For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  క్లాసిక్ హార‌ర్‌గా అమావాస్య.. ప్రేక్ష‌కులను భయపెట్టడం ఖాయం.. స‌చిన్ జోషి

  |

  మౌన‌మేల‌నోయి, నిను చూడ‌క నేనుండ‌లేను, ఒరేయ్ పండు, నీ జ‌త‌గా నేనుండాలి లాంటి చిత్రాల్లో త‌న‌దైన న‌ట‌న‌తో ప్రేక్షకుల‌ను మెప్పించిన న‌టుడు స‌చిన్ జోషి హీరోగా వైకింగ్‌ మీడియా అండ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ బేనర్‌ పై '1920 ఈవిల్‌ రిటర్స్స్‌', 'రాగిణి ఎమ్మెమ్మెఎస్, 'అలోన్‌' లాంటి సూపర్‌హిట్‌ చిత్రాల దర్శకుడు భూషణ్ పటేల్‌ దర్శకత్వంలో సచిన్‌జోషి, దీపెన్‌ఆమిన్‌ నిర్మాణంలో రూపొందిన హార‌ర్ చిత్రం 'అమావాస్య. బాలీవుడ్ అందాల తార న‌ర్గీస్ ఫ‌క్రీ హీరోయిన్‌గా న‌టిస్తున్నారు. ఈ సినిమా ఫిబ్రవరి 8న విడుద‌ల కానుంది. ఈ సందర్భంగా సచిన్‌జోషి వెల్లడించిన సినిమా విశేషాలు ఆయన మాటల్లోనే..+

  చాలాగ్యాప్ తర్వాత ‘అమావాస్య'తో

  చాలాగ్యాప్ తర్వాత ‘అమావాస్య'తో

  నేను చాలా కాలంగా హార‌ర్ సినిమా చేయాల‌ని ఎదురుచూస్తున్నాను. అలాంటి స‌మ‌యంలో భూష‌ణ్ ప‌టేల్ నాకు ఈ స్క్రిప్ట్ గురించి చెప్పారు. నా గ‌త చిత్రాల‌కు ఇది పూర్తి భిన్న‌మైన సినిమా. అమావాస్య ఓ క్లాసిక్ హార‌ర్ మూవీ. తెలుగులో హార‌ర్ చిత్రాల‌కు మంచి ఆద‌ర‌ణ దొరుకుతున్న స‌మ‌యంలో మంచి కాన్సెప్ట్‌తో సినిమా చేయ‌డం ఆనందంగా ఉంది.

  ఇది పూర్తిగా హారర్ చిత్రమే

  ఇది పూర్తిగా హారర్ చిత్రమే

  అమావాస్య పూర్తిగా హారర్ నేపథ్యంలోనే సాగుతుంది. సినిమాలోని కొన్ని హారర్ ఎలిమెంట్స్ ప్రేక్షకులను థ్రిల్ చేస్తాయి. అలాగే డైరెక్టర్ భూషణ్ పటేల్ స్క్రీన్ ప్లే కూడా చాలా బాగుంటుంది. సింగిల్ వర్డ్ లో చెప్పాలంటే.. అమావాస్య ఒక క్లాసిక్ హర్రర్ ఫిల్మ్.

  రెగ్యులర్ హారర్ చిత్రంలా ఉండదు

  రెగ్యులర్ హారర్ చిత్రంలా ఉండదు

  అమావాస్య రెగ్యులర్‌గా వచ్చే హర్రర్ సినిమాలా ఉండదు. ప్రధానంగా సినిమాలో కనిపించే గ్రాఫిక్ వర్క్స్ చాలా కొత్తగా, వైవిధ్యంగా ఉంటాయి. అన్నిటికి మించి ‘అమావాస్య‌'లో ఆకట్టుకునే గొప్ప స్టోరీ ఉంది. సినిమాకే స్టోరీ హైలెట్ గా నిలుస్తోంది. అదేవిధంగా ఇంటర్నల్ గా సినిమాలో ఎంతవరకు రాని ఒక యూనిక్ స్క్రీన్ ప్లే ఉంటుంది. ఈ సినిమా క్లైమాక్స్ ప్రేక్షకులను థ్రిల్‌ చేస్తుంది.

  సినిమాలో నా క్యారెక్టర్ ఏంటంటే

  సినిమాలో నా క్యారెక్టర్ ఏంటంటే

  అమావాస్య చిత్రంలో నేను క‌ర‌ణ్ అనే పాత్ర‌లో క‌న‌ప‌డ‌తాను. న‌ర్గీస్ ఫ‌క్రీ అహానా అనే అమ్మాయి పాత్ర‌లో న‌టించింది. నేను న‌ర్గిస్‌ను పెళ్లి చేసుకుంటాన‌ని చెప్పిన‌ప్పుడు ఆమె వీకెండ్‌లో స‌మ్మ‌ర్ హౌస్‌కి వెళ్లాల‌ని అంటుంది. కానీ హీరోకి ఆ ఇంటికి వెళ్ల‌డం ఇష్టం ఉండ‌దు. అలాంటి స‌మయంలో వారు ఆ ఇంటికి ఎలా వెళ్లారు? అక్క‌డ వారికి ఎలాంటి ప‌రిస్థితులు ఎదురయ్యాయ‌నేదే సినిమా. ఆ వీకెండ్‌లో అమావాస్య రాత్రి ఈవిల్ ఏం చేసింద‌నేదే సినిమా.ఈ సినిమా హిందీ మరియు తెలుగులో విడుదల కాబోతుంది.

  రెండు భాషల్లో షూట్ చేశాం

  రెండు భాషల్లో షూట్ చేశాం

  అమావాస్య సినిమాను రెండు భాష‌ల్లో చిత్రీక‌రించాం. ముఖ్యంగా క్లోజ‌ప్ షాట్స్‌ను తెలుగులో చిత్రీక‌రించాం. ఎందుకంటే తెలుగు సినిమాకు నా తొలి ప్రాధాన్య‌త ఎప్పుడూ ఉంటుంది. నర్గీస్ ఫక్రీ చాలా బాగా చేసింది. తను హార్డ్ వర్కర్. ప్రతి సీన్ చేసే ముందు, ఆ సీన్ లోని సోల్ ను పట్టుకొని యాక్ట్ చెయ్యటానికి ట్రై చేసేది. సినిమా పట్ల తనకున్న డెడికేషన్ చాలా గొప్పది.

  మీ డైరెక్టర్ గురించి చెప్పండి?

  మీ డైరెక్టర్ గురించి చెప్పండి?

  భూషణ్ పటేల్‌ హరర్ ఫిల్మ్ స్పెషలిస్ట్. పైగా ఈ సారి కథనే చాలా కొత్తగా రాసారు. ఇక ఆయన ఇప్పటివరకూ తీసిన 1920 ఈవిల్ రిటర్న్స్, రాగిణి ఎం ఎం ఎస్ ,అలోన్ సినిమాలు హర్రర్ సినిమాలే. ఒక హారర్ సినిమాకు ఏమి కావాలో ఆయనకు బాగా తెలుసు. ఈ జోనర్ అంటే ఆయనకు బాగా ఇష్టం. ఆయన చూసి నాక్కూడా ఈ జోనర్ పై ఇష్టం పెరిగింది. ఇప్పుడు ప్రతి హారర్ ఫిల్మ్ చూస్తున్నాను.

  English summary
  Sachin Joshi's latest movie is Amavasya. Directed by Bhushan Patel. Nargis Fackri is the lead heroine. This movie set to release on February 8th.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X