Don't Miss!
- Finance
Stock Market: ఒడిదొడుకుల్లో స్టాక్ మార్కెట్లు.. ఇక ఒక్కరోజే టైమ్.. జాగ్రత్త ట్రేడర్స్
- News
రాహుల్ పాదయాత్ర భారీ సక్సెస్- 191కి పెరిగిన కాంగ్రెస్ స్కోరు-పార్ట్ 2కు సన్నాహాలు ?
- Sports
INDvsNZ : ఇదేం ఆట? అంటూ.. హార్దిక్ పాండ్యాపై మండిపడుతున్న ఫ్యాన్స్..
- Lifestyle
హాట్ అరోమా ఆయిల్ మేనిక్యూర్ గురించి మీకు తెలుసా? రఫ్ హ్యాండ్స్ ని చేతిని మృదువుగా చేస్తుంది!
- Automobiles
మార్కెట్లో విడుదలకానున్న కొత్త మారుతి కార్లు.. మరిన్ని వివరాలు
- Technology
20 లక్షల మంది Active వినియోగదారులను కోల్పోయిన Jio ! కారణం తెలుసుకోండి!
- Travel
పచ్చని గిరులు మధ్య దాగిన పుణ్యగిరి జలపాతం!
Nithya Menen స్కైలాబ్ విషయంలో రాజీ పడలేదు.. డబ్బు సంపాదనకు నిర్మాతగా మారలేదు.. నిత్య మీనన్
అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా ప్రయోగించిన తొలి అమెరికా స్పేస్ స్టేషన్ స్కైలాబ్. 1973 నుంచి 1974 మధ్య దాదాపు 24 వారాలపాటు విశ్వంలో పనిచేసింది. అయితే స్కైలాబ్ ప్రయోగం విఫలం కావడంతో 1979 జూలై 11వ తేదీన హిందూ మహాసముద్రం, పశ్చిమ ఆస్ట్రేలియాలో కుప్పకూలింది. అయితే స్కైలాబ్ భూమివైపు దూసుకొస్తుందనే వార్తలతో దేశవ్యాప్తంగా ప్రజలు ఆందోళనకు గురయ్యారు. సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలు భావోద్వేగానికి లోనయ్యారు. అలాంటి కథతో దర్శకుడు విశ్వక్ చేసిన ప్రయోగం స్కైలాబ్. ఈ సినిమా కథ విని ప్రముఖ హీరోయిన్ నిత్య మీనన్ నటించడమే కాకుండా నిర్మాతగా మారారు. నిర్మాతగా, నటిగా తన అనుభూతులను నిత్య మీనన్ పంచుకొంటూ..

స్కైలాబ్ కథ, ట్రీట్‌మెంట్ నచ్చడంతో
స్కైలాబ్ లాంటి సినిమా స్క్రిప్టు విన్న తర్వాత ఎవరు కూడా ఎక్సైట్ కాకుండా ఉండరు. సినిమా కథకు సంబంధించిన ట్రీట్‌మెంట్ చాలా కొత్తది. అదే నన్ను బాగా ఆకట్టుకొన్నది. తెలంగాణ బ్యాక్ డ్రాప్‌తోపాటు వెస్ట్రన్ క్లాసికల్ మ్యూజిక్‌తో సాగుతుందని చెప్పిన తర్వాత సినిమాపై మరింత ఆసక్తి పెరిగింది. ఇలాంటి ట్రీట్‌మెంట్ నాకు బాగా నచ్చుతుంది. ఇంటర్వెల్ వరకు కథ చెప్పిన తర్వాత నేను సినిమా చేస్తున్నానని నిర్మాత, దర్శకులకు చెప్పాను. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో మంచి సినిమా తీయడం చాలా కష్టం. అలాంటి మంచి సినిమా స్కైలాబ్ ద్వారా రాబోతున్నది అని నిత్యా మీనన్ అన్నారు.

కరీంనగర్ జిల్లాలోని బండలింగంపల్లి గ్రామంలో
స్కైలాబ్ భూమి మీద పడిన విషయం నాకు తెలియదు. కథ విన్న తర్వాతే నాకు ఇలాంటి సంఘటన తెలిసింది. స్కైలాబ్ కథ విన్న తర్వాత నా పేరెంట్స్‌ను అడిగితే.. నాకు చాలా విషయాలు చెప్పారు. దాంతో ఇప్పటి వరకు నాకు ఎందుకు చెప్పలేదని నా తల్లిదండ్రులను అడిగాను. ఆ తర్వాత చాలా మంది స్కైలాబ్ ఘటన గురించి కథలు కథలుగా చెప్పారు. కరీంనగర్‌లో బండలింగంపల్లి గ్రామంలో జరుగుతుంది. కాకపోతే విలేజ్ లుక్ కాకుండా ఓ డిఫరెంట్ లుక్‌తో కనిపిస్తుంది. అందుకు ప్రొడక్షన్ డిజైన్, సినిమాటోగ్రఫి బలంగా మారాయి అని నిత్యా మీనన్ తెలిపారు.

ఒక్క సీన్‌లో కూడా కంప్రమైజ్ కాలేదు
స్కైలాబ్ షూటింగు సమయంలో నేను నిర్మాతగా పెద్దగా టెన్షన్ పడలేదు. అనురాగ్ మొత్తం డీల్ చేశాడు. సినిమా షూటింగ్ తర్వాత నిర్మాతగా నాకు చాలా సమస్యలు నా ముందుకు వచ్చాయి. ఈ సినిమాకు సంబంధించి నేను కానీ, నిర్మాత పృథ్వీ ఏ ఒక్క సీన్ విషయంలో కాంప్రమైజ్ కాలేదు. ఈ సినిమాను సింక్ సౌండ్ పద్దతిలో షూట్ చేశాం. ఈ సినిమాకు డబ్బింగ్ అసలే చెప్పలేదు. డబ్బింగ్ అవసరం ఉంటే చేద్దామని అనుకొన్నాం. కానీ డబ్బింగ్ అవసరం పడలేదు. తెలంగాణ భాష చాలా స్వీట్‌గా ఉంది. ఆ భాషను మాట్లాడేందుకు ఇంకా ప్రయత్నిస్తున్నాం అని నిత్యా మీనన్ చెప్పారు.

స్కైలాబ్ విషయంలో ఛాలెంజ్‌లు ఎదురు కాలేదు
స్కైలాబ్ సినిమా విషయంలో కష్టాలు, ఛాలెంజ్‌లు ఎదురు కాలేదు. జర్నలిస్టు పాత్రను చాలా ఎంజాయ్ చేస్తూ నటించాను. ఎలాంటి పాత్రలోకి వెళ్లడానికి నాకు సమయం ఎక్కువ పట్టదు. నేను స్పాంటేనియష్ యాక్టర్‌ని. షూట్‌లోకి వెళ్లగానే ఫస్ట్ సీన్ నుంచే నేను ఆ పాత్రలో లీనమైపోతాను. ముఖ్యంగా మంచి కథ విన్న తర్వాత నేను నటించాలనే కోరిక పుట్టింది. కథ నన్ను చాలా తట్డడంతో ఈ సినిమాను నిర్మించాలనే కోరిక పుట్టింది. అంతేగానీ డబ్బులు సంపాదించడానికి నిర్మాతగా మారలేదు. నిర్మాతగా మారడానికి ముందు రమేష్ ప్రసాద్, సీవీ రెడ్డిని కలిసి దీవెనలు తీసుకొన్నాను. వారు కొన్ని సూచనలు ఇచ్చారు. వాటిని పాటిస్తూ సినిమా నిర్మాణంలో భాగమయ్యాను. నిర్మాత కంటే నటిగానే ఎక్కువ మార్కులు వేసుకొంటాను అని నిత్యా మీనన్ పేర్కొన్నారు.

ఓటీటీ సంస్థల నుంచి భారీ ఆఫర్లు
స్కైలాబ్ సినిమాకు ఓటీటీ సంస్థల నుంచి మంచి ఆఫర్లు వచ్చాయి. కానీ పృథ్వీ మాత్రం ఈ సినిమా థియేటర్‌లోనే రిలీజ్ చేయాలనే పట్టుదలతో ఉన్నారు. థియేటర్‌లో స్కైలాబ్ మంచి ఎక్స్‌పీరియెన్స్‌ను ఇస్తుందనే బలమైన నమ్మకంతో ఉన్నాం. డబ్బులు పోయినా పర్వాలేదు కానీ ప్రేక్షకుడికి థియేటర్లలోనే ఈ సినిమా అనుభూతిని అందించాలని అనుకొన్నాం. ఈ సినిమాకు థియేటర్లు కూడా భారీగానే లభించాయి అని నిత్యా మీనన్ చెప్పారు.

రెండు నెలల్లో మూడు సినిమాలతో
డిసెంబర్ నుంచి జనవరి వరకు నేను నటించిన మూడు సినిమాలు రిలీజ్ కావడం చాలా హ్యాపీగా ఉంది. స్కైలాబ్, గమనం, భీమ్లా నాయక్ చిత్రాల్లో నటించాను. గమనంలో చాలా చిన్న పాత్రలో నటించాను. ఆ సినిమా నుంచి క్రెడిట్ తీసుకోవడం లేదు. ఇక నుంచి వరుసగా చాలా సినిమాలు రిలీజ్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నాయి. చాలా భాషల్లో నేను నటిస్తున్నాను అని నిత్యా మీనన్ తెలిపారు.