For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  గత్యంతరం లేకనే V రిలీజ్‌.. ఆ గౌరవం దక్కడం అదృష్టం.. నాని ఎమోషనల్

  |

  లాక్‌డౌన్ పరిస్థితుల్లో సినిమా పరిశ్రమ కార్యకలాపాలు స్తంభించిన నేపథ్యం తర్వాత ప్రేక్షకుల ముందుకు వస్తున్న భారీ తెలుగు చిత్రం V మూవీ. నేచురల్ స్టార్ నాని, యువ హీరో సుధీర్ బాబు, అద్భుతమైన నటనాప్రతిభ కలిగిన అదితిరావు హైదరీ, నివేదా థామస్ నటించిన ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఫస్ట్ లుక్, టీజర్, ట్రైలర్ లాంటి అంశాలు ప్రేక్షకుల్లో అంచనాలు పెరిగాయి. అయితే థియేటర్లో రిలీజ్ చేయాల్సిన సినిమా ప్రస్తుత పరిస్థితుల్లో ఓటీటీ ద్వారా అమెజాన్ ప్రైమ్ వీడియోలో సెప్టెంబర్ 5వ తేదీన రిలీజ్ కానున్నది. ఈ క్రమంలో నాని తెలుగు ఫిల్మీబీట్‌తో మాట్లాడుతూ..

  ఓటీటీ రిలీజ్ ఎందుకంటే

  ఓటీటీ రిలీజ్ ఎందుకంటే

  గతంలో కంటే భిన్నమైన పరిస్థితులు ఉండటం మూలంగా థియేటర్‌లో కాకుండా, ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్నాం. ఇప్పుడున్న పరిస్థితుల్లో మరో మార్గం, గత్యంతరం లేదు. అందరూ తెలుగు సినిమాను చూడాలని కోరుకొంటున్నారు. కొత్త కంటెంట్ చూడాలని ప్రేక్షకులు ఆశిస్తున్నారు. ఆ క్రమంలో ఇలాంటి సినిమా రెడీగా ఉండటం మంచిదే జరిగింది. V మూవీ ద్వారా ఇలా ఎక్కువ మందికి చేరువ కావడం ఆనందంగా ఉంది. ట్రైలర్ రిలీజ్ తర్వాత మంచి రెస్సాన్ రావడం మరీ సంతోషంగా ఉంది అని నాని అన్నారు.

  ఇదో రకమైన కొత్త అనుభూతి

  ఇదో రకమైన కొత్త అనుభూతి

  తెలుగు ప్రేక్షకుల్లో ఎక్కువ మంది సినిమాను థియేటర్లో చూడాలనే కోరుకొంటారు. అలాంటి ప్రేక్షకులు ఉండటం అదృష్టమే. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో మనకు ఉన్న ఒకటే ఆఫ్షన్ ఓటీటీ. ఇదోక కొత్త అనుభూతి. నాలుగేళ్ల తర్వాత దీని గురించి మనం గొప్పగా మాట్లాడుకోవడానికి కూడా అవకాశం కలుగువచ్చు అని నాని అభిప్రాయపడ్డారు.

  ఇంద్రగంటితో యాదృశ్చికంగానే..

  ఇంద్రగంటితో యాదృశ్చికంగానే..


  నా తొలి సినిమా ఇంద్రగంటి మోహన కృష్ణ దర్శకత్వంలో రావడం, అలాగే నా కెరీర్‌లో మైలురాయిగా మారిన V మూవీ సినిమా కూడా ఆయన డైరెక్షన్‌లో రావడం యాదృశ్చికం. నాకు 25వ సినిమా అనే ఫీలింగ్ లేదు. మన ఇండస్ట్రీలో అందరూ దీనిని ప్రత్యేకంగా సెలబ్రేట్ చేసుకొంటున్నారు కాబట్టి నేను కూడా చేసుకొంటున్నాను అని నాని చెప్పారు.

  అలాంటి గౌరవం నాకు దక్కడం

  అలాంటి గౌరవం నాకు దక్కడం


  తెలుగు సినిమా పరిశ్రమలో 25 సినిమాల ప్రయాణంలో ఎన్నో మధురమైన విషయాలు నా హృదయంలో ఉన్నాయి. నా తొలి సినిమా సమయంలో నా కెరీర్ ఇలా ఉంటుందని చెబితే అది నమ్మేవాడిని కాదు. ప్రేక్షకుల గుండెల్లో ఇలాంటి చోటు దక్కడం నిజంగా అదృష్టం. అందరూ కష్టపడుతారు.. కానీ ప్రేక్షకులు మా వాడు అనే విధంగా ఫీల్ కావడం కొందరికే దక్కుతుంది. అలాంటి గౌరవం దక్కడం నాకు నిజంగా సంతోషంగా ఉంది అని నాని ఎమోషనల్ అయ్యారు.

  Penguin Trailer | Penguin OTT Worldwide Release on June 19
  మా మధ్య అనుబంధం అప్పటిలానే..

  మా మధ్య అనుబంధం అప్పటిలానే..

  ఇంద్రగంటి మోహన కృష్ణతో అష్టాచెమ్మా, జెంటిల్మెన్, V మూవీ సినిమాలు చేయడం హ్యప్పీ. మా ఇద్దరి మధ్య ఎలాంటి మార్పులు లేవు. అష్టా చమ్మా సమయంలో ఎలా ఉన్నామో.. ఇప్పుడు అలానే ఉన్నాం. షూటింగ్‌ గ్యాప్‌లో మా మధ్య ఉండే అనుబంధం అలానే ఉంది. అష్టాచమ్మా రిలీజ్ రోజునే V సినిమాను రిలీజ్ చేయడంలో మా ప్రమేయం ఏమీ లేదు. ఆ రోజుకు ప్రత్యేకత ఉండటం మూలంగా.. అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్లు ఆ నిర్ణయం తీసుకొని ఉండవచ్చు అని నాని పేర్కొన్నారు.

  English summary
  Natural Star Nani's 25th movie is V. This movie is Directed by Indraganti Mohana Krishana, Produced by Dil Raju. This movie set to release on September 5th on Amazon prime video. On this occasion, Nani Speaks to Telugu filmibeat and other media
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X