Just In
- 1 hr ago
ఆ మూడు గుర్రాలతో.. రిపబ్లిక్ అనే పదానికి అసలైన అర్దాన్ని చెబుతున్న మెగా హీరో
- 1 hr ago
RRR రిలీజ్ డేట్ వల్ల మరో తలనొప్పి.. అసలైన వాళ్లే వద్దంటే డేట్ తప్పకుండా మార్చాల్సిందే..
- 3 hrs ago
మహేష్ చేయాల్సిన పవర్ఫుల్ కథలో పవన్ కళ్యాణ్.. పదేళ్ల తరువాత సెట్స్ పైకి..
- 3 hrs ago
క్రాక్ హిట్టు కాదు.. అంతకు మించి.. రవితేజ కెరీర్ లోనే బిగెస్ట్ కలెక్షన్స్
Don't Miss!
- Sports
ముగ్గురు స్టార్ ఆటగాళ్లపై కన్నేసిన సీఎస్కే.. వాట్సన్ స్థానం అతనిదేనా?
- News
అసదుద్దీన్ ఒవైసీకి నాన్ బెయిలబుల్ వారంట్ జారీ.. ఎందుకంటే..
- Finance
సెన్సెక్స్ 530 పాయింట్లు డౌన్, అందుకే రిలయన్స్ మహా పతనం
- Automobiles
ఆటోమేటిక్ టెయిల్‌గేట్ కలిగి ఉన్న భారతదేశపు మొట్టమొదటి హ్యుందాయ్ క్రెటా, ఇదే
- Lifestyle
Republic Day 2021:చరిత్ర తిరగరాస్తున్న నారీమణులు.. ఫ్లై పాస్ట్ ను లీడ్ చేయనున్న ఫస్ట్ లేడీ పైలట్ స్వాతి రాథోడ్
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
చంద్రబాబే ఆ పని చేస్తాడు.. ఎందుకంటే ఆయనకు ఆ సమస్య.. నిజాలు బయటకు వస్తాయని.. వర్మ
ఎన్టీఆర్ బయోపిక్ తర్వాత స్వర్గీయ ఎన్టీఆర్ జీవితం ఆధారంగా లక్ష్మీస్ ఎన్టీఆర్ అనే చిత్రం విడుదలకు సిద్ధమైంది. రిలీజ్‌కు ముందే వివాదాస్పదంగా మారిన ఈ చిత్రానికి సెన్సేషనల్ డైరెక్టర్ రాంగోపాల్ వర్మ దర్శకత్వం వహించారు. ఈ సినిమా ప్రమోషన్‌లో భాగంగా రాంగోపాల్ వర్మ సినిమా విశేషాలను, కొన్ని సంఘటనల వెనుక విషయాలను మీడియాతో పంచుకొన్నారు. వర్మ తెలుగు ఫిల్మీబీట్‌తో మాట్లాడుతూ లక్ష్మీస్ ఎన్టీఆర్ తీయడానికి కారణాలను, అధిగమించిన అడ్డంకులను వెల్లడించారు. ఆయన ఏమన్నారంటే..

నిజాలు బయటకు వస్తాయనే కారణంతో
బాలీవుడ్‌లో నేను మాఫియా మీద సినిమాలు తీశాను. మహారాష్ట్ర రాజకీయాలను శాసించిన బాల్ థాక్రే జీవితం ఆధారంగా చిత్రాలను తీశాను. కానీ ఎలాంటి వివాదాలు, అడ్డంకులు ఎదుర్కోలేదు. కానీ లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా విషయంలో కొన్ని అవరోధాలు ఎదురయ్యాయి. ఎందుకంటే ఎన్టీఆర్ జీవితంలో జరిగిన కొన్ని నిజాలు బయటకు వస్తాయనే భయంతోనే కొందరు అడ్డంకులు సృష్టించేందుకు ప్రయత్నించారు అని వర్మ తెలిపారు.

ఎన్టీఆర్‌కు ఊహించని ఎదురుదెబ్బ
లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా తీయడానికి కారణం ఎన్టీఆర్ జీవితంలోని భావోద్వేగపూరితమైన అంశాలే. ఆయన జీవితమంతా ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా గడించింది. కానీ 70 ఏళ్ల వయసులో ఎన్టీఆర్‌కు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. అందుకు కారణం ఆయన కుటుంబ సభ్యులు చేసిన కుట్రలే. ఆ కుట్రల గురించి స్వయంగా ఎన్టీఆరే చెప్పారు. ఆ అంశాలే నన్ను సినిమా తీయడానికి పురిగొల్పాయి అని వర్మ చెప్పారు.

ఎమోషన్స్ రాబట్టుకొనేందుకే కొత్తవారితో
ఎన్టీఆర్, ఇతర పాత్రలకు సాధారణమైన నటులను ఎన్నుకోవడానికి ప్రధాన కారణం వారికి ఎలాంటి ఇమేజ్ లేకపోవడం. దాంతో వారి నుంచి నాకు అవసరమైన ఎమోషన్స్ రాబట్టుకోవడానికి అవకాశం లభించింది. అదే పేరున్న నటులైతే వారికి కొన్ని పరిమితులు ఉంటాయి. కాబట్టి నాకు కావాల్సిన అవుట్‌పుట్ లభించి ఉండేది కాదనేది నా అభిప్రాయం. కానీ నేను అనుకొన్న అవుట్‌పుట్‌ను ఇవ్వడంలో నటీనటులు సఫలమయ్యారు అని వర్మ అన్నారు.

చంద్రబాబు ముందుండి రిలీజ్
లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాకు థియేటర్లు లభించకపోవడమనే సమస్య ఎదురుకాదని నేను మొదటి నుంచి నమ్ముతున్నాను. అలాగే సినిమాను రిలీజ్ కాకుండా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు చేయడని కూడా నేను నమ్మాను. ఎందుకంటే రాజ్యాంగ పరమైన పదవిలో కొనసాగుతూ లక్ష్మీస్ ఎన్టీఆర్‌ను అడ్డుకొంటే పరిస్థితులు ప్రతికూలంగా మారే అవకాశం ఉంటాయి. శాంతి భద్రతల సమస్య కూడా తలెత్తే ఛాన్సు ఉంటుంది. అందుచేత సినిమాను చంద్రబాబు ముందుండి రిలీజ్ చేయిస్తాడు అని వర్మ వెల్లడించారు.