twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Prabhas హీరో.. నేను ఆయనకు ఫ్యాన్‌ను.. 3 కాదు 30 సినిమాలు.. హీరో సంతోష్ శోభన్ ఎమోషనల్

    |

    స్వర్గీయ దర్శకుడు, వర్షం ఫేమ్ శోభన్ కుమారుడిగా పేపర్ బాయ్, ఏక్ మినీ కథ, మంచి రోజులు వచ్చాయి లాంటి విజయాలతో యువ హీరో సంతోష్ శోభన్ దూసుకెళ్తున్నాడు. ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్ బ్యానర్‌లో ప్రియా భవానీ శంకర్ హీరోయిన్‌గా దర్శకుడు అనిల్ కమార్ రూపొందించిన కళ్యాణం కమనీయం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. జనవరి 14న రిలీజ్ సందర్భంగా సంతోష్ శోభన్ మీడియాతో మాట్లాడుతూ..

    మా నాన్న దర్శకత్వంలో

    మా నాన్న దర్శకత్వంలో


    సంక్రాంతి పండగకు సినిమా రిలీజ్ చేసుకోవాలనేది నా కల. ఆ కోరికను కళ్యాణం కమనీయం సినిమాతో తీరిపోతున్నది. ఈ ఏడాది చిరంజీవి, బాలకృష్ణ లాంటి అగ్ర హీరోల సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. తెలుగు సినిమా పరిశ్రమకు ఈ సంక్రాంతి చాలా పెద్దదిగా మారింది. సంక్రాంతి సీజన్‌లో వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య, వారసుడు సినిమాలను చూస్తాను. ఈ సంక్రాంతికి కళ్యాణం కమనీయం స్పెషల్ అవుతుంది. మా నాన్న శోభన్ దర్శకత్వంలో ప్రభాస్ అన్న నటించిన వర్షం సినిమా సంక్రాంతికే రిలీజ్ అయింది. మా సినిమా కూడా రిలీజ్ కావడం యాదృచ్ఛికమే అయినప్పటికీ.. మాకు కలిసి వచ్చింది అని సంతోష్ శోభన్ అన్నారు.

    కళ్యాణం కమనీయం సినిమా ఎలా ప్రారంభమైందంటే?

    కళ్యాణం కమనీయం సినిమా ఎలా ప్రారంభమైందంటే?


    కళ్యాణం కమనీయం సహ నిర్మాత అజయ్ ద్వారా ఈ సినిమా దర్శకుడు అనిల్ కుమార్ పరిచయం అయ్యారు. ఏక్ మినీ కథ సినిమా షూట్‌లో ఆయన చెప్పిన కథ నాకు బాగా నచ్చింది. ప్రతీ ఒక్కరు ఈ సినిమాన తమకు తాము కనెక్ట్ చేసుకొంటారు. ఇలాంటి స్టోరీలు చాలా రేర్‌గా వస్తుంటాయి. అందుకే కథ నచ్చగానే చేయడానికి ఒప్పేసుకొన్నాను. దాంతో కళ్యాణం కమనీయం సినిమా నా కెరీర్‌లో భాగమైంది అని సంతోష్ శోభన్ తెలిపారు.

     సాంకేతిక విభాగాల గురించి

    సాంకేతిక విభాగాల గురించి


    కళ్యాణం కమనీయం సినిమాలో కథకు బ్రేక్ వేసేలా పాటలు ఉండవు. కథ, పాటలు కలిసి ప్రేక్షకుడిని ముందుకు తీసుకెళ్తాయి. మ్యూజిక్ డైరెక్టర్ శ్రావణ్ భరద్వాజ్ మంచి సంగీతం అందించారు. కార్తీక్ ఘట్టమనేని సినిమాటోగ్రఫి ఈ సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్. అన్ని విభాగాలు కలయిక చాలా చక్కగా కుదిరింది అని సంతోష్ శోభన్ చెప్పారు.

    నా ఫ్యామిలీ ప్రొడక్షన్ లాంటిది

    నా ఫ్యామిలీ ప్రొడక్షన్ లాంటిది


    యూవీ క్రియేషన్స్ నిర్మాణ సంస్థ నా ఫ్యామిలీ ప్రొడక్షన్ లాంటింది. ఈ బ్యానర్‌లో మూడు సినిమాలు చేశాను. ఇక ముందు 30 సినిమాలు చేయడానికైనా సిద్దం. నా కెరీర్‌లో మారుతి, మేర్లపాక గాంధీ లాంటి దర్శకులతో పనిచేయడం ఓ అదృష్టం. వాళ్ల నుంచి చాలా నేర్చుకొన్నాను. అలానే దర్శకుడు అనిల్ వద్ద నుంచి కూడా అంతే నేర్చుకొన్నాను అని సంతోష్ శోభన్ చెప్పారు.

     ప్రభాస్ బిగ్గెస్ట్ స్టార్.. ఆయన సపోర్ట్ అంటూ ఎమోషనల్

    ప్రభాస్ బిగ్గెస్ట్ స్టార్.. ఆయన సపోర్ట్ అంటూ ఎమోషనల్


    రెబల్ స్టార్ ప్రభాస్ నాకు ఇచ్చే ప్రోత్సాహం, సపోర్ట్ మాటలు చాలవు. ఇండియాలోనే ప్రభాస్ బిగ్గెస్ట్ స్టార్. నా గత సినిమాలకు వెన్నంటి నిలిచి.. ప్రమోషన్స్‌కు అండగా నిలిచారు. ఈ సినిమా పాటను కూడా రిలీజ్ చేస్తున్నారు. ప్రభాస్ హీరో.. నేను ఆయనకు ఫ్యాన్‌ను. మా మధ్య హీరో, ఫ్యాన్ మధ్య అనుబంధం. ప్రభాస్ ప్రేమ దక్కినందుకు ఎంతో అదృష్టం ఉండాలి అని సంతోష్ శోభన్ అన్నారు

    English summary
    Paper Boy, Ek Mini Katha and Manchi Rojulochaie fame and young hero Santosh Soban proved that he is a compelling actor. He is now gearing up for the release of 'Kalyanam Kamaneeyam'. The film stars Priya Bhavani Shankar as the heroine and will hit the screens on January 14. UV Concepts has produced it. Anil Kumar Aalla directed the movie.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X