twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మా నాన్న చేసిన పనితో విపరీతమైన టెన్షన్.. అమ్మ స్టయిల్‌తో దొరసానిగా.. శివాత్మిక

    |

    ఆనంద్ దేవరకొండ, శివాత్మిక హీరో హీరోయిన్లుగా పరిచయం చేస్తూ మధుర ఎంటర్ టైన్మెంట్, బిగ్ బెన్ సినిమాలు సంయుక్తంగా నిర్మిస్తున్న మూవీ 'దొరసాని' జులై 12న గ్రాండ్ గా రిలీజ్ అవుతున్న ఈ మూవీ ట్రైలర్, పాటలతోప్రేక్షకుల మనసులో ప్రత్యేకమైన ముద్రను వేసింది. కేవీఆర్ దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆదివారం జరుగనుంది. దొరసాని ప్రమోషన్స్‌లో భాగంగా హీరోయిన్ శివాత్మిక మీడియాతో మాట్లాడారు. దొరసాని గురించి శివాత్మిక చెప్పిన మాటలు ఆమె మాటల్లోనే..

    నాకు ఊహ తెలిసినప్పటి నుంచే

    నాకు ఊహ తెలిసినప్పటి నుంచే

    షూటింగ్స్ అనేవి నా ఊహా తెలిసినప్పటి నుంచి నా జీవితంలో భాగం అయ్యాయి. స్కూల్ కన్నా ఎక్కువుగా షూటింగ్‌లోనే ఉండే దానిని. నేను హీరోయిన్ అవుతానంటే అందుకేనేమో ఇంట్లో ఎవరూ పెద్దగా ఆశ్చర్య పడలేదు. కానీ

    దొరసాని రిలీజ్ టైం దగ్గర పడుతున్నప్పుడు మాత్రం ఇంట్లో సందడి ఎక్కువగా కనిపిస్తున్నది. దొరసాని కథ వింటున్నప్పుడు నా పాత్ర బాగా నచ్చింది.

    దర్శకుడు కథ చెప్పిన విధానంతో

    దర్శకుడు కథ చెప్పిన విధానంతో

    దర్శకుడు మహేంద్ర ఆ క్యారెక్టర్‌ను వివరించిన విధానం నన్ను బాగా ఇంప్రెస్ చేసింది. మొత్తం నాలుగు గంటల సేపు కథ చెప్పారు.
    ఆ తర్వాత నన్ను ఆనంద్‌ను కలిపి ఆడిషన్ చేశారు. ఆడిషన్స్ కూడా అయ్యాక రెండు నెలలు నాకు ఎలాంటి కబురు అందలేదు. ఆ టైం లో ఆ పాత్ర కోసం నేను ఎదురుచూసాను.
    నేనే అని తెలిసాక చాలా ఎగ్జైట్ అయ్యాను అని శివాత్మిక అన్నారు.

    ఆధునిక యువతిగా కనిపించడం

    ఆధునిక యువతిగా కనిపించడం

    ప్రేమకథలకు పాత, కొత్త అలాంటి తేడాలు ఉండవు అని నమ్ముతాను. ఆధునిక యువతిగా కనిపించాలని అనుకోలేదు. పిరియాడిక్ మూవీస్ అంటే బాగా ఇష్టపడతాను.
    ఈ ప్రేమకథ లో కనిపించే స్వచ్ఛత నన్ను బాగా ఆకర్షించింది. అందుకే నేను చాలా ఇష్టపడి చేశాను. నేను సంజయ్ లీలా బన్సాలి సినిమాలకు పెద్ద ఫ్యాన్. అలాంటి కథతోనే ఇంట్రడ్యూస్ అవడం చాలా ఆనందంగా ఉంది.

    కథతోనే ముందుకు

    కథతోనే ముందుకు

    దర్శకుడు కేవీఆర్ మహేంద్ర చాలా ఖచ్చితంగా ఉంటారు.
    పాత్రల కోసం రాసుకున్న సన్నివేశాలు ఏమీ లేవు. ఆయన కథతోనే మమ్మల్ని ముందుకు తీసుకెళ్ళారు. ఆయన సన్నివేశాలను బాగా ఎక్స్‌ప్లెయిన్

    చేస్తారు. ఆయన చెప్పిన దాన్ని చేసుకొని చేసుకుంటూ వెళితే చాలు. మొదటి సన్నివేశానికి చాలా టెన్షన్ పడ్డాను, కానీ దర్శకుడు ఇచ్చిన కాన్ఫిడెన్స్ నన్ను నడిపించింది.

     80 దశకాల్లో జరిగే కథలో అమ్మను

    80 దశకాల్లో జరిగే కథలో అమ్మను

    దొరసాని స్టోరీ 80 దశకాల్లో జరిగే కథ అప్పటి కట్టు బొట్టు గురించి నాకు పెద్దగా తెలియదు. తలంబ్రాలు సినిమా సమయంలో అమ్మ అలంకరణ, స్టైల్‌ను రిఫరెన్స్ లా తీసుకున్నాను. అచ్చం అమ్మాలాగే ఉన్నావని షూటింగ్ లోకేషన్స్‌లో అంటుంటే చాలా

    హ్యాపీగా అనిపించింది. అమ్మ నాకు ఒకటే చెప్పేవారు ఏ క్యారెక్టర్ చేస్తున్నా ఇన్వాల్వ్ అయి చేయమని చెప్పేవారు.
    అమ్మ నాకు ఎప్పుడూ ఒక ఎనర్జీ సోర్స్ లాగా ఉంటుంది.

    నాన్న రాజశేఖర్ ఇమేజ్‌తో

    నాన్న రాజశేఖర్ ఇమేజ్‌తో

    నాన్న రాజశేఖర్‌కు ఉన్న ఇమేజ్‌ను చిన్నతనం నుంచి చూస్తూ పెరిగాను. ఈ మధ్యనే కల్కి రిలీజై ఆ సినిమా తెచ్చిన సందండి ఇంట్లో తగ్గకముందే నా సినిమా రిలీజ్ కి వచ్చేసింది. నా సినిమా గురించి నాన్న అందరికీ గొప్పగా చెబుతుంటే చాలా

    ఆనందంగా ఒక పక్క టెన్షన్‌గా కూడా ఉంది. నాన్న ఇమేజ్ తెచ్చే ఒత్తిడి కంటే ఆనందమే ఎక్కువ. డైరెక్టర్స్ హీరో గానే నాన్న ఉన్నారు. నేను అదే ఫాలో అవుతున్నాను.

    English summary
    Shivatmika Rajasekhar and Anand Devarakonda's Dorasani Set to release on July 12th. KVR Mahendra is director. Madhura Sridhar is the producer for the movie. As part of the promotion, Shivatmika Rajasekhar Speak to media.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X