twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పుట్టుమచ్చల వివాదం : అందరం మనుషులమే, ఇక నేను మాట్లాడాలనుకోవడం లేదన్న నేహాశెట్టి

    |

    సిద్దు జొన్నలగడ్డ హీరోగా నేహా శెట్టి హీరోయిన్ గా రూపొందిన సినిమా 'డిజె టిల్లు'. ఈనెల 12న థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతున్న ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ 'సితార ఎంటర్టైన్మెంట్స్', ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంస్థతో కలిసి ఈ నిర్మించింది. విమల్ కృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు సూర్యదేవర నాగవంశీ నిర్మాతగా వ్యవహరించారు. తాజాగా నిర్వహించిన మీడియా సమావేశంలో 'డిజె టిల్లు' సినిమా విశేషాలు, ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో జరిగిన పుట్టుమచ్చల వివాదం మీద స్పందించింది నేహా శెట్టి. ఆ వివరాలు

    ఆసక్తిగా ఎదురుచూస్తున్నా

    ఆసక్తిగా ఎదురుచూస్తున్నా

    నాకు చిన్నప్పటి నుంచే నటి కావాలని కోరిక ఉండేది. హృతిక్ రోషన్ సినిమాలో డాన్సులు చూసి సినిమా ఇష్టాన్ని పెంచుకున్నా, చదువు పూర్తయ్యాక మోడలింగ్ చేశా, మలయాళంలో ముంగారమళై 2 సినిమా చేశాక, తెలుగులో పూరీ జగన్నాథ్ మెహబూబా సినిమాలో నటించి తర్వాత కొన్నాళ్లు యూఎస్ వెళ్లి అక్కడ న్యూయార్క్ ఫిల్మ్ అకాడెమీలో నటనలో కోర్సు నేర్చుకున్నాను. అక్కడి నుంచి వచ్చాక గల్లీ రౌడీ, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ చిత్రాల్లో నటించాను. ఇప్పుడు "డిజె టిల్లు" సినిమా విడుదల కోసం చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను అని ఆమె వెల్లడించారు.

    ఒక ప్యాకేజీ

    ఒక ప్యాకేజీ


    ఈ సినిమా ఒప్పుకోవడానికి సితార ఎంటర్ టైన్ మెంట్స్ ప్రముఖ సంస్థ అనే కాదు, మంచి స్క్రిప్ట్ ఉంది. సిద్ధూ, విమల్ క్రియేటివ్ గా సినిమాను, ఫన్ గా డిజైన్ చేశారు. మీరు ట్రైలర్ లో డైలాగ్స్ వినే ఉంటారు. ఇవన్నీ కలిసిన ఒక మంచి ప్రాజెక్ట్ లో భాగం కావడం అదృష్టంగా భావిస్తున్నానాని అన్నారు. డిజె టిల్లు ట్రైలర్ చూసి రొమాంటిక్ ఫిల్మ్ అనుకుంటారు కానీ ఈ సినిమా అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ కలిపిన ఒక ప్యాకేజీ లాంటిది. ఇందులో కామెడీ, థ్రిల్, ఎంటర్ టైన్ మెంట్, రొమాన్స్ అన్నీ ఉన్నాయని పేర్కొన్నారు.

    నాకు ఇష్టం లేదు

    నాకు ఇష్టం లేదు

    ట్రైలర్ లాంచ్ లో జరిగిన సంఘటన చాలా దురదృష్టకరం. ఇలాంటి వాటి నుండి ముందుకు సాగాలనుకుంటున్నాను, నాలాంటి హీరోయిన్లకు రోజూ ఇలాంటి ప్రశ్నలు ఎదురవుతూనే ఉంటాయి. మనమందరం మనుషులం మరియు అలాంటి పరిస్థితులను ఎదుర్కొంటాము. కానీ మనం ముందుకు సాగాలి. నేను ఆ సంఘటనను వదిలివేయాలనుకుంటున్నాను మరియు దాని గురించి వ్యాఖ్యానించడానికి ఇష్టపడనని పేర్కొన్నారు.

    రాధిక ఆప్టే అని

    రాధిక ఆప్టే అని

    డిజె టిల్లు సినిమాలో రాధిక పాత్రలో నటించాను, ట్రైలర్ రిలీజ్ అయ్యాక అంతా రాధిక ఆప్టే అని పిలుస్తున్నారు. రాధిక ఈతరం అమ్మాయి, నిజాయితీగా, ఆత్మవిశ్వాసంతో ఉంటుంది, తను కరెక్ట్ అనుకున్న పని చేసేస్తుంది. ఎ‌వరేం అనుకుంటారు అనేదాని గురించి ఆలోచించదు. తను తీసుకునే నిర్ణయాల గురించి పూర్తి స్పష్టతతో ఉంటుంది. రాధిక క్యారెక్టర్ ను నేను త్వరగా అర్థం చేసుకోగలిగాను. ఆ పాత్రలా మారిపోయాను. తప్పును తప్పుగా ఒప్పును ఒప్పుగా చెబుతుంది. నేను రాధిక క్యారెక్టర్ తో చాలా రిలేట్ చేసుకోగలను. అలాంటి పాత్రను నేను సినిమాల్లో ఇప్పటిదాకా చూడలేదు. ఆత్మవిశ్వాసం మెండుగా ఉన్న పాత్ర అది అని ఆమె పేర్కొన్నారు.

    అనిపించినట్లు నటించా

    అనిపించినట్లు నటించా

    రాధిక పాత్రలో నటించేప్పుడు దర్శకుడు విమల్ పూర్తి స్వేచ్ఛనిచ్చారు. నా నుంచి సహజంగా ఆ పాత్ర స్వభావం ఎలా ఉంటుందో చూపించాలనుకున్నారు కానీ నేను అయితే అలా చేస్తే ఎలా వస్తుందో అని భయపడ్డాను. కానీ అందరికీ రాధిక క్యారెక్టర్ లో నేను నటించిన విధానం నచ్చిందని, సన్నివేశాలన్నీ సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ తో ఉంటాయని రాధిక పాత్ర చేసేందుకు ఎలాంటి రిఫరెన్స్ తీసుకోలేదని, సహజంగా నాకు అనిపించినట్లు నటించానని నేహా పేర్కొన్నారు.

    English summary
    Neha Shetty responds on DJ Tillu trailer launch incident
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X