For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  30 ఏళ్ల క్రితం ఆదిత్య 369కు కలిగిన ఎక్సైట్‌మెంటే యశోదకు, పాన్ ఇండియాగా ఎందుకంటే.. నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్

  |

  ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ శ్రీదేవీ మూవీస్ బ్యానర్‌పై ఆదిత్య 369, జంటిల్మెన్, సమ్మోహనం లాంటి సినిమాలను తెలుగు పరిశ్రమకు అందించిన నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మాణ సారథ్యంలో దక్షిణాదిలో స్టార్ హీరోయిన్ సమంత రుత్ ప్రభు నటించిన యశోద చిత్రం నవంబర్ 11వ తేదీన రిలీజ్‌కు సిద్దమైంది. ఈ సినిమా టీజర్, ట్రైలర్ భారీ స్పందనను కూడగట్టుకోవడంతో యశోద సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సందర్భంగా నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ తెలుగు ఫిల్మీబీట్‌తో మాట్లాడుతూ...

  ఎస్పీ బాలు ఆశీస్సులు

  ఎస్పీ బాలు ఆశీస్సులు

  సమ్మోహనం సినిమా తర్వాత నేను చేస్తున్న డైరెక్ట్ సినిమా యశోద. ఈ సినిమాకు మా అంకుల్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆశీస్సులు ఉన్నాయి. ఆయన మరణించిన సమయంలో చరణ్‌కు సపోర్ట్‌గా చెన్నైలో ఉన్నాను. ఆయనకు సంబంధించిన క్రతువులు జరిపిస్తున్న సమయంలో నాకు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా ఉండే సెంథిల్ ఫోన్ చేశారు. మంచి కథ ఉంది వింటారా? అని అడిగితే.. సరే అన్నాను. అయితే అప్పటికే ఆ కథ వేరే నిర్మాతకు చెప్పి కమిట్ అయ్యారు. అయినా సరే అని విన్నాను. అయితే ఆ నిర్మాత చేయడానికి వెనుకాడటంతో నన్ను సంప్రదించారు.

  కరోనా థర్డ్ వేవ్‌లో

  కరోనా థర్డ్ వేవ్‌లో

  కరోనావైరస్ థర్డ్ వేవ్‌లో ఈ కథను సాయంత్రం అలా వాకింగ్ చేస్తూ హియర్ ఫోన్స్ పెట్టుకొని.. హరి, హరీష్ చెప్పగా మరోసారి విన్నాను. కథ, పాయింట్ నన్ను బాగా ఎక్సైట్ చేసింది. యశోద సినిమాకు ఇద్దరు డైరెక్టర్లు కావడంతో తొలుత ఆశ్చర్యానికి లోనయ్యాను. ఇద్దరిలో ఎవరు డైరెక్ట్ చేస్తారంటే.. ఒకరు హృదయమైతే.. మరొకరం ఆత్మ అని చెప్పారని శివలెంక కృష్ణ ప్రసాద్ తెలిపారు.అని శివలెంక కృష్ణ ప్రసాద్ అన్నారు.

  40 నిమిషాలు కథ విని.. ఒకే నిమిషంలో సమంత ఒకే

  40 నిమిషాలు కథ విని.. ఒకే నిమిషంలో సమంత ఒకే

  ఆ తర్వాత కథ డిమాండ్ చేస్తుండటంతో చాలా మార్పులు చేసుకొంటూ వెళ్లి.. పెద్ద కథగా మార్చాం. కథ పూర్తయిన తర్వాత సమంత అయితే బాగుంటుందని అనుకొన్నాం. అప్పటికే శాకుంతలం సినిమా పూర్తి అయింది. ఆ తర్వాత సమంత సినిమాలు చేస్తారా? లేదా అనే సందేహంతో.. ఆమె మేనేజర్ మహేంద్రకు కాల్ చేసి మంచి కథ ఉందని చెప్పాం. దాంతో ఆయన సానుకూలంగా స్పందిస్తూ.. సమంత గారు.. గోవాలో ఉన్నారు. వచ్చాక కథ చెప్పండి అన్నారు. ఆ తర్వాత సమంత గోవా నుంచి రావడం.. డైరెక్టర్లిద్దరూ వెళ్లి 40 నిమిషాలు కథ చెప్పడం.. వెంటనే ఆమె ఓకే చేయడంతో యశోద సినిమా మొదలైంది.

  వరలక్ష్మీ శరత్ కుమార్, ఇతర నటీనటుల గురించి

  వరలక్ష్మీ శరత్ కుమార్, ఇతర నటీనటుల గురించి

  సమంత ఫైనల్ అయిన తర్వాత మంచి ప్రాధాన్యం ఉన్న పాత్ర కోసం కొంత మంది హీరోయిన్లను అడిగాం. అయితే సమంత పక్కన రోల్ అంటే కొందరు ఒప్పుకోలేదు. అయితే వరలక్ష్మీ శరత్ కుమార్‌కు చెప్పడంతో.. పాయింట్ బాగుంది. ఇలా కూడా ఆలోచిస్తారా అని అన్నారు. కథ విన్న మరుక్షణమే వెంటనే చేయడానికి ఒప్పుకొన్నారు. ఉన్ని ముకుందన్, రావు రమేష్, మురళీ శర్మ లాంటి టాలెంటెడ్ ఆర్టిస్టును ఎంపిక చేసుకొన్నాం అని కృష్ణ ప్రసాద్ తెలిపారు.

  భారీగా రెండు సెట్స్ వేసి...

  భారీగా రెండు సెట్స్ వేసి...

  యశోద సినిమా హాస్పిటల్, కార్పోరేట్ హోటల్ నేపథ్యంలో సాగే కథ కావడంతో.. సెట్స్ వేయాలని నిర్ణయించాం. ఆర్ట్ డైరెక్టర్ అశోక్ రెండు అద్బుతమైన సెట్స్ వేశారు. మేము హాస్పిటల్‌లో సినిమా తీయవచ్చు. కానీ కొన్నిసార్లు షూటింగులకు అంతరాయం అవుతుంది. అలాగే కోవిడ్ భయం ఉండటంతో హాస్పిటల్‌లో షూట్ చేయవద్దని అనుకొన్నాం. అలా రెండు పెద్ద సెట్లు వేయాల్సి వచ్చింది. మేము అనుకొన్న బడ్జెట్‌కు 10 శాతం పెరిగింది. కోవిడ్ తర్వాత ధరలు పెరిగిపోయాయి. దాంతో బడ్జెట్ భారీగా పెరిగింది.

  30 ఏళ్ల క్రితం ఆదిత్య 369

  30 ఏళ్ల క్రితం ఆదిత్య 369

  యశోద సినిమా ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతుండగా.. కేజీఎఫ్2, పుష్ప, RRR లాంటి సినిమాలు ఇతర భాషల్లోకి డబ్ అవుతుండటంతో మాకు ఈ సినిమాను పలు భాషల్లో రిలీజ్ చేయాలని అనుకొన్నాం. సరోగసి బ్యాక్‌డ్రాప్‌తో సాగే సినిమా ఇది. కథ చాలా కొత్తగా ఉంటుంది. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ అనుక్షణం ప్రేక్షకుడిని ఆకట్టుకొంటాయి. 30 ఏళ్ల క్రితం ఆదిత్య 369 సినిమా కథ విన్నప్పుడు ఎంత ఎక్సైట్‌మెంట్ కలిగిందో.. యశోద సినిమా కథ విన్నప్పుడు అంతే ఉత్సాహం కలిగింది అని శివలెంక కృష్ణ ప్రసాద్ తెలిపారు.

  English summary
  Producer Sivalenka Krishna Prasad's Yashoda is set to release on November 11th. He speaks about the movie and Samantha Ruth Prabhu performance to the Telugu Filmibeat.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X