twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అప్పుడు రజనీకాంత్ అడ్డుకొన్నాడు.. ఇప్పుడు చిరంజీవి.. రత్నవేలు

    By Rajababu
    |

    భారతీయ సినిమా పరిశ్రమలో అద్భుతమైన సినిమాటోగ్రాఫర్లలో రత్నవేలు ఒకరు. శంకర్ దర్శకత్వంలో రోబో, సుకుమార్‌తో ఆర్య, 1 నేనొక్కడినే, కుమారి 21ఎఫ్, వినాయక్‌తో ఖైదీ నంబర్ 150, తాజాగా రంగస్థలం సినిమా ఆయన ప్రతిభకు అద్దం పట్టాయి. ప్రస్తుతం చిరంజీవితో రాంచరణ్ ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న సైరా నర్సింహారెడ్డి చిత్రానికి సినిమాటోగ్రఫిని అందిస్తున్నారు. అయితే తనకు డైరెక్టర్‌గా మారాలని ఉందని ఇటీవల తెలుగు ఫిలింబీట్‌తో మాట్లాడుతూ తన కోరికను వెల్లడించారు. ఇంకా ఆయన ఏమిచెప్పారంటే..

    దర్శకుడిగా మారుతాను

    దర్శకుడిగా మారుతాను

    దర్శకుడిగా మారాలనే కోరిక వెంటాడుతున్నది. నా వద్ద ఓ కథ మొత్తం బౌండ్ స్క్రిప్ట్‌గా ఉంది. కానీ సినిమాకు దర్శకత్వం వహించడానికి సమయం దొరకడం లేదు. గతంలో 1 నేనొక్కడినే చిత్రం తర్వాత డైరెక్షన్ చేయాలని నిర్ణయించుకొన్నాను.

    రజనీ వల్ల చేయలేకపోయాను

    రజనీ వల్ల చేయలేకపోయాను

    కానీ రజనీకాంత్ నటించిన లింగ సినిమా కారణంగా డైరెక్షన్ చేయలేకపోయాను. లింగ చిత్రానికి సినిమాటోగ్రఫీ చేయాలని రజనీసార్ పట్టుబట్టారు. అందుకే ఆ ప్రయత్నాన్ని విరమించుకొన్నాను.

    ఇప్పుడేందుకు తొందర

    ఇప్పుడేందుకు తొందర

    50 ఏళ్లు వచ్చేవరకు సినిమాటోగ్రఫీనే చేయండి. ఆ తర్వాత డైరెక్షన్ గురించి ఆలోచించండి. ఇప్పుడు డైరెక్షన్ చేసి ఏం చేస్తారు అని రజనీసార్ అడిగాడు. రజనీ సార్ అడ్డుపడటంతో కాదనలేకపోయాను.

    రంగస్థలం చిత్రం తర్వాత

    రంగస్థలం చిత్రం తర్వాత

    రంగస్థలం సినిమా తర్వాత మళ్లీ డైరెక్షన్ చేయాలనే కోరిక కలిగింది. ఆ సినిమా పూర్తయిన వెంటనే మళ్లీ నా చేతికి సైరా నర్సిహంరెడ్డి చేతికి వచ్చింది. చిరంజీవి, రాంచరణ్ చేయాలని ఒత్తిడి మేరకు డైరెక్షన్ చేయాలనే అంశానికి మళ్లీ పుల్‌స్టాప్ పడింది అని రత్నవేలు చెప్పారు.

    ఇండస్ట్రీలోకి రాజీవ్ మీనన్ శిష్యుడిగా

    ఇండస్ట్రీలోకి రాజీవ్ మీనన్ శిష్యుడిగా

    తనకు సినిమాటోగ్రాఫర్లలో రాజీవ్ మీనన్, సంతోష్ శివన్ అంటే చాలా ఇష్టం. రాజీవ్ మీనన్ వద్ద తాను అసిస్టెంట్‌గా చేరి ఇండస్ట్రీలోకి వచ్చాను. రాజీవ్ మీనన్ చాలా గొప్ప దర్శకుడు, సినిమాటోగ్రాఫర్ అని రత్నవేల్ అన్నారు.

    English summary
    Rangasthalam starring Ram Charan and Samantha Akkineni getting good buzz from all over the world. Samantha's Rama Laxmi role has earned a tremoundous positive talk. It is a film set in the 80s and unfolds in a village. The film also stars Adhi Pinisetty, Jagpathi Babu and Prakash Raj in pivotal roles. This movie released on March 30th. Cinematographer Ratnavelu gets got huge response for Rangashalam Movie. In this occassion, Ratnavelu speaks to Telugu Filmibeat exclusively.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X