twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కమర్షియల్ హీరోగా సక్సెస్ ఎందుకు కాలేదంటే.. విరాటపర్వం ప్యాన్ ఇండియా రిలీజ్ గురించి రానా దగ్గుబాటి

    |

    నాకు అడవులతో ఏదో చెప్పలేని అనుబంధం ఏర్పడింది. అరణ్య, విరాట పర్వం సినిమాల కారణంగా నేను అడవుల్లోనే షూట్ చేయాల్సి వచ్చింది. నక్సల్స్, దళాలు అడవుల్లో ఉండటం వల్ల నేను ఎక్కువగా అడవుల్లో గడపాల్సి వచ్చింది. తొలిసారి నేను ప్రేమకథ చేస్తున్నాను. సాధారణంగా ప్రేమ కథలు చేయడం ఇష్టం ఉండదు. కానీ ఇది డిఫరెంట్ సినిమా. ప్రేమ కోసం వెన్నెల అనే అమ్మాయి ఎంతకైనా తెగించడం అంశాలతో విరాట పర్వం తెరకెక్కింది అని రానా దగ్గుబాటి తెలిపారు. ఇంకా రానా దగ్గుబాటి మీడియాతో మాట్లాడుతూ..

    వేణు ఊడుగుల కథ చెప్పినప్పుడు

    వేణు ఊడుగుల కథ చెప్పినప్పుడు

    విరాట పర్వం సినిమా కథను నాలుగు పేజిల్లో మూలకథను వేణు ఊడుగుల పంపించాడు. ఆ నాలుగు పేజీల కథను చదివిన తర్వాత నాలుగైదు రోజులు వేణును కలువలేకపోయాను. ఆ నాలుగు రోజులు హృదయంలో ఏదో భారమైన ఫీలింగ్ కలిగింది. ఇటీవల కాలంలో అలాంటి కథను వినలేదు. అందుకే విరాట పర్వం సినిమా నా మనసుకు దగ్గరైన చిత్రం అని రానా దగ్గుబాటి చెప్పారు.

    ఓ భావోద్వేగానికి గురిచేసే మూవీ

    ఓ భావోద్వేగానికి గురిచేసే మూవీ

    విరాట పర్వం సినిమా చాలా పెద్ద సినిమా. టీజర్లు, ట్రైలర్‌లో సినిమా గురించి చెప్పాం. ఈ సినిమాలో కమర్షియల్ వాల్యూస్ ఉన్నాయి. ఈ సినిమాను చూసి భయపడే ఎమోషన్ ఉంటుంది. కథను అద్బుతంగా ప్రొజెక్ట్ చేశాం. అత్యంత నిజాయితీతో చేసిన సినిమా ఇది అని రానా దగ్గుబాటి అని అన్నారు.

    కమర్షియల్ హీరోగా కాకపోవడానికి

    కమర్షియల్ హీరోగా కాకపోవడానికి


    నాకు కమర్షియల్ హీరోగా సక్సెస్ కావడానికి కారణం చాలా ఉన్నాయి. నేను హీరోగా నటిస్తే.. నాకు సరిపడే విలన్‌ దొరకరు. నాతో ఫైట్ చేసే విలన్ నాకంటే తక్కువ హైట్‌లో ఉంటారు. అంతేకాకుండా నాకు కమర్షియల్ హీరోగా సెటిల్ కావాలనే ఆలోచన ఎప్పుడు లేదు. నాకు కథలు చెప్పాలనే ఆలోచన ఉంది కానీ.. హీరోగా కథలు చెప్పాలనే ఆలోచన లేదు అని రానా దగ్గుబాటి తెలిపారు.

    విరాట పర్వం మూవీని ప్యాన్ ఇండియాగా

    విరాట పర్వం మూవీని ప్యాన్ ఇండియాగా

    నాకు ప్యాన్ ఇండియా రీచ్ ఉంది. కానీ విరాట పర్వం సినిమాను ప్యాన్ ఇండియా మూవీగా మలచకపోవడానికి కారణం.. ఇది తెలుగు నేటివిటి ఉన్న సినిమా. తెలుగు సాహిత్యానికి ఎక్కువ ప్రాధాన్యం ఉంది. వేణు ఊడుగుల ఓ భావకవి. హిందీ, ఇతర భాషల్లో తీయాలంటే.. ఆ డైలాగ్స్, పాటలు అన్నీ పక్కాగా కుదరాలి. అయితే ఈ సినిమాను తమిళం, మలయాళం, ఇతర భాషల్లోకి డబ్బింగ్ చేసే ఆలోచనల్లో ఉన్నాం అని రానా దగ్గుబాటి చెప్పారు.

    రొటీన్ సినిమా కథలు నచ్చవు..

    రొటీన్ సినిమా కథలు నచ్చవు..

    నాకు హింసాత్మక చిత్రాలన్నా.. బాగా వయోలెన్స్ ఉన్న సినిమాలను ఇష్టపడను. కథలో కొత్తదనం ఉండాలి. అలాంటి కథే హిరణ్యకశ్యపుడు. అది నా కమర్షియల్ సినిమా. రావణాసురుడు పాత్ర వేస్తా అది.. నాకు కమర్షియల్ సినిమా. హీరో, హీరోయిన్లు పాటలు పాడుకోవడం నాకు నచ్చదు. అలాంటి సీన్లు వస్తే.. బయటకు లేచి వస్తా. అలాంటి సీన్లలో ప్రాక్టికాలిటీ ఉండదు. హీరోయిన్‌ను టీజ్ చేస్తే నాకు ఇబ్బందిగా ఉంటుంది. సినిమా అంటే నా తరహా ఆలోచన వేరే ఉంది. హీరోలు, హీరోయిన్లతో పిచ్చి పిచ్చి జోకులు వేస్తే నాకు నచ్చదు అని రానా దగ్గుబాటి అన్నారు.

    రానా మాత్రమే చేయగలడు అనేది..

    రానా మాత్రమే చేయగలడు అనేది..


    నా ఇష్టం తర్వాత నేను ప్రేమ కథల నేపథ్యంగా సినిమాలు చేయలేదు. ఒక పాత్ర రానా తప్ప వేరే వాళ్లు చేయలేదంటే అది నా జోనర్. ఈ కథను రానా మాత్రమే చేయగలడు అంటే.. అది నా జోనర్. నెగిటివ్ షేడ్స్ ఉండే ఎమోషనల్ పాత్రలు నాకు ఇష్టం. భీమ్లా నాయక్‌లో డేనియల్ శేఖర్ పాత్ర నాకు నచ్చింది. నేను ఏ పాత్రలో నటించినా హీరోలా అనిపిస్తే అది నా కమర్షియల్ అని రానా దగ్గుబాటి తెలిపారు.

    English summary
    Actor Rana Daggubati's latest movie is Virata Parvam. This movie set to release on June 17th. Here is the Rana's Inner feelings about the movie.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X