twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    హిట్టు కోసం అరవింద సమేత తీయలేదు.. త్రివిక్రమ్‌పై అజ్ఞాతవాసి ఒత్తిడి.. అతీతులం కాదు.. ఎన్టీఆర్

    |

    జైలవకుశ భారీ సక్సెస్ తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన చిత్రం అరవింద సమేత.. వీర రాఘవ. అజ్ఞాతవాసి దారుణమైన పరాజయం తర్వాత త్రివిక్రమ్ రూపొందించిన ఈ చిత్రమిది. అంతేకాకుండా ఎన్టీఆర్, త్రివిక్రమ్ చేస్తున్న మొదటి సినిమా కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. దానికి అనుగుణంగానే టీజర్లు, ట్రైలర్లు భారీ హైప్‌ను క్రియేట్ చేశాయి. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో అరవింద సమేత చిత్రం అక్టోబర్ 11న ప్రేక్షకుల ముందుకు వస్తున్నది. ఈ సందర్భంగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ మీడియాతో ముచ్చటించారు. ఎన్టీఆర్ చెప్పిన విషయాలు ఆయన మాటల్లోనే..

    టైటిల్‌ చుట్టూ తిరిగే స్టోరి

    టైటిల్‌ చుట్టూ తిరిగే స్టోరి

    అరవింద సమేత కథ టైటిల్ చుట్టే తిరుగుతుంటుంది. మహిళా సాధికరతను చెప్పుతుంది. కథలో హింస (వయోలెన్స్) ఉంటుంది. హింసను ఆపే అంశం, సమాజంలో మహిళల ప్రాధాన్యత అనే అంశాలతో అరవింద సమేత కథ సాగుతుంటుంది. సినిమాలో వయోలెన్స్ ముఖ్యం కాదు. నవరసాల్లో అది ఒక రసం. యుద్ధం చేసే సత్తా లేని వాడికి శాంతి గురించి అర్హత లేదు. చేదు అనుభవం చవిచూడని వాడికి దానికి గురించి మాట్లాడే అర్హత లేదు.

    టైటిల్ గురించి చర్చ జరుగలేదు

    టైటిల్ గురించి చర్చ జరుగలేదు

    త్రివిక్రమ్ శ్రీనివాస్ అరవింద సమేత టైటిల్ చెప్పినప్పుడు మా మధ్య ఎలాంటి చర్చ జరగలేదు. ఎందుకంటే చాలా జెన్యూన్ టైటిల్. హిట్టు సినిమా తీయాలని మేము ఈ సినిమా ప్రారంభించలేదు. ఒత్తిడి మాపై లేదు. 14 సంవత్సరాలుగా నాకు మంచి మిత్రుడు. ఎలాంటి సినిమా తీయాలనే ఆలోచనలోనే అన్ని సంవత్సరాలు గడిచిపోయాయి.

    నాకు జర్నీ ఇంపార్టెంట్

    నాకు జర్నీ ఇంపార్టెంట్

    జీవిత ప్రయాణం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. కొన్నిసార్లు చివరి ఫలితం చాలా చేదుగా ఉంటుంది. రిలేషన్ ఎలా ఉన్నా.. నా దృష్టిలో జీవిత ప్రయాణమన్నదే నాకు ముఖ్యం. టైటిల్ డిస్కషన్ వచ్చినప్పుడు ఈ టైటిల్‌ను ప్రేక్షకులు రిసీవ్ ఎలా తీసుకొంటారనే విషయాన్ని పట్టించుకోలేదు.

    12 ఏళ్ల నిరీక్షణ తర్వాతనే

    12 ఏళ్ల నిరీక్షణ తర్వాతనే

    12 ఏళ్ల నిరీక్షణకు ఫలితమని ఈ సినిమా చెప్పలేను. కథ నచ్చడం వల్ల సినిమా చేశాం. అంతిమ ఫలితం కోసం మేము ఆలోచించడం లేదు. ఓ మంచి సినిమా చేశామన్న తృప్తి ఉంది. ట్రైలర్, టీజర్లలో హింసను చూపించడం అలాంటి ఫీలింగ్ కలుగుతుంది. కథలో అంతర్లీనంగా ఓ మంచి కథ, పాయింట్ ఉంది.

    త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌తో రిలేషన్

    త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌తో రిలేషన్

    త్రివిక్రమ్‌తో నా రిలేషన్ సుదీర్ఘమైంది. ఆయనతో అనుబంధం ధృడమైనది. ఆ బంధానికి ఇప్పుడు ఈ సినిమా తోడైంది. దర్శకుడు, నటుడు మధ్య రిలేషన్ భార్యభర్తల బంధం. నటుడికి దర్శకుడే తొలి ప్రేక్షకుడు. కథకు ముఖం నటుడు మాత్రమే. నటుడిగా దర్శకుడిని నటులు సంతృప్తి పరుచాలి.

    త్రివిక్రమ్‌పై ఒత్తిడి ఉందని

    త్రివిక్రమ్‌పై ఒత్తిడి ఉందని

    అజ్ఞాతవాసి చిత్రం తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్‌పై ఒత్తిడి ఉంది. సినిమా రంగంలో హిట్టు, ఫ్లాప్ అనేది కామన్. ప్రతీ ఒక్కరికి ఆ ఫేజ్ ఉంటుంది. ఇప్పుడు ఆయనపైనే కాదు. నాపై కూడా ఒత్తిడి ఉంది. అజ్ఞాతవాసి ఫెయిల్ కంటే మా ఎమోషనల్‌పైనే ఎక్కువ ఒత్తిడికి గురయ్యాడు. గతనెల మానాన్న మరణంతో ఊహించిన పరిణామాలు ఎదురయ్యాయి. ఎవరూ ఊహించని సంఘటన. విషాద సంఘటనలకు ఎవరూ అతీతులు కాదు. నాన్న అందించిన స్ఫూర్తితో ముందుకెళ్తున్నాం. మాపై ఆధారపడిన కుటుంబం కోసం ఆలోచిస్తూ ఆ విషాదం నుంచి బయటకు వచ్చే ప్రయత్నం చేస్తున్నాం.

    ఏదో చేయాలనే ఆలోచన లేదు

    ఏదో చేయాలనే ఆలోచన లేదు

    నేను ఓ సినిమా చేసేటప్పుడు ఫ్యాన్స్ కోసం ఇంకా ఏదో చేయాలనే ఆలోచన కలుగదు. ఎందుకంటే ఏం చేయాలో తెలియనప్పుడు దాని గురించి ఆలోచన రాదు. టెంపర్ సినిమా చేస్తున్నప్పుడు నేను అంత మంచి సినిమా చేస్తున్నానని అనిపించలేదు. అలాగే ‘నాన్నకు ప్రేమ'తో చేసినప్పుడు కూడా అదే ఫీలింగ్. సినిమా రిలీజ్ తర్వాత ఏం జరుగబోతుందనే విషయం ఎవరూ అంచనా వేయలేదు. మనిషిని చట్రంలో బిగించే ప్రయత్నం చేయను. మీ ముందుకు ఏది వస్తే దానిని అంగీకరించాలి.

    English summary
    NTR, Trivikram Srinivas's Aravinda sametha has sky high expections. This movie teaser, First Look got good response from fans. Now Aravinda Sametha juke box came out into the market. Four songs have good lyrical values. This movie set to release on October 11th.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X