twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Yashoda సమంతపై నమ్మకం.. కథలో దమ్ముంది.. యశోద గురించి నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్

    |

    ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ శ్రీదేవి మూవీస్ బ్యానర్‌పై నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మించిన చిత్రం యశోద. సమంత రుత్ ప్రభు, వరలక్ష్మీ శరత్ కుమార్, మురళీ శర్మ, రావు రమేశ్, సంపత్ రాజ్, ఉన్ని ముకుందన్ నటించిన ఈ చిత్రం నవంబర్ 11వ తేదీన రిలీజ్ అవుతున్నది. హరీ, హరీష్ దర్శక ద్వయం రూపొందించిన ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా రిలీజ్ నేపథ్యంలో నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ..

    సమంత భుజాన మోసింది..

    సమంత భుజాన మోసింది..


    యశోద సినిమా కోసం సమంత తీసుకొన్న జాగ్రత్తలు, కమిట్‌మెంట్, డెడికేషన్ హ్యాట్సాఫ్. కథ ఒప్పుకొన్న దగ్గరి నుంచి ప్రతీ విషయంలో ఆమె చోరవ తీసుకొన్నారు. సెట్స్‌లో అన్ని విషయాల్లోను చర్చలు జరిపేది. మంచి, చెడులను విశ్లేషించేది. కేవలం సినిమా ఒప్పుకొన్నామని.. నటించి వెళ్లడం కాకుండా సినిమాను పూర్తి స్థాయిలో తన భుజాన మోసింది. ఆమె అందించిన సహకారం మాటల్లో చెప్పలేనది అని శివలెంక కృష్ణ ప్రసాద్ తెలిపారు.

    నాకు పెద్ద కూతురు దొరికింది అంటూ

    నాకు పెద్ద కూతురు దొరికింది అంటూ


    యశోద సినిమా ప్రయాణంలో సమంత రూపంలో నాకు పెద్ద కూతురు దొరికిందనే ఫీలింగ్ కలిగింది. ఆమె హీరోయిన్‌గా కాకుండా ప్రతీ విషయంలో బాధ్యతలను భుజానికి ఎత్తుకొన్నది. శాకుంతలం సినిమా పూర్తి కావడంతో మా సినిమాపై పూర్తిగా ఫోకస్ పెట్టారు. షూటింగు సమయంలో ప్రతీ ఫ్రేమ్‌ను చూసుకొన్ని సన్నివేశాలను హైలెట్ చేసేలా జాగ్రత్తలు తీసుకొన్నారు. సమంత ఈ సినిమాను సొంత సినిమాగా భావించింది. అందుకే నేను నా పెద్ద కూతురనే భావోద్వేగం నాలో కలిగింది అని శివలెంక కృష్ణ ప్రసాద్ చెప్పారు.

    హీరోలకు ఉన్న క్రేజ్ సమంతకు

    హీరోలకు ఉన్న క్రేజ్ సమంతకు


    యశోద సినిమాకు సమంత రుత్ ప్రభు హీరోనే. హీరోలకు ఉన్న స్థాయి, క్రేజ్‌ ఆమెకు ఉంది. కాబట్టే ఆమె సినిమాలను దక్షిణాది వ్యాప్తంగా ఆదరిస్తున్నారు. సమంత మీద ఉన్న నమ్మకం, కథలో ఉండే దమ్ముతోనే యశోద సినిమాను రూపొందించాం. ఖర్చుకు ఏ మాత్రం వెనుకాడకుండా సినిమా ద్వారా ప్రేక్షకుడికి గొప్ప అనుభూతిని పంచాలని అనుకొన్నాం అని శివలెంక కృష్ణ ప్రసాద్ తెలిపారు.

     ఆర్ట్ డైరెక్టర్ అశోక్‌కు సారీ

    ఆర్ట్ డైరెక్టర్ అశోక్‌కు సారీ


    యశోద సినిమా షూటింగ్‌కు ఎలాంటి అడ్డంకులు ఉండకూడదనే రెండు భారీ సెట్లు వేయించాం. దాదాపు 95 రోజులు షూట్ చేశాం. ఆర్టిస్టులు కంఫర్ట్ ఉంటుంది. కరోనా భయాలను కూడా దృష్టిలో పెట్టుకొన్నాం. మా ఆలోచనకు అనుగుణంగా ఆర్ట్ డైరెక్టర్ అశోక్ అద్బుతంగా సెట్స్ వేశారు. సినిమా రిలీజ్ పనుల్లో బిజీగా ఉండి.. ఆయనకు నేను థ్యాంక్స్ చెప్పుకొనే అవకాశం లేకపోయింది. గత రెండు ఇంటర్వ్యూలో నేను ఆయనకు థ్యాంక్స్ చెప్పలేదు. అందుకు నేను సారీ చెబుతున్నాను అని కృష్ణ ప్రసాద్ అన్నారు.

    చక్కటి అనుభూతిని ఇచ్చే యశోద

    చక్కటి అనుభూతిని ఇచ్చే యశోద


    యశోద కథ విషయంలో గిమ్మిక్కులు, జిమ్మికులు చేసి ప్రేక్షకుడిని ఎలాంటి ఇబ్బంది పెట్టం. చక్కగా కథ చెప్పే విషయంలో సక్సెస్ అవుతాం. థియేటర్ నుంచి ప్రేక్షకుడు బయటకు వచ్చే సమయంలో చాలా సంతృప్తిగా వస్తారు. సినిమా మంచి యాక్షన్ థ్రిల్లర్ అని కృష్ణ ప్రసాద్ వెల్లడించారు.

    English summary
    Producer Sivalenka Krishna Prasad's Yashoda is set to release on November 11th. He speaks about the movie and Samantha Ruth Prabhu performance to the Telugu Filmibeat.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X