twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మిడిల్ క్లాస్ ఆడియెన్స్ లేకపోతే సినిమా లేదు.. వాళ్లే దేవుళ్లు.. టికెట్ రేట్లపై ఘోస్ట్ మూవీ నిర్మాతలు హాట్‌గా

    |

    టాలీవుడ్ మన్మథుడు నాగార్జున నటించిన ది ఘోస్ట్ మూవీని రిలీజ్ చేస్తున్నాం. గరుడవేగ మాదిరిగానే ప్రవీణ్ సత్తారు స్టైల్‌లో, నాగార్జున ఇమేజ్‌కు తగినట్టుగా ఉంటుంది. నాగార్జున స్టైల్‌తోపాటు ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా మాస్‌గా ఈ సినిమా ఉంటుంది అని నిర్మాతలు సునీల్ నారంగ్, పుష్కర్ రామ్ మోహన్ తెలిపారు. దర్శకుడు ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో నాగార్జున అక్కినేని, సోనాల్ చౌహాన్ నటించిన ఈ చిత్రం దసరా కానుకగా అక్టోబర్ 5వ తేదీన రిలీజ్ అవుతున్నది. ఈ సందర్భంగా నిర్మాతలిద్దరూ మీడియాతో మాట్లాడుతూ..

    గాడ్ ఫాదర్‌తో భారీ కాంపిటీషన్

    గాడ్ ఫాదర్‌తో భారీ కాంపిటీషన్

    గాడ్‌ఫాదర్ సినిమాకు మాకు మంచి కాంపిటీషన్ ఉంది. కానీ రిలీజ్ విషయంలో వేరే డేట్ కోసం చాలా ప్రయత్నం చేశాం. కానీ కుదర్లేదు. అందుకే రిలీజ్ కోసం ముందుకు వెళ్తున్నాం. అయితే సాధారణంగా దసరా పండుగకు రెండు, మూడు సినిమాలకు స్కోప్ ఉంటుంది. దానిని దృష్టిలో పెట్టుకొని ది ఘోస్ట్ సినిమాను విడుదల చేస్తున్నాం. అంతే కాకుండా నాగార్జున నటించిన శివ అక్టోబర్ 5వ తేదీన రిలీజ్ అయింది. ఆ సెంటిమెంట్‌ను దృష్టిలో పెట్టుకొని సినిమా రిలీజ్ చేస్తున్నాం అని నిర్మాతలు సునీల్, రామ్మోహన్ రావు తెలిపారు.

    హిందీ రిలీజ్ లేదంటూ

    హిందీ రిలీజ్ లేదంటూ

    ది ఘోస్ట్ మూవీని హిందీలో రిలీజ్ చేయాలని ప్లాన్ చేశాం. ఇటీవల నాగార్జున నటించిన బ్రహ్మస్త్ర కూడా ఇటీవలే రిలీజై మంచి విజయం సాధించింది. అలాంటి అంశాలను దృష్టిలో పెట్టుకొని సినిమాను హిందీలో రిలీజ్ చేయాలని అనుకొన్నాం. అయితే నెట్‌ఫ్లిక్స్‌తో ఒప్పందం కారణంగా హిందీలో రిలీజ్ చేయలేకపోయాం. హిందీలో సినిమా రిలీజ్ చేస్తే.. 59 రోజుల తర్వాత ఓటీటీలో రిలీజ్ చేయాలనే రూల్ ఉంది. అందుకే హిందీ రిలీజ్ సాధ్యపడలేదు అని నిర్మాతలు వివరణ ఇచ్చారు.

    ది ఘోస్ట్‌ మూవీపై ఫుల్ కాన్ఫిడెన్స్

    ది ఘోస్ట్‌ మూవీపై ఫుల్ కాన్ఫిడెన్స్

    డిస్ట్రిబ్యూషన్ రంగం, సినిమా నిర్మాణ రంగంలో చాలా అనుభవం ఉంది. సునీల్ గారు 500 సినిమాలు రిలీజ్ చేశారు. నేను 300 సినిమాలు రిలీజ్ చేశాను. మనం ఎన్ని అంచనాలు వేసినా.. మనం ఎంత పబ్లిసిటీ చేసినా, ఎన్ని చెప్పినా తుది నిర్ణయం మాత్రం ప్రేక్షకులదే. కంటెంట్, కథ బాగుంటే సినిమా ఆడుతుంది. లేకపోతే ఆడదు. కానీ ది ఘోస్ట్ కంటెంట్ విషయంలో సినిమా మేము కాన్ఫిడెన్స్‌గా ఉన్నాం అని నిర్మాతలు చెప్పారు.

    టికెట్ రేట్లు తగ్గించాం..

    టికెట్ రేట్లు తగ్గించాం..

    ది ఘోస్ట్ సినిమా టికెట్లను తక్కువగానే ఉంచాం. మిడిల్ క్లాస్ ఫ్యామిలీలను థియేటర్‌కు రప్పించాలంటే టికెట్ రేట్లు తక్కువగా ఉండాలని భావిస్తున్నాం. మిడిల్ క్లాస్ ఆడియెన్స్ లేకపోతే సినిమా ఇండస్ట్రీ మనగడ లేదు. 80 శాతం మంది వాళ్లే సినిమా చూస్తారు. వాళ్లు రాకపోతే సినిమా లేదు. టికెట్ రేట్లు పెంచడం వల్ల ముంబై, ఢిల్లీలో నార్త్‌లో ఏం జరిగిందో చూశాం. మల్టిప్లెక్స్‌లో 200, రిక్లైనర్స్ 250 రేటుగా నిర్ణయించాం. సింగిల్ థియేటర్ 150 రూపాయలు పెట్టాం. గాడ్‌ఫాదర్ టికెట్ రేట్ కొంచెం పెంచాం. ప్రేక్షకులే దేవుళ్లు. వాళ్లు లేకుంటే మేము లేదు. పీవీఆర్ మల్టీప్లెక్స్‌లో కూడా టికెట్ రేట్లు తగ్గించే ప్రయత్నం చేస్తాను అని సునీల్ నారంగ్ చెప్పారు.

    ఓటీటీకి అలవాటు పడ్డారంటూ

    ఓటీటీకి అలవాటు పడ్డారంటూ

    ఇటీవల విడుదలైన సినిమాలకు ప్రేక్షకులు రావడం లేదనే విషయం ఆందోళన కలిగిస్తున్నది. కరోనా వైరస్ సమయంలో ఓటీటీకి అలవాటు పడ్డారు. ఓటీటీలో చూద్దామనే అనే ఫీలింగ్ పెరిగిపోయింది. చాలా సినిమాలు కంటెంట్ ఉన్నా ఆడలేదు. ఓటీటీ లేకపోతే కనీసం 50 రోజులు ఆడాల్సిన సినిమాలు పెద్దగా ఆడలేదు. పార్కింగ్ రేట్లు, ఫుడ్ రేట్లు కూడా ఎక్కువగా ఉన్నాయి. అలాంటి ఖర్చులను భరించడానికి ప్రేక్షకులు సిద్దంగా లేరు. టికెట్ రేట్లు, ఫుడ్ రేట్లు తగ్గిస్తే చిన్న సినిమాకు కూడా ప్రేక్షకులు వస్తారు అని సునీల్ నారంగ్ అన్నారు. సింగిల్ థియేటర్‌లో టికెట్ రేట్లు తగ్గించాలనే విషయం ఇటీవల చర్చ జరుగుతున్నది.

    ప్రేక్షకుడి అభిరుచి మారిందంటూ

    ప్రేక్షకుడి అభిరుచి మారిందంటూ

    కరోనా పరిస్థితుల తర్వాత ప్రేక్షకుల అభిరుచుల్లో మార్పులు చాలా వచ్చాయి. ఓటీటీ కారణంగా ప్రేక్షకుడికి వరల్డ్ సినిమా అందుబాటులోకి వచ్చింది. కాబట్టి సినిమా చూసే విధానం పెరిగిపోయింది. దాని వల్ల మా ఆలోచన కూడా మారిపోయింది. హీరోలు, సినిమాలోని క్యారెక్టర్ల విషయంలో మార్పులు తీసుకొస్తున్నాం. ప్రేక్షకులకు చక్కటి అనుభూతిని పంచే సినిమా కంటెంట్‌పై దృష్టిపెడుతున్నాం అని నిర్మాత రామ్మోహన్ రావు అన్నారు.

    English summary
    Producers Sunil Narang, Pushkar Ram Mohan Rao are coming with The Ghost movie Which acted by Nagarjuna Akkineni. This movie is set to release on October 5th. Here is Producer views about the movie.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X