చిత్రలహరి సినిమా చేసేటప్పుడే మళ్లీ పనిచేద్దాం అని చెప్పారు. కొద్ది రోజులకు నాకు ఫోన్ చేసి తడమ్ రీమేక్ రెడ్ గురించి వివరించారు. కథ వినకుండానే నేను ఓకే చెప్పాను. కథ, స్క్రిప్టు ఏమిటని అడుగుండా నేను పనిచేసే దర్శకులు ఇద్దరు ఉన్నారు. వారిలో ఒకరు వివేక్ ఆత్రేయ, మరొకరు కిషోర్ తిరుమల అని నివేథా పేతురాజ్ తెలిపారు.
తడమ్ రీమేక్ అని చెప్పిన తర్వాత ఇంత వరకు ఆ సినిమాను చూడలేదు. ఒకే ఒక సీన్ మాత్రమే చేశాను. పోలీస్ అధికారిగా చేయాల్సి రావడం అంతగా కష్టం కాలేదు. అంతా దర్శకుడు కిషోర్ తిరుమల చూసుకొన్నారు. ఆయనతో పనిచేస్తే ఒక పాత్ర నుంచి మరో పాత్రకు ట్రాన్స్‌ఫర్ చేయాల్సిన అవసరం లేదు అని నివేథా పేతురాజ్ పేర్కొన్నారు.
హీరో రామ్ పక్కాగా ప్రొఫెషనల్. చాలా మంచి వ్యక్తి. సెట్లో ఉన్నంత సేపు మేము తమిళ్‌లోనే మాట్లాడుకొన్నాం. ఒక పాత్ర నుంచి మరో పాత్రకు మారడంలో రామ్ ప్రత్యేకత వేరు. రెడ్ సినిమాలో ఆయన రెండు పాత్రల్లో కనిపిస్తారు. రెండు రకాల పాత్రలను ఒకే రోజు డిఫరెంట్ మోడ్‌లో చేయడం నాకు చాలా ఆశ్చర్యం కలుగుతుంది.
రెడ్ సినిమా కోసం నా పాత్ర నిడివిని చాలా పెంచారు. డబ్బింగ్ చెప్పేటప్పడు రెడ్ సినిమా చూశాను. అప్పడు నా పాత్ర గురించి పూర్తిగా అర్ధమైంది. డిఫినెట్‌గా సినిమా హిట్ అవుతుంది అని నివేథా పేతురాజ్ తెలిపారు.
నా కెరీర్‌లో రకరకాల పాత్రలు పోషించాను. తమిళంలో విజయ్ సేతుపతి మాదిరిగా రకరకాల పాత్రలు చేయాలనే ప్లాన్‌లో ఉన్నాను. నేను కూడా పాత్రల ఆధారంగా నడిచే సినిమాలు చేయాలని, లేడి విజయ్ సేతుపతి అనిపించుకోవాలని అనుకొంటున్నాను అని నివేథా పేతురాజ్ తెలిపారు.
Nivetha Pethuraj interview: Energetic Star Ram Pothineni’s much awaited next ‘RED’ to have a Grand Release for Sankranthi, only in Theaters. Directed by Kishore Tirumala, this intriguing flick is bankrolled by Sravanthi Ravi Kishore in Sri Sravanthi Movies banner. Revealing the insights, Producer Sravanthi Ravi Kishore says, “ We’re all set to release RED in Theatres, this Sankranthi. In this occassion, Nivetha Pethuraj talks about Hero Ram's RED movie