For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

నీ వల్లే తారక్‌కి యాక్సిడెంట్ అయింది.. తారక్ చుట్టూ ఉన్న వారి వల్లే ఇదంతా..

|
Comedian Srinivas Reddy Talks About Clashes With Jr NTR || Filmibeat Telugu

తెలుగు చిత్రసీమలో నటీనటుల మధ్య మంచి రిలేషన్ షిప్ ఉంటుంది. స్టార్ హీరోలు కూడా ఇతర నటీనటులతో అత్యంత సన్నిహితంగా ఉంటూ మంచి బాండింగ్‌తో ఉంటారు. వీరిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన పేరు జూనియర్ ఎన్టీఆర్. తోటి హీరోలతో, సహా నటీనటులతో ఈయన మెలిగే తీరు అందరికీ ఆదర్శం. రాజీవ్ కనకాల, రఘు, రాఘవ, సమీర్, శ్రీనివాస్ రెడ్డి ఇలా చాలా మంది నటులతో ఎన్టీఆర్‌ చాలా క్లోజ్‌‌గా ఉండేవారు. అప్పట్లో చాలాకాలం శ్రీనివాస్ రెడ్డితో మంచి బాండింగ్ లో ఉన్న ఎన్టీఆర్ ఆ తర్వాత కాస్త తగ్గించడం గమనించాం. అయితే ఇందుకు గల కారణమేంటో కమెడియన్ శ్రీనివాస్ రెడ్డి ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.

గ్యాప్ వచ్చింది నిజమే

తనకు, ఎన్టీఆర్ కి మధ్య కాస్త గ్యాప్ వచ్చిన మాట నిజమేనని శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. అయితే అందుకు చాలా కారణాలున్నాయని తెలిపారు. పెళ్లి కావడం, పిల్లల్ని కనడంతో సమయాభావం వల్ల కొంత అలాగే వేరు వేరు సినిమాల్లో మంచి క్యారెక్టర్స్ లభించడం వల్ల ఎన్టీఆర్ సినిమాల్లో కనిపించలేక పోయానని ఆయన తెలిపారు.

ఎన్టీఆర్‌తో ప్రచారం సమయంలో..

అప్పట్లో ఎన్టీఆర్‌తో కలిసి ఎన్నికల ప్రచారానికి వెళ్ళాం. ఖమ్మంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ సభకు ఎన్టీఆర్‌తో కలిసి నేను, సమీర్, రాజీవ్ కనకాల హాజరయ్యాం. ఆ సమయంలో ఎన్టీఆర్‌తో టైమ్ పాస్ చేస్తూ బాగా ఎంజాయ్ చేసేవాడిని. ఒక్కో రోజు ఒక్కొక్కరం చొప్పున అందరం ఓ ప్రణాళిక ప్రకారం ప్రచారంలో పాల్గొన్నాం అన్నారు శ్రీనివాస్ రెడ్డి.

ఎన్టీఆర్ కారు ప్రమాదం

అప్పట్లో ప్రచారంలో భాగంగా ఖమ్మం సభ పెద్ద సక్సెస్ అయ్యింది. అయితే అప్పుడు పండుగ రావడంతో అందరం ఊళ్లకు బయలుదేరాం. తారక్ నన్ను తన కారు ఎక్కమని అన్నారు. కానీ అనుకోకుండా నా ప్లేస్‌లో వేరొకరు ఎక్కేయడంతో ఆ కారు బయల్దేరింది. నేను వేరే కారులో వెనుక వెళ్ళాను. అయితే మార్గం మధ్యలో తారక్ కారుకి యాక్సిడెంట్ అయ్యింది. దిగి చూస్తూ తరక్ గాయాలతో రక్తం కారుతూ కనిపించారు. వెంటనే తారక్ గాయాలకు నా దగ్గర ఉన్న టవల్‌ చుట్టి నేను ఉన్న కారులో ఎక్కించుకొని హాస్పిటల్ తీసుకెళ్ళాం అని చెప్పారు శ్రీనివాస్ రెడ్డి.

నీ లెగ్ పడింది.. తారక్‌కి గాయాలయ్యాయి

అయితే ఆ సందర్భంలో ఓ వ్యక్తి నా దగ్గరకొచ్చి నీ లెగ్ పడింది.. తారక్ కారు క్సిడెంట్ ప్రమాదానికి గురయ్యుందని అన్నాడు. పరోక్షంగా ఈ ప్రమాదానికి నువ్వే కారణం అన్నట్లుగా మాట్లాడాడు. దీంతో నాకు విపరీతమైన కోపం వచ్చింది. వెంటనే 'నేను రక్షించడం వల్లే తారక్ ప్రాణాలతో బయటపడ్డాడు అనేశాను'. దీన్నే తారక్ తో తప్పుగా చెప్పినట్లున్నారు. అందుకే తారక్ సినిమాల్లో అవకాశం రాలేదని భావిస్తున్నానని శ్రీనివాస్ రెడ్డి అన్నారు.

నిజమేనేమో అనుకుని

ఈ మాటను ఆయనకు వేరేలా చెప్పారేమో. ఎన్టీఆర్ చుట్టూ ఉన్న కొందరు వ్యక్తులే మా మధ్య ఈ గ్యాప్ రావడానికి కూడా కారణం అనుకుంటున్నా. ఎన్టీఆర్‌కి అలాంటి ఆలోచన లేకపోయినా చుట్టూ ఉన్న వాళ్లు ఫోర్స్ చేయడం కారణంగా ఆయన కూడా ఇది నిజమేనేమో అనుకుని ఉండొచ్చు. అందువల్లే నన్ను కట్ చేసి ఉండొచ్చు అని శ్రీనివాస్ రెడ్డి చెప్పారు.

తారక్‌తో క్లియర్ చేసుకుంటా

ఆ తర్వాత కొన్ని సందర్భాల్లో సరదా కలిసినా కూడా మా మధ్య కాస్త బాండింగ్ తగ్గిందేమోనని అనిపించింది. ఈ విషయాన్ని తారక్‌తో క్లియర్ చేసుకుంటా. ఆయనకు నేనేంటో తెలుసు. అతని క్లోజ్ ఫ్రెండ్ రాజీవ్ కనకాలకి కూడా నేనేంటో తెలుసు. వెళ్లి ఎన్టీఆర్‌తో చెప్పుకోకపోవడం వల్లే ఇలా జరిగింది అని చెప్పుకొచ్చారు శ్రీనివాస్ రెడ్డి.

Read more about: srinivas reddy interview ntr
English summary
Srinivas Reddy shares about junior ntr car accident. Some of the paersons are spreding the roumars on me. I think ntr takes it as serious Srinivas reddy says.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more