Just In
- 2 hrs ago
‘ఆచార్య’ టీంకు షాక్.. మొదటి రోజే ఎదురుదెబ్బ.. లీకులపై చిరు ఆగ్రహం
- 3 hrs ago
‘ప్లే బ్యాక్’ నేను తీద్దామని అనుకున్నా కానీ.. సుకుమార్ కామెంట్స్ వైరల్
- 4 hrs ago
పబ్లిక్ ప్లేస్‌లో ఘాటు రొమాన్స్.. భర్తతో లిప్ లాక్‌తో రెచ్చిపోయిన శ్రియ
- 5 hrs ago
మహేశ్ బాబు కొత్త సినిమాలో ప్రియాంక: ప్రకటనకు ముందే మొదలైపోయిన వార్తలు
Don't Miss!
- News
రైతుల నిరసన: మహిళా దినోత్సవం రోజున ఢిల్లీ వైపు 40వేల మంది మహిళలు
- Finance
IPO: LIC ఆథరైజ్డ్ క్యాపిటల్ భారీ పెంపు, రూ.25,000 కోట్లకు..
- Sports
కిడ్స్ జోన్లో టీమిండియా క్రికెటర్ల ఆట పాట!వీడియో
- Lifestyle
ఈ వారం మీ జాతకం ఎలా ఉందో ఇప్పుడే చూసెయ్యండి... మీ లైఫ్ కు సరికొత్త బాటలు వేసుకోండి...
- Automobiles
మహీంద్రా కార్స్‌పై అదిరిపోయే ఆఫర్స్ ; ఏ కార్‌పై ఎంతో చూసెయ్యండి
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
ఇండస్ట్రీలో ఉండాలంటే అది ముఖ్యం.. ఆయనలా నటించలేం.... రాశీ ఖన్నా కామెంట్స్
ఊహలు గుసగుసలాడే చిత్రంతో పలకరించిన అందాల బొమ్మ రాశీ ఖన్నా.. తక్కువ కాలంలోనే ఎక్కువ క్రేజ్ తెచ్చుకుంది. వరుస చిత్రాలతో బిజీగా ఉన్న ఈ అమ్మడు.. ప్రస్తుతం ఫిట్‌నెస్‌పై ప్రత్యేక శ్రద్ద వహిస్తోంది. కెరీర్ మొదట్లో బొద్దుగా రాశీ.. ప్రస్తుతం మల్లెతీగలా తయారైంది. వరుస చిత్రాలతో ఆడియెన్స్‌ను అలరించేందుకు రాశీ ఖన్నా సిద్దమైంది. ప్రస్తుతం వెంకీమామ, ప్రతీ రోజూ పండగే అంటూ రాశీ ఖన్నా హడావిడి చేస్తోంది. తాజాగా వెంకీమామ చిత్ర విశేషాలను మీడియాతో పంచుకుంటూ అనేక విషయాలను వెల్లడించింది.

ఫిట్‌నెస్ ముఖ్యం..
సినిమా ఇండస్ట్రీలో ఉండాలంటే ఫిట్‌నెస్ ముఖ్యమని రాశీ ఖన్నా పేర్కొంది. బొద్దుగా ఉన్నా కూడా పాత్రలు వస్తాయని, అయితే అన్ని రకాల పాత్రలను పోషించాలంటే మాత్రం ఫిట్‌గా ఉండాలని చెప్పుకొచ్చింది. అయితే తనకు మరీ నాజూగ్గా తయారవటం కూడా ఇష్టముండదని, ఒకవేళ క్యారెక్టర్ డిమాండ్ మేరకు జీరో సైజ్‌కు కూడా తగ్గుతానని తెలిపింది.

వెంకీమామలో ప్రత్యేక పాత్ర..
వెంకీమామ చిత్రంలో తన పాత్ర ప్రత్యేకమైందని తెలిపింది. హారిక అనే అమ్మాయి పాత్రను పోషిస్తున్నట్లు, ఫిల్మ్ మేకర్ అవ్వాలనే కోరికతో ఉండే అమ్మాయి.. సిటీలో పెరిగిన హారిక ఊర్లోకి వచ్చి ఎలాంటి ప్రాబ్లమ్స్‌ను ఎదుర్కొందనే పాత్రను పోషించినట్లు తెలిపింది.

ఆయనలా చేయలేము..
ఈ చిత్రంలో వెంకటేష్‌తో కూడా చాలా సన్నివేశాలున్నాయని చెప్పుకొచ్చింది. ఆయన కామెడీ టైమింగ్‌ను అందుకోవడం చాలా కష్టమని తెలిపింది. ఆయనవి యూనిక్ ఎక్స్‌ప్రెషన్స్ అని, వాటిని ఇమిటేట్ చేద్దామని ప్రయత్నించినా.. అలా చేయలేమని పేర్కొంది.

వారిని అలా చేయాలి..
దిశ ఘటనపై తనకు కోపమూ, భయమూ రెండూ వేస్తున్నాయని తెలిపింది. అలాంటి వారిని బహిరంగంగా ఉరి తీయాలని చెప్పుకొచ్చింది. చట్టాలు, కోర్టులను దాటి మనం ఆ పనిని మనం చేయలేము.. అలాంటి సమయంలోనే ఫ్రస్ట్రేషన్ వస్తుందని పేర్కొంది. వారు పెరిగిన వాతావరణం, పెంచిన విధానం వల్లే అలా తయారవుతున్నారని, అమ్మాయిలను చూసే దృష్టి మారాలని చెప్పుకొచ్చింది. అమ్మాయిలు బయటకు వెళ్లేటప్పుడు పెప్పర్ స్ప్రే తీసుకెళ్లాలని సలహా ఇచ్చింది.