Rowdy Boys OTT release పై దిల్ రాజు క్లారిటీ.. ఆశీష్‌కు శుభారంభం.. 5 రోజుల్లో కలెక్షన్లు ఎంతంటే?

ప్రముఖ నిర్మాత దిల్ రాజు తెలుగు సినిమా పరిశ్రమలోనే కాకుండా బాలీవుడ్‌లో తన సత్తా చాటేందుకు ప్లాన్స్ చేసుకొంటున్నారు. నిర్మాతగా తన స్టామినాను నిరూపించుకొన్న దిల్ రాజు.. తన కుటుంబం నుంచి, తన సోదరుడు శిరీష్ కుమారుడు ఆశీష్‌ను రౌడీ బాయ్స్ సినిమా ద్వారా టాలీవుడ్‌కు పరిచయం చేశారు. థియేటర్లలో రిలీజైన రౌడీ బాయ్స్ చిత్రం మిక్స్‌డ్ టాక్‌ను సొంతం చేసుకొన్నప్పటికీ.. నిలకడగా కలెక్షన్లు సాధిస్తున్నది. ఈ నేపథ్యంలో రౌడీ బాయ్స్ కలెక్షన్లు, అలాగే ఓటీటీ రిలీజ్ గురించి దిల్ రాజ్ క్లారిటీ ఇస్తూ..

Recommended Video

Rowdy Boys సంక్రాంతి బరిలో రావడం మా అదృష్టం- Harsha Konuganti | Filmibeat Telugu
బంగార్రాజుతో పోటీపడుతూ..

బంగార్రాజుతో పోటీపడుతూ..

రౌడీ బాయ్స్ ప్రేక్షకుల ముందుకు వచ్చి ఐదు రోజులు పూర్తయ్యాయి. వైజాగ్‌లో హీరో, హీరోయిన్లతోపాటు సినిమా యూనిట్ ప్రమోషనల్ ఈవెంట్స్‌లో పాల్గొన్నారు. సినిమా రిలీజ్ తర్వాత ప్రేక్షకుల నుంచి వచ్చిన ఫీడ్‌బ్యాక్‌తో హ్యాపీగా ఫీలయ్యాను. అయితే అదే రోజు నుంచి వసూళ్లు తగ్గుముఖం పట్టడం కొంచెం నిరాశ కలిగించింది. అయితే భోగి పండుగ కావడం, యూత్ సినిమా కావడం, అలాగే నాగార్జున, నాగచైతన్య లాంటి మల్టీస్టారర్ సినిమా బంగార్రాజుతో రౌడీ బాయ్స్ పోటీ పడలేకపోవడం కొంచెం కలెక్షన్లు తగ్గాయని గ్రహించాం. కలెక్షన్ల విషయంలో ప్రాక్టికల్‌గా ఉండాలన్నది నా ఉద్దేశం. కొత్తవాళ్లతో తీసినప్పటికీ రౌడీ బాయ్స్ సినిమాకు మంచి వసూళ్లు వచ్చాయి అని నిర్మాత దిల్ రాజు తెలిపారు.

5 రోజుల్లో 4 కోట్లకుపైగా షేర్

5 రోజుల్లో 4 కోట్లకుపైగా షేర్

రౌడీ బాయ్స్ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో తొలి రోజున 1.42 కోట్లు, కానీ నేను ఇంకా ఎక్కువగా అంచనా వేశాను. కానీ నా అంచనాను చేరుకోలేకపోయింది. రెండో రోజు పండుగ రోజు కలెక్షన్లు తగ్గుతాయని అనుకొన్నాను. కానీ 1.62 కోట్లు వసూలు చేసింది. 1.55 కోట్లు మూడో రోజున వసూలు చేసింది. నాలుగు రోజున ఆశ్చర్యకరమైన వసూళ్లు వచ్చాయి. సోమవారం 1.32 కోట్లు వసూలు చేసింది. మంగళవారం నుంచి ఏపీలో థియేటర్లలో 50 శాతం అక్యుపెన్సీ విధించారు. కానీ ఈ సినిమా 1.05 కోట్లు వసూలు చేసింది. 5 రోజుల్లో 4 కోట్లకుపైగా షేర్ సాధించింది. కొత్త హీరోకు ఇలాంటి కలెక్షన్లు శుభారంభం అని నిర్మాత దిల్ రాజు వెల్లడించారు.

ఏపీలో హౌస్‌ఫుల్ కలెక్షన్లతో

ఏపీలో హౌస్‌ఫుల్ కలెక్షన్లతో

కరోనా కేసులు పెరగడం వల్ల ఓవర్సీస్‌లో ఈ సినిమాకు ఆదరణ లభించలేదు ఇలా స్టడీగా వసూళ్లను నమోదు చేస్తూ ముందుకెళ్తున్నది. ఏపీలో 50 శాతం అక్యుపెన్సీ పెట్టడం వల్ల రౌడీ బాయ్స్ సినిమాకు సానుకూలంగా మారింది. మంగళవారం కూడా రాజమండ్రి, భీమవరం, విజయనగరం లాంటి పట్టణాల్లో హౌస్‌ఫుల్ కలెక్షన్లు వచ్చాయి. నైజాంలో కంటే ఏపీలో మంచి కలెక్షన్లు నమోదయ్యాయి. 50 శాతం అక్యుపెన్సీ వల్ల సినిమా చూడాలనుకొనే వాళ్లు ముందుకొస్తారు. దీంతో ఈ సినిమా బ్లాక్‌బస్టర్ దిశగా అడుగులెస్తుందనే ఫీలింగ్ కలుగుతుంది. రెండోవారంలో కూడా ఇదే విధంగా వసూళ్లు రాబడితే సినిమా మంచి విజయం సాధిస్తుందని భావిస్తున్నాం అని దిల్ రాజు చెప్పారు.

రౌడీ బాయ్స్ ఓటీటీ రిలీజ్ ఎప్పుడంటే?

రౌడీ బాయ్స్ ఓటీటీ రిలీజ్ ఎప్పుడంటే?

రౌడీ బాయ్స్ సినిమాను ఓటీటీలో ఇప్పుడే రిలీజ్ చేసే ఉద్దేశం లేదు. సినిమా థియేటర్‌లో రన్ అవుతున్నది. వచ్చేవారం కూడా సినిమాలు విడుదలయ్యే అవకాశం లేదు. కాబట్టి రౌడీ బాయ్స్ లాంటి సినిమాను తీసేసి.. ఓటీటీలో వేస్తే థియేటర్లు మూత పడే ప్రమాదం ఉంది. కాబట్టి రౌడీ బాయ్స్ సినిమాను రిలీజ్ డేట్ నుంచి 50 రోజుల తర్వాత విడుదల చేయాలని ప్లాన్ చేశాం అని దిల్ రాజు తెలిపారు.

త్వరలోనే రౌడీ బాయ్స్ మ్యూజిక్ ఫెస్టివల్

త్వరలోనే రౌడీ బాయ్స్ మ్యూజిక్ ఫెస్టివల్

రౌడీ బాయ్స్ సినిమా మ్యూజిక్‌కు మంచి రెస్సాన్స్ వస్తున్నది. సంక్రాంతికి రిలీజ్ చేయాలనే తొందరలో అన్ని పాటలను రిలీజ్ చేయలేకపోయాం. కేవలం రెండు పాటలను మాత్రమే రిలీజ్ చేశాం. ఆ తర్వాత ఒకటే రోజు నాలుగు పాటలను రిలీజ్ చేశాం. రిలీజ్ తర్వాత మ్యూజిక్‌కు మంచి స్పందన లభిస్తున్నది. కాబట్టి త్వరలో మ్యూజిక్ ఫెస్టివల్‌ను నిర్వహించి ఈ సినిమాను మరింతగా ప్రేక్షకుల వద్దకు తీసుకెళ్తాం అని దిల్ రాజు అన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X