twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Love Story మూవీని అందుకే అక్కడ రిలీజ్ చేయడం లేదు.. నిర్మాతలు నారాయణ దాస్, రామ్మోహన్ క్లారిటీ

    |

    ఏషియన్ సంస్థను చాలా ఏళ్ల క్రితమే నారాయణ దాసు గారు ప్రారంభించారు. సినిమా ఫైనాన్స్ బిజినెస్‌తోపాటు ఎగ్జిబిటర్, డిస్టిబ్యూటర్, మల్టీ‌ప్లెక్స్‌ వ్యాపారంలో ఉన్నారు. నేను కూడా 1987లో ఎగ్జిబిటర్‌గా కెరీర్ ఆరంభించాను. నిర్మాతగా పలు సినిమాలు నిర్మించాం. ప్రస్తుతం శ్రీ వెంకటేశ్వర ఫిలింస్ ఎల్ఎల్‌పీ బ్యానర్‌ను ఏర్పాటు చేసి తొలి సినిమాగా లవ్ స్టోరి రూపొందించాం. కరోనావైరస్ కారణంగా సినిమా పలు మార్లు వాయిదా పడింది. గత ఏప్రిల్‌లోనే రిలీజ్ చేయాలని నిర్ణయించాం. కానీ పవన్ కల్యాణ్ సినిమా కారణంగా రిలీజ్ ఆపేశాం. మళ్లీ సెప్టెంబర్ 10వ తేదీన రిలీజ్ చేయాలని అనుకొన్నాం. కానీ ఏపీలో టికెట్ల రేట్ల వ్యవహారం వల్ల సినిమా విడుదల ఆగిపోయింది. ఇప్పుడు ఆ వివాదంతో సంబంధం లేకుండా సెప్టెంబర్ 24వ తేదీన లవ్ స్టోరి సినిమాను రిలీజ్ చేస్తున్నాం. ఏపీలో థియేటర్ ల టికెట్ ధరలు, బుకింగ్ విధానం, ఇతర విషయాలపై ప్రభుత్వంతో సంప్రదించేందుకు సిద్ధంగా ఉన్నాం. త్వరలో ఏపీ సినిమాటోగ్రఫీ మినిస్టర్ ని కలవబోతున్నాం అని నారాయణ దాస్ నారంగ్, పుస్కూరు రామ్మోహన్ రావు తెలిపారు.

    లవ్ స్టోరి సినిమా విషయానికి వస్తే.. పాటలకు విశేష స్పందన లభించింది. 300 మిలియన్లకుపైగా వ్యూస్ సాధించింది. లవ్ స్టోరి పాటలు ఓ మైలరాయిని అందుకొన్నాయి. శేఖర్ కమ్ముల సినిమాల మాదిరిగానే ఫీల్ గుడ్ ఉంటుంది. కాకపోతే కథలో కొత్తదనం ఉంటుంది. స్టోరి లైన్ కూడా మార్చారు. కరోనా కారణంగా మేము అనుకొన్న డేట్ల కంటే ఎక్కువ రోజులు షూట్ చేశాం. నాగచైతన్య, శేఖర్ కమ్ముల కెరీర్‌లో మంచి విజయాన్ని అందుకోవడం ఖాయం అని నారాయణ దాస్ నారంగ్, పుస్కూరు రామ్మోహన్ రావు ఆశాభావం వ్యక్తం చేశారు.

     Narayanadas K Narang and Puskur Rammohan Rao about Love Story movie

    ఫిదా ఎడిటింగ్ జరుగుతున్న సమయంలో శేఖర్ కమ్ములను కలిశాం. మేము సినిమా తీయడానికి సిద్ధంగా ఉన్నామని చెబితే ఆయన సానుకూలంగా స్పందించారు. ఫిదా తర్వాత మాతోనే సినిమా చేయాలని నిర్ణయించుకోవడం ఆయన మంచి తనానికి నిదర్శనం. లవ్ స్టోరి తర్వాత మరో రెండు సినిమాలు చేయడానికి అంగీకరించారు. ఆంధ్రాలో 10 గంటల వరకు పరిమితులు ఉన్నాయి. కానీ వాటిని సరిచేసుకొని నాలుగు షోలు ముగించేందుకు ప్లాన్ చేస్తున్నాం అని నారాయణ దాస్ నారంగ్, పుస్కూరు రామ్మోహన్ రావు తెలిపారు.

    నైజాం, ఏపీలో కలిపి 500కిపైగా థియేటర్లలో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేశాం. ఇప్పుడు థియేటర్లు ఖాళీ ఉన్నాయి. ప్రేక్షకుల స్పందన బట్టి సినిమా స్క్రీన్లను పెంచుతాం. ఇటీవల మేము రిలీజ్ చేసిన ఎస్ఆర్ కల్యాణమండపం, పాగల్, సీటీమార్ చిత్రాలను రిలీజ్ చేస్తే మంచి ఓపెనింగ్స వచ్చాయి అని పుస్కూరు రామ్మోహన్ రావు అన్నారు.

     Narayanadas K Narang and Puskur Rammohan Rao about Love Story movie

    మేము ఎన్నోఏళ్లుగా డిస్ట్రిబ్యూషన్, ఎగ్జిబిషన్ సెక్టార్ లో ఉన్నా ఎప్పుడూ నిర్మాణం గురించి ఆలోచించలేదు. మాకు ఉన్న అనుభవంతో మిగతా సెక్టార్స్ లో రాణించినా, నిర్మాణం అనేది కొత్త విషయం. ఇక్కడ డబ్బుతో పాటు అనేక విషయాలు ఆధారపడి ఉంటాయి. టీమ్ వర్క్ లా పనిచేయాలి. క్రియేటివిటీ చూపించాలి. అలా ప్రొడక్షన్ గురించి కూడా అవగాహన వచ్చాక నిర్మాణ రంగంలో అడుగుపెట్టాం అని నిర్మాత నారాయణదాస్ నారంగ్ చెప్పారు

    తెలుగు సినిమాల్లో లవ్ స్టోరిలు ఉంటాయి. కానీ శేఖర్ కమ్ముల చిత్రంలో ఎమోషనల్, సెన్సిబుల్ పాయింట్స్ ఉన్నాయి. ఇప్పటి వరకు వచ్చిన ప్రేమకథలకు భిన్నంగా ఉంటుంది అని చెప్పారు. కేరళ, తమిళనాడులో రిలీజ్ చేయడం లేదు. విదేశాల్లో ఆస్ట్రేలియాతోపాటు కొన్ని దేశాల్లో థియేటర్లు ఓపెన్ కాలేదు. కాబట్టి ఆయా దేశాల్లో రిలీజ్ చేయడం లేదు అని నిర్మాత నారాయణదాస్ నారంగ్ తెలిపారు.

    లవ్ స్టోరిలకు సంబంధించిన చిత్రాల్లో ప్రేమనగర్, ప్రేమాభిషేకం చిత్రాలంటే ఇష్టం. శివాజీగణేషన్, రాజేశ్ ఖన్నా చిత్రాలు అంటే నాకిష్టం అని నారాయణదాస్ నారంగ్ అన్నారు. ఓటీటీ కానీ ఎలాంటి మీడియా వచ్చినా థియేటర్లకు ఎలాంటి ఢోకా లేదు అని అన్నారు.

    English summary
    Love Story movie Release: Narayanadas K Narang and Puskur Rammohan Rao about Love Story movie
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X