక్ చేస్తా !

తెలుగు సినిమా పరిశ్రమలో అసిస్టెంట్ డైరెక్టర్‌గా కెరీర్ ప్రారంభించి ఆ తర్వాత నటుడిగా మారారు హీరో నాని. ఆ తర్వాత వరుస సక్సెస్‌లతో దూసుకెళ్తున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో నాని నిర్మాతగా మారి అ! అనే చిత్రాన్ని రూపొందించారు. ఈ చిత్రంలో కాజల్, నిత్యామీనన్, రెజీనా తదితరులు నటించారు. వైవిధ్యమైన చిత్రంగా రూపొందిన చిత్రానికి దర్శకుడిగా ప్రశాంత్ వర్మ వ్యవహరించారు. ఈ చిత్రం ఫిబ్రవరి 16న రిలీజ్ అవుతున్న నేపథ్యంలో నాని మీడియాతో ముచ్చటించారు. నాని చెప్పిన విషయాలు ఆయన మాటల్లోనే..

ఎప్పటికప్పుడు పరీక్షే

ఎప్పటికప్పుడు పరీక్షే

సినిమా రిలీజ్ అంటే పరీక్ష లాంటి అనుభవమే. సినీ నిర్మాణం, రిలీజ్ అనేది ఎప్పటికప్పుడు టెన్షనే. అ! చిత్రం నిర్మాతగానైనా, యాక్టర్‌గానైనా సినిమా రిలీజ్ అంటే టెన్షన్. నా అష్టాచెమ్మా నుంచి ఇప్పటివరకు అ! కాళ్ల కింద చెమటపట్టింది. దాన్ని బట్టి యాక్టర్‌గానైనా, నిర్మాతనైనా సినిమా రిలీజ్ అగ్ని పరీక్ష అని తేలింది.

 నాకు భయంపట్టుకొన్నది..

నాకు భయంపట్టుకొన్నది..

డబ్బు ముడిపడి ఉన్నందున ప్రతీ సినిమాకు నేను బాధ్యతగా ఫీలవుతాను. కాకపోతే నిర్మాతగా నాకు మరో భయం పట్టుకొన్నది. చేతిలో సినిమాలు చక్కగా ఉన్నాయి. నటించిన సినిమాలు ఆడుతున్నాయి. ఇలాంటి సమయంలో వీడికి సినీ నిర్మాణం అవసరమా అని చాలా మంది అన్నారు.

విభిన్నమైన సినిమాను..

విభిన్నమైన సినిమాను..

యాక్టర్‌గా కెరీర్ గ్రాఫ్ దూసుకెళ్తున్న నేపథ్యంలో సినీ నిర్మాణం రిస్క్ అని గానీ, అవసరమా అనిపించలేదు. ఇండస్ట్రీకి వైవిధ్యమైన చిత్రాలు అవసరం అనిపించింది. టాలీవుడ్‌లో కొత్తదనం లేదని మనమే విమర్శలు చేస్తున్నాం. అలాంటప్పుడు మనమే ఓ విభిన్నమైన సినిమాను అందించాలనే ప్రయత్నం జరిగింది. ఓ పక్క యాక్టింగ్, మరో పక్క సినీ నిర్మాణం చాలా కష్టమైంది. రెండింటిని బ్యాలెన్స్ చేయడం సమస్యగా మారింది. అంతా వాట్సప్‌లో నాలుగు గ్రూప్‌ క్రియేట్ చేసి నిర్మాణ బాధ్యతలను, సమస్యలను పర్యవేక్షించాను.

 కంటి నిండా నిద్రలేదు..

కంటి నిండా నిద్రలేదు..

అ! సినిమా ప్రారంభమైనప్పటి నుంచి కంటి నిండా నిద్ర పోయిన క్షణాలు లేవు. గోవాలో కృష్ణార్జున యుద్దం షూటింగ్ జరుగుతున్నప్పుడు టైమ్ దొరికితే ప్రొడక్షన్ పనుల్లో తలదూర్చే వాడిని. అ! సినిమా రిలీజ్ విషయంలో ఎలాంటి సమస్యలు ఎదురుకాలేదు.

 అ! సినిమాను మెచ్చుకొంటారు..

అ! సినిమాను మెచ్చుకొంటారు..

కమర్షియల్ ఆలోచనలు లేకుండా ఓ మంచి సినిమా చేశాను. విజిల్స్ వేసే కమర్షియల్ ఎలిమెంట్స్ లేని సినిమా ఇది. తెలుగు సినిమా పరిశ్రమకు ఓ కొత్తదనం అందించే సినిమా ఇది. అ! సినిమా గొప్ప సినిమా. ఖచ్చితంగా ప్రతీ ఒక్కరు కూడా ప్రశంసించే సినిమా ఇది. రిలీజ్ రోజు మెచ్చుకొంటారా? మరో సంవత్సరం తర్వాత మెచ్చుకొంటారా అనే మీరే గ్రహిస్తారు. అ! చిత్రం ఏ సినిమా నుంచి స్ఫూర్తి పొందిన చిత్రం కాదు. వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందిన చిత్రం. ఈ చిత్రంలోని సన్నివేశాలు ఇప్పటి వరకు తెలుగు సినిమాలో చూసి ఉండరని బలంగా చెప్పుతున్నాను.

 అ! సినిమా చాలా రిస్క్‌తో

అ! సినిమా చాలా రిస్క్‌తో

అ! చిత్రం చాలా రిస్క్‌తో కూడుకొన్న సినిమా. రిస్క్ ఉందని మరోకరికి అమ్మేసి చేతులు దులిపేసుకొను. ఖచ్చితంగా అ! సినిమా చాలా రిస్క్‌తో కూడుకొన్న సినిమా. అంతమాత్రనా దానిని వేరే వాళ్లపై తోసేయ్యను. నేను ఇష్టపడి ఈ సినిమా చేశాను. అందకనుణంగా నేను ఈ సినిమా సొంతంగా రిలీజ్ చేస్తున్నాను.

ప్రశాంత్ వర్మ కథ

ప్రశాంత్ వర్మ కథ

ప్రశాంత్‌ వర్మ సినిమా కథ విన్న తర్వాత పది నిమిషాలు నిర్ఘాంతపోయాను. అతను చెప్పిన విధంగానే దర్శకుడు తెర మీద చూపించారు. ముందుగా నా వాయిస్ ఓవర్ కోసం వచ్చి కథ చెప్పాడు. కథ విన్నప్పుడు ఓ మంచి ప్రొడ్యూసర్‌ను చూడాలనుకొన్నాను. కానీ ఆ తర్వాత ఈ సినిమాను నేనే చేస్తే బాగుంటుందని, కథను నమ్మి సినిమా తీశాను.

వారి డిమాండ్ మేరకే

వారి డిమాండ్ మేరకే

నాతో ఉన్న అనుబంధం, రిలేషన్ కాకుండా కాజల్ అగర్వాల్, నిత్య మీనన్, రెజీనా కసండ్రా కథను నమ్మి అ! సినిమాను చేశారు. వారి డిమాండ్ మేరకు రెమ్యునరేషన్ ఇచ్చాం. నాకు ఇందులో తగ్గింపులు లేవు. నాకోసం వారు తగ్గించలేదు. నేను నిర్మాతగా వ్యవహరించారు. వారు యాక్టర్లుగానే వ్యవహరించారు.

నా సినిమాలు నేను తీసుకోను..

నా సినిమాలు నేను తీసుకోను..

నేను స్టార్ అయ్యానని, నా సినిమాలు నేను తీసుకోను. అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా ఉన్న సమయంలో నన్ను హీరోగా పెట్టి.. ఇప్పుడు ఓ హోదా ఉండటానికి చాలా మంది దర్శకులు, నిర్మాతలు కారణం. అష్టాచెమ్మా నుంచి ఇప్పటి వరకు సినిమాల విజయంతోపాటు ప్రేక్షకులకు దగ్గరవుతున్నాను. ఇప్పుడేదో నేను స్టార్ హీరోనని నా సినిమాలు నేను తీసుకొను.

 అలా అనుకొంటే తప్పే..

అలా అనుకొంటే తప్పే..

నాకు ఏ స్టాటస్ లేన్నప్పుడు నన్ను పెట్టి సినిమాలు తీసిన నిర్మాతలు, దర్శకులు ఉన్నారు. నా జర్నీలో ఎంతో మంది నాకు తోడ్పాటునందించారు. ఇప్పుడు మీరు నాకు వద్దు అనుకోవడం తప్పు. నాకోసం, నాతో సినిమాలు చేసేవారికి నేను ఎప్పుడూ అందుబాటులో ఉంటాను అని నాని అన్నారు.

 యూస్‌లెస్ ఫెలో అనుకొనే వారు..

యూస్‌లెస్ ఫెలో అనుకొనే వారు..

నా కుటుంబంలో చాలా మంది మంచి జాబ్స్‌లో సెటిల్ అయిపోయారు. చాలా మంది నా కజిన్స్ అమెరికాలో మంచి హోదాల్లో స్థిరపడ్డారు. అలాంటి సమయంలో నేను సినిమాలపై వ్యామోహం పెంచుకొన్నాను. అప్పట్లో నాని ఇంకా సినిమాలంటూ తిరుగుతున్నాడా అని అందరు అంటుండేవారు. నన్ను ఓ యూస్‌లెస్ ఫెలోగా చూసేవారు. అలాంటి యూస్‌లెస్ ఫెలోకు సినిమా మంచి జీవితాన్ని ఇచ్చింది. అలాంటి సినిమా పరిశ్రమకు నేను సంపాదించిన ప్రతీపైసే ఇక్కడే పెడుతాను.

English summary
Hero Nani become a producer for Awe! movie. Kajal Agarwal, Nitya Menon, Regina Cassandra are in the lead roles. This movie is set to release on August 16th. In this occassion, Nani spoke to Telugu Filmibeat exclusively.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu