twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రాజమౌళి అలా మాయ చేశాడు.. అందుకే ఈ టెన్షన్.. సాహో గురించి ప్రభాస్

    |

    Recommended Video

    'SS Rajamouli Is The Reason For My Craze' Says Prabhas || Filmibeat Telugu

    సాహో చిత్రం ఎంటర్‌టైనింగ్‌గా ఉండటమే కాకుండా డైరెక్టర్ సుజిత్ రెడ్డి తరహా ఉంటుంది. ఈ సినిమాను ఆయన అభిరుచికి తగినట్టుగా డిజైన్ చేశారు. సినిమాలో యాక్షన్‌తోపాటు ఎమోషన్స్ కూడా ఉంటాయి. స్క్రీన్ ప్లే ఆధారంగా సాగే కథ. అందర్నీ ఆకట్టుకొనే రేంజ్‌లో సాహో ఉంటుందని భావిస్తున్నాను అని ప్రభాస్ అన్నారు. ఆగస్టు 30న సాహో రిలీజ్ అవుతున్న నేపథ్యంలో ప్రభాస్ మీడియాతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ప్రభాస్ మాట్లాడుతూ..

    సాహో కోసం ప్రత్యేకంగా శిక్షణ

    సాహో కోసం ప్రత్యేకంగా శిక్షణ

    సినిమా కోసం ప్రత్యేకంగా శిక్షణ పొందాను. కానీ బాహుబలి మాదిరిగా నెలలు తరబడి ట్రైనింగ్ పొందలేదు. సినిమాకు కావాల్సిన యాక్షన్ సీన్లకు కావాల్సినంత మేరకే ట్రైనింగ్ తీసుకొన్నాం. అలాగే బాహుబలి కోసం బరువు పెరగడంతో 99 కేజీల వరకు ఉండేవాడిని. ఈ సినిమా కోసం 70 కేజీల వరకు వెయిట్ మెయింటెన్ చేశాను. హై ఎండ్ యాక్షన్ సీన్లను అబుదాబీ, హైదరాబాద్, ఇటలీలో షూట్ చేశాం. యాక్షన్ సీన్ల కోసం 30 కార్లు ప్రత్యేకంగా డిజైన్ చేశారు అని ప్రభాస్ అన్నారు.

    యూరప్ నుంచి దిగుమతి

    యూరప్ నుంచి దిగుమతి

    యాక్షన్ సీన్ల కోసం ప్రత్యేకంగా ట్రక్కులు డిజైన్ చేసి యూరప్‌ నుంచి తెప్పించాం. ప్రతీ యాక్షన్ సీన్ కోసం చాలా రిహార్సల్ చేశాం. హాలీవుడ్ నిపుణులు, యాక్షన్ కోఆర్డినేట్ బృందాలు చక్కగా పనిచేశాయి. కమల్, సాబు సిరిల్ ప్రొడక్షన్‌ను కంట్రోల్ చేశారు. యాక్షన్ సీన్ల కోసం ప్రాగ్ నుంచి ప్రత్యేకంగా కొన్ని వెహికిల్స్ దిగుమతి చేసుకొన్నాం అని ప్రభాస్ చెప్పారు.

    రిమోట్ కార్లను తొలిసారి ఉపయోగించాం

    రిమోట్ కార్లను తొలిసారి ఉపయోగించాం

    సాహో కోసం తొలిసారి రిమోట్‌తో నడిచే కార్లను వాడాం. నేను కూడా రిమోట్‌తో నడిచే కార్లను మొట్టమొదటిసారి చూశాను. యాక్షన్ సీన్లలో క్రాష్ అయినప్పుడు రిమోట్ కార్లను వాడాం. ఎందుకంటే మనుషులకు ఎలాంటి ప్రాణనష్టం కలుగకూడదని అలా చేశాం. కెన్నీబైట్స్ కోసం ప్రత్యేకంగా యూరప్ నుంచి కెమెరాలను తెప్పించాం. బ్లాస్టింగ్ కోసం ప్రత్యేకంగా టెక్నాలజీని వాడాం. టెక్నాలజీ ఉంటే సరిపోదు.. అందుకే ఎమోషనల్ ఎలిమెంట్స్ లేకపోతే సినిమా ఆడదుగా . అందుకే ప్రేక్షకులను భావోద్వేగానికి గురిచేసే అంశాలను సుజిత్ జొప్పించారు అని ప్రభాస్ అన్నారు.

    రెమ్యునరేషన్ తీసుకొన్నాగా..

    రెమ్యునరేషన్ తీసుకొన్నాగా..

    సహజంగా చాలా కూల్‌గా కనిపిస్తారు. కానీ సాహో మాత్రం వయోలెంట్‌గా కనిపించడం కష్టం కాలేదా? అనే ప్రశ్నకు సమాధానం ఇస్తూ రెమ్యునరేషన్ తీసుకొన్నందున వయోలెంట్‌గా నటించాల్సి వచ్చింది. డబ్బులు తీసుకొన్నప్పుడు ఎలాంటి సీన్లలోనైనా నటించాల్సిందే. బాహుబలి తర్వాత జాతీయ స్థాయి నటుడిని అయ్యాను. అది బాధ్యతగా భావిస్తాను. అందుకే పలు రాష్ట్రాల్లో ప్రమోషన్స్‌కు వెళ్లాను. అక్కడి ప్రేక్షకుల ఆదరణ చేస్తే చాలా హ్యాపీగా ఫీలయ్యాను అని ప్రభాస్ పేర్కొన్నారు.

    ఎస్ఎస్ రాజమౌళి మాయతోనే క్రేజ్

    ఎస్ఎస్ రాజమౌళి మాయతోనే క్రేజ్

    బాహుబలి తర్వాత దేశవ్యాప్తంగా క్రేజ్ పెరిగింది. దాంతో అనుకోకుండా ఫాలోయింగ్ పెరిగిపోయింది. ఆ క్రెడిట్ అంతా బాహుబలికి, రాజమౌళికి దక్కుతుంది. రాజమౌళి చేసిన మాయ చేశాడు. ఆ మాయలోనే ఇంకా బతుకుతున్నాను. బాహుబలి తర్వాత ఎక్కడికి వెళ్లినా గుర్తుపట్టడం, ఫ్యాన్ బేస్ ఎక్కువ కావడం ఊహించనిదే. బాహుబలి తర్వాత సాహో వస్తున్నందున ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకొంటారనే టెన్షన్‌లో ఉన్నాను అని ప్రభాస్ తెలిపారు.

    English summary
    Baahubali star Prabhas breaks records in even keeping memories as he takes home a car and a bike from Saaho. The much loved actor will be seen in a daunting power-packed avatar in his upcoming action thriller Saaho, which would witness him performing high octane stunts involving cars, bikes and trucks.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X