‘నన్ను బ్యాన్ చేయాలని అలాంటి కుట్ర.. గదిలోకి వెళ్లి ఏడ్చేశా’
ఇండియాస్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ఎష్ థమన్ సంగీత రంగంలో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ హీరోల చిత్రాలకు ఆయన సంగీతమే వినిపిస్తోంది. ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ - యంగ్ అండ్ సెన్సేషనల్ డైరెక్టర్ సుజీత్ కాంబినేషన్ లో వచ్చి ఓజీ చిత్రానికి థమన్ ఎలాంటి సంగీతం అందించారో అందరికీ తెలిసిందే. ప్రస్తుతం ఇండియా మొత్తం థమన్ మ్యూజికే వినిపిస్తోంది. ఓజీ చిత్రానికి ఎస్ఎస్ థమన్ అందించిన సంగీతం పట్ల ప్రశంసలు కురుస్తున్నాయి.
ఈ క్రమంలో థమన్ ఇటీవల ఇంటర్వ్యూల్లో చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. స్టార్ హీరోల సినిమాలకు సంగీతం అందించే ఆయన ఒక దశలో ఇండస్ట్రీలో తన మ్యూజిక్ ను ఆపేలా చేయాలని కొందరు ప్రయత్నించారని చెప్పుకొచ్చాడు. అందుకోసం పెద్ద కుట్రకే పూనుకున్నారనే విధంగా థమన్ ఇటీవల కామెంట్స్ ఉన్నాయి. ఆయనపై జరిగిన అసత్య ప్రచారం, ఆ బాధ నుంచి ప్రముఖ దర్శకుడు కాపాడాడని థమన్ వెల్లడించారు.

ఎస్ఎస్ థమన్ కామెంట్స్ ప్రకారం.. సూపర్ స్టార్ మహేశ్ బాబు - త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో చివరిగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం గుంటూరుకారం. ఈ చిత్రానికి థమన్ ఏ రేంజ్ మ్యూజిక్ ఇచ్చారో తెలిసిందే. కానీ ఎస్ఎస్ఎంబీ28గా వచ్చిన గుంటూరు కారం చిత్రానికి థమన్ సంగీతం అస్సలు వద్దని కొందరు కుట్ర పన్నారని థమన్ తెలిపారు. అందుకుగాను సోషల్ మీడియాలో 67.7 వేల నెగెటీవ్ ట్వీట్లు వేశారని చెప్పుకొచ్చారు.
థమన్ ను మహేశ్ బాబు సినిమా నుంచి తొలగించండి అంటూ నానా రచ్చ చేశారన్నారు. దాంతో థమన్ చాలా భాదపడ్డానని, ఆ వెంటనే త్రివిక్రమ్ శ్రీనివాస్ తో నేను వెళ్లిపోతున్నానని చెప్పాను. కానీ త్రివిక్రమ్ మాత్రం నాకు అండగా నిలిచాడు. ఇక ఆయన వల్లనే ఆ సినిమా పూర్తి చేసి నేషనల్ అవార్డు కూడా అందుకోగలిగాను. మరోవైపు మహేశ్ బాబు ఫ్యాన్స్ కూడా విమర్శిస్తూ ఉంటారు.
అసలు నేను మహేశ్ బాబు ప్రతి సినిమాకు మంచి మ్యూజిక్ ఇస్తుంటాను. బాబు ఫ్యాన్స్ నన్ను అపార్థం చేసుకోవడం బాధగా అనిపించింది. ఈ విషయంలో నేను చీకటి గదిలోకి వెళ్లి ఏడ్చేశాను కూడా. నేను ఎప్పుడూ మహేశ్ బాబుకు బ్యాడ్ మ్యూజిక్ ఇవ్వలేదు. ఆ సినిమా ఆడకపోతే నేనేమీ చేయగలను చెప్పండంటూ తన ఆవేదనను వ్యక్తం చేశారు. ఏదేమైనా ప్రస్తుతం థమన్ ఓజీతో తుఫాన్ రప్పించారు. ఇక నెక్ట్స్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ది రాజా సాబ్ చిత్రంతో అదరగొట్టేందుకు రెడీగా ఉన్నారు.


Click it and Unblock the Notifications











