»   » రెజీనా లవ్ అఫైర్‌పై సాయిధరమ్ తేజ్ షాకింగ్ కామెంట్.. ఏమన్నాడంటే..

రెజీనా లవ్ అఫైర్‌పై సాయిధరమ్ తేజ్ షాకింగ్ కామెంట్.. ఏమన్నాడంటే..

Posted By:
Subscribe to Filmibeat Telugu
Sai Dharam Tej Responds On Love Affair With Regina

నాలుగు వరుస ఫ్లాప్‌ల తర్వాత సాయిధరమ్ తేజ్ నటించిన చిత్రం ఇంటిలిజెంట్. జవాన్ చిత్రం ఆశించినంత మేరకు బాక్సాఫీస్ వద్ద స్పందన కనిపించలేదు. ఈ నేపథ్యంలో వీవీ వినాయక్, సీ కల్యాణ్ కాంబినేషన్‌లో రూపొందిన చిత్రంతో సాయి మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకొనేందుకు సిద్ధమయ్యాడు. నటసింహా బాలకృష్ణ రిలీజ్ చేసిన ఈ చిత్రం టీజర్ కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది.అలాగే యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ చిత్రంలోని పాటల్ని రిలీజ్ చేయడం తో సినిమా పై భారీ అంచనాలు వున్నాయి.అందరి అంచనాలకు రీచ్ అయ్యే విధంగా ఇంటిలిజెంట్ సినిమా రూపొందిందని టాక్ వినిపిస్తుంది. ఈ నేపథ్యంలో సాయిధరమ్ తేజ్ మీడియాతో మాట్లాడారు.. సాయిధరమ్ తేజ్ వెల్లడించిన విషయాలు ఆయన మాటల్లోనే..

ఇంటిలిజెంట్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా

ఇంటిలిజెంట్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా

ఇంటిలిజెంట్ చిత్రంలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ పాత్రను పోషిస్తున్నాను. పాత్ర స్వభావరీత్యా చిన్నతనం నుంచి నేను ఓ కంఫర్ట్ జోన్ నుంచి బయటకు రాలేని వ్యక్తిని. కొన్ని పరిస్థితుల కారణంగా కుటుంబ సభ్యులు, ఫ్రెండ్స్, టీచర్లు వలన నేను ఆ కంఫర్ట్ జోన్ నుంచి బయటకు రావాల్సి వస్తుంది. నా ఇంటిలిజెన్స్‌తో నేను ఆ పరిస్థితులను ఎలా ఎదుర్కొన్నాను అనేది ప్రధాన కథ.

 ఓ మంచి సందేశంతో

ఓ మంచి సందేశంతో

ఇంటిలిజెంట్ చిత్రంలో ఓ సందేశం ఉంది. మనకు ఎవరైనా సహాయం చేస్తే మనం మరచిపోకూడదు. వాళ్లకు అవసరం ఏదైనా ఏర్పడినపుడు మనం అండగా ఉండాలనే మంచి పాయింట్ ఉంటుంది. మనకోసం హెల్ప్ చేసే కోసం నేను ఏమి చేశాననేది పాయింట్.

 కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా

కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా

కథలో గానీ కొత్త పాయింట్ ఏమీ లేదు. క్యారెక్టర్ కొత్తగా ఉండదు. సినిమా మొత్తం ఓ కమర్షియల్‌గా ఉంటుంది ఇంటిలిజెంట్. ప్రతీ ఒక్కరు ఎంటర్‌టైన్ అవుతారనే నమ్మకం ఉంది. సక్సెస్ అవుతుందనే ప్రతీ సినిమాను చేస్తాం. హిట్ అవుతుందా? లేదా అనేది ప్రేక్షకులు నిర్ధారిస్తారు.

 వినాయక్ అవకాశం ఇవ్వడం

వినాయక్ అవకాశం ఇవ్వడం

చిరంజీవి కమ్ బ్యాక్ మూవీ ఖైదీ నంబర్ 150 చిత్రం తర్వాత వినాయక్ నాకు సినిమా చేసే అవకాశాన్ని ఆయన ఇవ్వడం నేను గొప్పగా ఫీలవుతున్నాను. అందుకు వినాయక్ గారికి ధన్యవాదాలు. ఆయనతో పనిచేయడం చాలా ఈజీగా ఉంటుంది. ప్రతీ ఒక్కరిని ఆయన కంఫర్ట్‌లో ఉంచుతాడు. ప్రతీ విషయాన్ని చిరునవ్వుతో వివరిస్తారు. వినాయక్ దర్శకత్వంలో నటించాలన్న కోరికతోపాటు కథ కూడా నచ్చడంతో ఇంటెలిజెన్స్ చిత్రంలో నటించాను. ధర్మభాయ్.కామ్ అనే కాన్సెప్ట్ తెరపైన చూడాల్సిందే.

 నాలుగు ఫ్లాప్‌ల తర్వాత

నాలుగు ఫ్లాప్‌ల తర్వాత

వరుసగా నాలుగు ఫ్లాప్ రావడం వెనుక కారణాలు ఆలోచించాను. ఆ తర్వాతనే వినాయక్‌తో ఇంటిలిజెన్స్ చేశాను. కథ, కథనాలు సరిగ్గా వర్కవుట్ కాలేదు. కథలు మాకు నచ్చాయి గానీ ప్రేక్షకులకు నచ్చేలా తీయలేకపోవడం మా వైఫల్యం. ఇందులో ఎవరినీ తప్పు పట్టలేం. సినిమా అనేది టీమ్ వర్క్.

కరుణాకరన్‌‌తో లవ్‌స్టోరీ

కరుణాకరన్‌‌తో లవ్‌స్టోరీ

కరుణాకరన్ దర్శకత్వంలో లవ్ స్టోరి చేస్తున్నాను. నా వద్దకు అందరూ మాస్, కమర్షియల్ కథలనే చెబుతున్నారు. కథ నచ్చితేనే సినిమా చేస్తాను. కథ, డైరెక్టర్‌కు ఓకే చెప్పిన తర్వాత ప్రొడక్షన్‌లో గానీ, షూటింగ్‌లో జోక్యం చేసుకోను. ఫలానా హీరోయిన్ పెట్టమని నేను అడుగను. మైండ్ గేమ్ అనుకొన్న జవాన్ నిరాశపరిచింది. మైండ్ గేమ్ కథతో వర్కవుట్ కాలేదు.

 వరుణ్‌తో పోటీ పడటం

వరుణ్‌తో పోటీ పడటం

వరుణ్‌ తేజ్, నా సినిమా ఒకేసారి రిలీజ్ కావడం అనేది యాదృచ్చికంగా జరిగింది. ఒకేసారి రిలీజ్ కాకుండా వరుణ్, నేను కలిసి చర్చించుకొన్నాం. కానీ మా చేతుల్లో లేనిది. నిర్మాతల తీసుకోవాల్సిన విషయం. సినిమా బాగుంటే ఎలాంటి ఇబ్బంది ఉండదు.

బాలయ్యకు, ప్రభాస్‌కు థ్యాంక్స్

బాలయ్యకు, ప్రభాస్‌కు థ్యాంక్స్

ఇంటిలిజెంట్ సినిమా పాటలను ఆవిష్కరించాడనికి వచ్చిన బాలకృష్ణ, ప్రభాస్ ధన్యవాదాలు. బాలయ్య నన్ను దీవించడం ఆనందంగా ఉంది. మెగా ఫ్యాన్స్‌ను కూడా బాలయ్య ఎంకరేజ్ చేయడం, అలాగే నందమూరి ఫ్యాన్స్‌ను కూడా సినిమా చేయాలని అడగడం బాలకృష్ణ గొప్పతనానికి నిదర్శనం. అలాగే బాహుబలి సినిమాతో దేశవ్యాప్తంగా ఆదరణ చూరగొన్న ప్రభాస్ రావడం చాలా ఆనందంగా ఉంది.

 లావణ్య త్రిపాఠి గురించి

లావణ్య త్రిపాఠి గురించి

లావణ్య త్రిపాఠి వెరీ స్వీట్ గర్ల్. నేను చాలా మంది హీరోయిన్లతో పనిచేశాను. లావణ్యకు సెన్సాఫ్ హ్యూమర్ ఉంది. కామెడీ సీన్లు చేసేటప్పడు ఎంజాయ్ చేశాం. ఆఫ్‌స్క్రీన్‌లోనూ జోవియల్‌గా ఉంటుంది. దర్శకుల కోరిక మేరకే సాంగ్స్ రీమిక్స్ చేస్తున్నాను. మామయ్య పాటలు రీమిక్స్ బాధ్యతతో చేశాను.

ఫ్యాన్స్ రెస్పాన్ షాకింగ్

ఫ్యాన్స్ రెస్పాన్ షాకింగ్

రాజమండ్రిలో ప్రిరిలీజ్‌కు వచ్చిన అభిమానులు చూపిన ప్రేమ, అప్యాయతలు షాక్ గురిచేశాయి. ఫ్యాన్స్‌కు లేఖలు రాయడం ఎప్పుడూ చేస్తున్నాను. గత చిత్రాల విషయాల్లోకి అదే జరిగింది. నా ప్రీరిలీజ్ ఫంక్షన్‌కు వచ్చిన అభిమానులకు లేఖ రాయాలనిపించడంతో ఆ పని చేశాను.

 రెజీనా కసండ్రాతో అఫైర్ గురించి

రెజీనా కసండ్రాతో అఫైర్ గురించి

ఓ హీరో కారణంగా నా కెరీర్ పాడైపోయిందని ఇటీవల రెజీనా కసాండ్రా చేసిన వ్యాఖ్యలపై సాయిధరమ్ తేజ్ స్పందించడానికి నిరాకరించారు. నాకు క్లోజ్ ఫ్రెండ్ అయినంత మాత్రనా ఆమె వ్యక్తిగత విషయంపై నేను కామెంట్ చేయడం తగదు అని సాయిధరమ్ తేజ్ అన్నారు. గతంలో సాయిధరమ్ తేజ్, రెజీనా మధ్య ప్రేమ వ్యవహారం జరిగిందని, అది పెళ్లి వరకు వచ్చి ఆగిపోయిందనే ఓ గాసిప్స్ అప్పట్లో హడావిడి చేసాయి. ఈ నేపథ్యంలో రెజీనా తన లవ్ అఫైర్ గురించి వ్యాఖ్యానించింది.

English summary
Sai Dharam Tej is currently gearing up for the release of Intelligent. A VV Vinayak directorial, it is slated to hit screens this week and has created a buzz amongst fans courtesy its intriguing poster. The film’s pre-release was held Feb 4th at Rajamaudry. The movie set to release on 9th february. In this occassion, Vinayak spoke to Telugu Filmibeat exclusively.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu